రాయల తెలంగాణ వార్తల నేపథ్యంలో మనస్తాపం చెంది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త సారయ్య(40), ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు చెందిన పైతరి రామయ్య(58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు.
కరీంనగర్ జిల్లాలో ఇద్దరి మృతి
హుస్నాబాద్/ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: రాయల తెలంగాణ వార్తల నేపథ్యంలో మనస్తాపం చెంది కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్త సారయ్య(40), ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు చెందిన పైతరి రామయ్య(58) గురువారం గుండెపోటుతో మృతి చెందారు. సారయ్య బుధవారం రాత్రి తన ఇంట్లో టీవీల్లో వస్తున్న రాయల తెలంగాణ వార్తలు చూసి తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రాజయ్య సైతం ఇదే తరహా తుదిశ్వాస విడిచాడు. వీరిద్దరూ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా వ్యవహరించేవారని స్థానికులు పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.