భార్య ముక్కు, చెవులు కోసిన భర్త | Husband chops off ears, nose of wife | Sakshi
Sakshi News home page

భార్య ముక్కు, చెవులు కోసిన భర్త

Published Tue, Sep 30 2014 10:07 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM

Husband chops off ears, nose of wife

వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. దాంతో విచక్షణ మరచిన భర్త...ఆమె ముక్కు, చెవులు కోసిన ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా భార్య రజితను అనుమానంతో  వేధిస్తున్నాడు.

 

ఇదే విషయమై గత రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పడుకున్న భార్య చేతులు, కాళ్లను మంచానికి తాడుతో కట్టేసిన శ్రీనివాస్...ఆమె ముక్కు, చెవులు కోశాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతూ మంచంలోనే పడి ఉన్న రజితను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో శ్రీనివాస్కు అతని తల్లి కూడా సహకరించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement