పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది.
భూపాలపల్లి అర్బన్: పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేసుకున్న సంఘటన జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గురువారం జరిగింది. స్థానిక గుడ్ మార్నింగ్ రెసిడెన్షియల్ పాఠశాలలో సందీప్ వర్మ పదో తరగతి చదువుతూ పాఠశాల హాస్టల్‌లోనే ఉంటు న్నాడు. గురువారం మధ్యాహ్నం దోమలను చంపేందుకు ఉపయోగించే రసాయన ద్రవం తాగాడు. విద్యార్థులు, ఉపాధ్యాయులు వెంటనే సందీప్ ను సింగరేణి ఏరియా ఆస్పత్రికి, అనంతరం వరంగల్‌కు తరలించారు.