అంతర్జాతీయ సదస్సుకు భూపాలపల్లి చైర్‌పర్సన్ సంపూర్ణ
భూపాలపల్లి: పౌరుల భద్రత, విపత్తుల నివారణపై నవంబర్ 3 నుంచి 5 వరకు న్యూఢిల్లీలో నిర్వహించనున్న ఆసియా, పసిఫిక్ దేశాల సదస్సుకు హాజరుకావాలని భూపాలపల్లి నగర పంచాయతీ చైర్‌పర్సన్ బండారి సంపూర్ణకు సోమవారం ఆహ్వానం అందింది.
ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరుతూ కేంద్ర హోంశాఖ వ్యవహారాల కార్యదర్శి కార్యాలయం నుంచి ఆహ్వానం లభించింది. ఈ సందర్భంగా నగర పంచాయతీ కమిషనర్ నోముల రవీందర్, ఏఈ రవీంద్రనా«థ్, టీపీఓ ఖలీలుద్దీన్ , కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది చైర్‌పర్సన్ సంపూర్ణను అభినందించారు.