ears
-
చెవి తమ్మె పూర్తిగా తెగిపోతే..!
ఫ్యాషన్‌లో భాగంగానో లేదా తమ దుస్తులకు మ్యాచింగ్‌గా ఉంటాయనో కొందరు చాలా బరువైన ఇయర్ రింగ్స్‌ను వాడుతుంటారు. ఇలాంటి ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ ఎక్కువగా వాడుతుండటం లేదా హ్యాంగింగ్స్ తరచూ వేసుకుంటూ ఉండటంలో వాటి బరువు కారణంగా క్రమంగా చెవి రంధ్రం సాగితూ, ఆ రంధ్రం పెద్దదైపోయి ఒకదశలో చెవి తమ్మె పూర్తిగా తెగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇది పూర్తిగా తెగిపోయాక అప్పుడు రిపేర్ చేయించుకోవడం కంటే రంధ్రం పెద్దది అవుతున్న సమయంలోనే చేయించుకోవడం మంచిది. చాలా ఎక్కువ బరువుండే ఇయర్ రింగ్స్ లేదా హ్యాంగింగ్స్ కారణంగా చెవి బాగా సాగిపోయిన లేదా తెగిపోయిన చెవి తమ్మెను ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో బాధితులకు ఎలాంటి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం ఆ ప్రాంతం వరకు శరీరం మొద్దుబారేలా మత్తు (లోకల్ అనస్థీషియా) ఇస్తే సరిపోతుంది. రెండుగా చీలిపోయినట్లుగా తెగిన చెవి తమ్మెను నేరుగా ప్లాస్టిక్ సర్జరీ చికిత్సలోనైనా లేదా చికిత్స తర్వాత గాయం మానిన తర్వాతనైనా... సదరు గాయం మచ్చను కనపడకుండా చేసేందుకూ చికిత్స అందించడం వచ్చు ఇందులో భాగంగా చెవి తమ్మెను వంకరటింకరగా (జిగ్‌జాగ్)గా అతికిస్తూ నిపుణులు రిపేర్ చేస్తారు. అయితే ఇలా చెవి తమ్మెలను అతికించే ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. అయితే ఈ అతికింపు ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. చెవి రంధ్రం చీరుకున్న తీరును బట్టి బాధితులకు ఎలాంటి ప్రక్రియ అవసరమో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ తర్వాత వాళ్లతోనే మాట్లాడుతూ (కౌన్సెలింగ్ నిర్వహిస్తూ) వాళ్లకు అవసరమైన ప్రక్రియ గురించి వివరిస్తారు. వాళ్లు అంగీకరిస్తే అప్పుడు అతికింపు చికిత్స చేస్తారు. ఈ చికిత్సలో భాగంగా రెండుగా చీరుకున్న రంధ్రానికి కుట్లు వేయడం కోసం అత్యంత నాణ్యమైన, బయటకు కనపడని సున్నితమైన దారాన్ని ఉపయోగిస్తారు. ప్రక్రియ అంతా పూర్తయ్యాక చికిత్స నిర్వహించిన చోట కొన్నాళ్ల పాటు పైపూతగా ఉపయోగించే యాంటీబయాటిక్ క్రీమ్‌ను కొంతకాలం పాటు రాయాల్సి ఉంటుంది. కాక΄ోతే గాయం అంతా మానాక వెంటనే బయటకు కనపడదుగానీ... బాగా పరిశీలనగా చూస్తే ఓ పెన్సిల్‌తో గీసినంత సన్నగా ఉండే గీత అస్పష్టంగా కనిపిస్తుంది. ఈ అతికింపు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ చెవి కుట్టించుకోవాలంటే... చెవి రంధ్రం పూర్తిగా పూడిపోయాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆగి, అప్పుడు కుట్టించుకోవచ్చు. అయితే ఈసారి మళ్లీ అలాంటి చాలా బరువైన హ్యాంగింగ్స్ కాకుండా తేలికైనవి వాడుతూ మాటిమాటికీ చెవి తమ్మె తెగి΄ోకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చెవి తమ్మెలు బాగా లేతగా ఉండే చిన్నారి బాలికలూ, చెవి తమ్మెలో తగినంత స్థలం లేనివారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. డా. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్ (చదవండి: ఛాతీలో నీరు చేరితే...?) -
చెవులు, ముక్కు కుట్టించుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
ఇటీవల కొందరు కనుబొమల దగ్గర, పెదవుల దగ్గర, మరికొందరైతే నాభి దగ్గర కూడా బాడీ పియర్సింగ్ చేయించుకుంటున్నారు. గతంలో సాంప్రదాయికంగా బంగారపు ఆభరణాల తయారీ కళాకారులే ఈ చెవులు కుట్టడాన్ని చేసేవారు. ఇప్పుడైతే చాలాచోట్ల బ్యూటీ సెలూన్లలోనూ పియర్సింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడూ చాలామంది నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ చేయిస్తున్నారు.డాక్టర్ల దగ్గరే మేలు... ఇప్పుడు అధునాతన పియర్సింగ్ పరికరాలతో చెవులు, ముక్కు లేదా దేహంలో అవసరమైన చోట్ల పియర్సింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచిన లేదా స్టడ్స్గా ఉంచదలచిన బంగారు, వెండి తీగలను ముందుగానే డాక్టర్లు స్టెరిలైజ్ చేశాకే ముక్కుచెవులు కుట్టడం చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఆరోగ్యపరంగా డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ ప్రక్రియ జరగడం ఎంతో మంచిది. డాక్టర్ల ఆధ్వర్యంలో ఇలా స్టెరిలైజ్ చేశాకే బంగారు రింగు తొడగడం లేదా స్టడ్స్ తొడగడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇలా చెవి, ముక్కు కుట్టడం లేదా అలా కుట్టిన చోట తీగ / స్టడ్ వేయాల్సిన ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. పియర్సింగ్లో కలిగే అనర్థాలు... ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందూ, ఆ తర్వాతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ తర్వాత ఇది మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం : ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. ఇలా సిస్ట్ / గ్రాన్యులోమా / కీలాయిడ్ వచ్చే అవకాశం ఉన్నవారు చిన్నప్పుడే వేసిన రంధ్రం తప్ప మళ్లీ పియర్సింగ్ చేయించు కోపోవడమే మంచిది. మచ్చ ఏర్పడటం : కొన్ని సార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోండి... శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవీ లేనప్పుడే ముక్కు, చెవులు కుట్టించే ప్రక్రియకు వెళ్లాలి.చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అనుభవజ్ఞుల దగ్గరే ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోవడం మంచిది. చెవులు లేదా ముక్కు కుట్టించే ముందుగా ప్రీ–స్టెరిలైజ్డ్ స్టడ్స్ ఉపయోగించి చెవులు, ముక్కు కుడతారు. కాబట్టి అందరిలో అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చెవులు లేదా ముక్కు కుట్టడానికి 45 నిమిషాల ముందుగా లోకల్ అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చు. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడమే మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డర్మటాలజిస్ట్ / డాక్టర్ సలహా తీసుకోవడం మేలు. కీలాయిడ్స్ వచ్చే శరీర స్వభావం (శరీరంపై ఏదైనా గాయం అయినప్పుడు ఆ ప్రదేశంలో ఉబ్బినట్లు గా మచ్చ వచ్చే శరీర తత్వం) ఉన్నవారు బాడీ పియర్సింగ్కు వెళ్లకపోవడమే మంచిది. -
శబ్ధాలు, పరికరాలతో చెవిచిల్లు.. ఆధునిక జీవనశైలి చెవి‘నిల్లు’
ఇటీవలి కాలంలో వినికిడి సమస్యలతో ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వైద్యులు అంటున్నారు. వైద్యుల గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడిన తాజా అధ్యయనం ప్రకారం, ఒక బిలియన్ పైగా యువతకు వినికిడి లోపం ప్రమాదం పొంచి ఉంది. టీనేజర్లలో వినికిడి శైలిని విశ్లేషించి దాని ప్రకారం వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉన్న వారి సంఖ్యల గురించి పరిశోధకులు ఈ అంచనాను రూపొందించారు. కరోనా విజృంభణ సమయంలో, ఆన్లైన్ సమావేశాలు, స్నేహితులు కుటుంబ సభ్యులతో వీడియో కాల్లు లేదా అతిగా చూసే సెషన్ల కారణంగా, మనలో చాలా మంది గంటల తరబడి హెడ్ఫోన్లకు అతుక్కుపోయారు. ఇప్పుడు, కోవిడ్‌తో సంబంధం లేకుండా హెడ్ఫోన్లు రోజువారీ జీవితంలో భాగంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్లకు పైగా ప్రజలు ప్రస్తుతం వినికిడి లోపంతో బాధపడుతున్నారు. స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు ఇయర్‌బడ్‌లు వంటి వ్యక్తిగత శ్రవణ పరికరాల (పిఎల్డిలు) వాడకం తో పాటు పెద్ద ఎత్తున హైఓల్టేజ్‌తో ఉండే సంగీత వేడుకలకు హాజరుకావడం వంటివి వినికిడి పాలిట శాపాలుగా అధ్యయనం తేల్చింది. పరిమితి మించిన సంగీతధ్వని.. పెద్దలకు 80 డీబీ, పిల్లలకు 75 డీబీ మాత్రమే అనుమతించదగిన ధ్వని స్థాయి. వినియోగదారులు తరచుగా 105 డెసిబెల్ (డిబి) కంటే ఎక్కువ వాల్యూమ్లను ఎంచుకుంటున్నారని గతంలో ప్రచురించిన మరో పరిశోధన వెల్లడించింది, అయితే మ్యూజిక్ కన్సర్ట్స్, వినోద వేడుకల్లో సగటు ధ్వని స్థాయిలు 104 నుండి 112 డిబి వరకు ఉంటాయి. ఇందుగలదందు లేదని సందేహంబు లేదు.. ఇతర శబ్ధాల సమస్య లేకుండా సంగీతాన్ని ఆస్వాదించడానికి స్ట్రీమ్ సిరీస్, సినిమాలను చూడడానికి ఇష్టపడే యువతరం పెరిగింది. వీరు తరచుగా ఇయర్‌బడ్‌లు లేదా హెడ్ఫోన్లను ఉపయోగిస్తున్నారు. మెట్రో నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, చుట్టుపక్కల వారి మాటలు, శబ్ధాలు.. వగైరా తప్పించుకోవడానికి ఇయర్ఫోన్లు పెట్టుకుని వినడం సర్వసాధారణం. అంతే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా ఉండడానికి తమ వాల్యూమ్లను పెంచుతారు. మరోవైపు ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లు వినోదం మాత్రమే కాకుండా చాలా మందికి వృత్తిరీత్యా కూడా అవసరంగా మారాయి. ఏతావాతా ఈ ఆడియో గాడ్జెట్ల పెరుగుతున్న వినియోగం జుట్టు కణాలు, పొరలు, నరాలు లేదా చెవిలోని ఇతర భాగాలకు హాని కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఎక్కువ కాలం కొనసాగితే తాత్కాలిక లేదా శాశ్వత వినికిడి నష్టం కలిగిస్తుంది. వైద్యుల సూచనలివే.. ► టీవీ లేదా స్పీకర్లను లేదా హెడ్ఫోన్లు లేదా ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు వాల్యూమ్‌ను నియంత్రించండి. ► ఇయర్‌బడ్‌లు హెడ్ఫోన్లలో మీ పక్కన ఉన్న వ్యక్తి వినే స్థాయికి వాల్యూమ్ చేరకుండా జాగ్రత్తపడాలి. ► బ్యాక్‌గ్రౌండ్ శబ్దాలు వినపడకుండా తరచుగా వాల్యూమ్‌ను పెంచాల్సిన అవసరం రాకుండా బయటి నుంచి శబ్దం–రాకుండాచేసే ఇయర్ఫోన్లు హెడ్ఫోన్లను కొనుగోలు చేయండి. ► ఇయర్‌బడ్‌లు ఇయర్లోబ్ను కవర్ చేస్తాయి చెవికి అతి దగ్గరగా ఉంటాయి. మరోవైపు, హెడ్ఫోన్లు సంగీతపు వైబ్రేషన్‌ను నేరుగా చెవులకు పంపవు. కాబట్టి, దీర్ఘకాలంలో ఇయర్ బడ్స్ కన్నా హెడ్ఫోన్లకు మారడం మంచిది. ► ప్రతి 30 నిమిషాలకు 5 నిమిషాల విరామం లేదా ప్రతి 60 నిమిషాలకు 10 నిమిషాల పాటు చెవులకు విరామం ఇవ్వాలి. ► స్మార్ట్ఫోన్ల సెట్టింగ్‌లలో అనుకూల వాల్యూమ్ పరిమితిని కూడా సెట్ చేయవచ్చు. జాగ్రత్తలు అవసరం.. చెవిలో సున్నితమైన చర్మం, పొర ఉంటుంది. చెవికి రక్షణ కవచంగా కూడా పనిచేస్తుంటుంది. అయితే అతిగా ఇయర్ బడ్స్ వాడడం వల్ల ఈ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది. తద్వారా చర్మానికి ఇన్ఫెక్షన్స్ అవకాశాలు పెరుగుతాయి. వాక్స్ జిగిరీ అనే ఆ పొర పోయిదంటే... ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి వీటిని అతిగా వినియోగించకూడదు. ముఖ్యంగా డయాబెటిస్ వున్నవాళ్లు వీలున్నంత వరకూ అసలు వాడకూడదు. ఇయర్ డ్రమ్ ముఖ ద్వారం కాస్త పెద్దగా ఉన్నవాళ్ల కన్నా సన్నగా ఉన్నవాళ్లకి ప్రమాదం మరింత ఎక్కువ. వీళ్లు వాడేటప్పుడు దాన్ని ఇంకా ఇంకా లోపలికి తోస్తారు. అలా మరీ లోపలికి పెట్టడం వల్ల ఇయర్ డ్రమ్‌కు నష్టం కలుగుతుంది. వీలున్నంత వరకూ అవసరాన్ని బట్టి తప్ప ఎడాపెడా ఉపయోగించడం మంచింది కాదు. అలాగే వినికిడి సామర్ధ్యానికి హెడ్ ఫోన్స్, హై ఓల్టేజ్ సంగీతం కూడా హానికరమే. –డా.ఎం.ప్రవీణ్ కుమార్, ఇఎన్టీ సర్జన్ అమోర్ హాస్పిటల్స్ -
మేక చెవులు ‘కేక’.. చేటంత వెడల్పు, 19 ఇంచుల పొడవు.. వీడియో వైరల్
చేటంత చెవులు అని ఏనుగు చెవులను అంటుంటాం.. కానీ ఈ బుజ్జి మేక పిల్ల చెవులు చేటల్లా లేకున్నా.. చాంతాడంత పొడుగు మాత్రం ఉన్నాయి. ఎంతంటే.. ఈ మేక పిల్ల పుట్టినప్పుడు దానికంటే దాని చెవులే ఎక్కువ పొడవున్నాయట. పాకిస్తాన్‌లోని కరాచీలో ఓ రైతు ఇంట్లో జన్మించిన దీనికి ‘సింబా’అని పేరుపెట్టారు. ఏకంగా 19 అంగుళాల పొడవున్న చెవులతో ఈ మేక పిల్ల త్వరలోనే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కబోతోందని దాని యజమాని మహమ్మద్ హాసన్ చెప్తున్నాడు. చింత చిగురుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. దాని ఫొటోలను సోషల్‌మీడియాలో పెడుతూ సంబరపడిపోతున్నాడు. సాధారణంగా నుబియన్ జాతికి చెందిన మేకల చెవులు పొడుగ్గా ఉంటాయని.. కానీ ‘సింబా’చెవులు మాత్రం మరీ ఎక్కువ పొడవున్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ మేక పిల్లలో జన్యు మార్పిడిగానీ, ఏదైనా జెనెటిక్ సమస్యగానీ దీనికి కారణం కావొచ్చని అంటున్నారు. అది ఎర్రటి రంగేసిన ఆకర్షణీయమైన వంటకమా? అయితే డేంజరే! -
చెవులు జాగ్రత్త..!
‘‘వినదగునెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడె పో నీతిపరుడు మహిలో సుమతీ !’’..అన్న బద్దెనగారి పద్యాన్ని చూద్దాం. భగవంతుడు మనకు రెండు చెవులు, ఒక నోరు ఇచ్చాడు. నిజానికి మనం అనేక విషయాలను తెలుసుకోవడం చెవుల ద్వారానే సాధ్యం. ‘భద్రం కర్ణేభిః శ్రుణుయామ దేవాః..’’ అంటుంది వేదం. అంటే –మా చెవులు భద్రముగా ఉండుగాక, ఎల్లవేళలా అవి శుభప్రదములైన వాటినే వినుగాక...’’ అని. ఎంతమంది చెప్పిన మంచి మాటలు వింటే అంత గొప్ప శీలవైభవం ఏర్పడుతుంది. వాటిని ఎప్పుడూ వింటూ ఉండాలి. అయితే వినేటప్పుడు ఏవి మంచిమాటలో ఏవి హానికరమో మనకు ముందుగా తెలియదు కదా..అందుకే ఎవరు ఏది చెప్పినా వినగలగడం వాటిలో మంచిని స్వీకరించగలగడం అనేది ఒక గొప్ప కళ. ఈ నేర్పరితనం మనకు రావాలంటే... మహాత్ములయిన వారితో కలిసి తిరుగుతూ ఉండాలి. అటువంటి వారు చెప్పే మాటలతో ... ఒక గ్రంథాలయంలో కూర్చుని చదివితే లభించే సమాచారం కన్నా ఎక్కువగా దొరుకుతుంది.. అదికూడా వివేకం, విచక్షణా జ్ఞానంతో కలిసి లభిస్తుంది. అందుకే రామాయణంలో ... రావణుడితో మారీచుడు మాట్లాడుతూ... ‘‘సులభాః పురుషా రాజన్ సతతం ప్రియవాదినః ’ అప్రియతస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ’’..అంటాడు. లోకంలో మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా ..‘‘బాగుంది. మంచిపని చేస్తున్నావు. నీకిష్టమయింది నీవు చేయకపోతే ఎవరు చేస్తారు, నీ సంతోషం కన్నా గొప్పదేముంటుంది !..’’ అంటూ మనల్ని తప్పుత్రోవలో ప్రోత్సహించేవారు చాలా మంది కనబడతారు. కారణం? ‘‘ఇప్పుడు వీడికి మంచి చెప్పినా వింటాడాం ఏం!’’ అనుకుంటారు. అంతే తప్ప ‘ఇది తప్పు. నీవిలా చేయవద్దు’ అని చెప్పేవారు చాలా చాలా అరుదుగా ఉంటారు. నిజంగా మన అభివృద్ధిని కోరుకునేవారు, మనమంటే ప్రేమాభిమానాలు ఉన్న... తాతలు, తల్లిదండ్రులు, గురువులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, మేనమామ, మేనత్తలవంటివారు... మన మనసు కష్టపడుతుందని తెలిసినా, మనకు ఏది మంచో ఏ మాటలు ఆచరణలో పెడితే మనం వద్ధిలోకి వస్తామో... అటువంటివి నిర్మొహమాటంగా మనకు చెపుతారు. సాలగ్రామం ఎక్కడుంటుంది? రాళ్లకుప్పలోనే కదా! అన్ని రాళ్లు పరిశీలనగా వెతుకుతుంటే సాలగ్రామం దొరుకుతుంది. అలాగే అక్కరలేని మాటలు, మన మనసును ఆకట్టుకోవడానికి మనకు హానికరమని తెలిసి కూడా ప్రీతితో అదే పనిగా పొగుడుతూ మాట్లాడే మాటలు.. అప్పటికి మన మనసుకు ఆహ్లాదం కలిగించినా వాటిని గుర్తెరిగి మసలుకోవాలి. రామకృష్ణ పరమహంస చెప్పినట్లు ‘చేతులకు నూనె రాసుకొని పనస తొనలు తీసేవాడికి దాని పాలజిగురు అంటదు. అంతే. జాగ్రత్తలు తీసుకోవాలి తప్ప అసలు ప్రయత్నం మానకూడదు.. వినాలి ఎవరు ఏది చెప్పినా వినాలి. వాటిలో మనకు ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేవాటిని వదిలేయాలి. అదే మారీచుడు చెప్పింది... హితం కోరి చెప్పేవాడి మాట మనసుకు కఠినంగా తగిలినా...స్వీకరించాలి. మంచి చెప్పేవాడు దొరకనే దొరకడు. అటువంటివాడు దొరికినా ఓపికగా వినేవాడు దొరకడు. మంచి చెప్పేవాడు, శ్రద్ధగా హితోక్తులు వినేవాడు ఒకేచోట సర్వసాధారణంగా దొరకరు. దొరికితే అది తీర్థం. అది క్షేత్రం. కారణం– ఫలితం వారిద్దరికే కాదు దేశకాలాలతో సంబంధం లేకుండా అందరికీ అన్వయం అవుతుంది. సూక్తి సుధ ► జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకూడదు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది. ► నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు. ► ఎప్పుడూ పొందనిది కావాలంటే ఎప్పుడూ చేయని కృషి చేయాలి. ► భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు భయపడేవారు ఏమి సాధించలేరు. ► సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
చెవుల్లో కూడా కరోనా వైరస్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందనే అంచనాలను తాజాగా పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. చెవి వెనుక ఉన్న పుర్రె, చెవిలోని మాస్టాయిడ్ ఎముకకు కూడా ఈ వైరస్ సోకుతుందని కొత్త పరిశోధన తేల్చింది. కోవిడ్-19 తో మరణించిన రోగులపై హెడ్ అండ్ నెక్ శస్త్రచికిత్స విభాగం నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి. (కరోనా అంతం సాధ్యం కాదు!) జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ముగ్గురుపై చేసిన ఒక చిన్న అధ్యయనంలో, ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనుక చెవిలో కూడా అధిక వైరల్ లోడ్లు ఉన్నట్టు గుర్తించారు. కరోనాతో చికిత్స పొంతుదున్న రోగుల మరణానికి ముందు వారి నమూనాలను సేకరించి ఈ పరిశోధన నిర్వహించినట్టు వెల్లడించారు.ఇప్పటి వరకు ముక్కు, గొంతు, ద్వారా ఊపిరితిత్తులలోకి పాకుతుందని అందరికీ తెలుసు. చెవిలోని ప్రధాన భాగమైన మస్టాయిడ్ (కర్ణభేరి) ప్రాంతంలో వైరస్‌ను తాజాగా గుర్తించారు. 80 ఏళ్ల మహిళకు కుడి మధ్య చెవిలో మాత్రమే వైరస్ రాగా, 60 ఏళ్ల వ్యక్తికి ఎడమ, కుడి కర్ణబేరిలోనూ, ఎడమ,కుడి మధ్య చెవులలో వైరస్‌ను గుర్తించామని తెలిపారు. అయితే కరోనా అత్యంత తీవ్రంగా ఉండేవారికి మాత్రమే చెవుల్లోకి ప్రవేశిస్తుందా లేదంటే బయట నుంచి చెవుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందా అనేదానిపై స్పష్టత లేదని, దీనిపై మరిన్నిపరిశోధనలు అవసరమని వీరు భావిస్తున్నారు. చెవుల స్వాబ్‌ను కూడా పరిశీలించాలని ఈ అధ్యయన బృందం సర్జన్లను హెచ్చరించింది. అలాగే సకింగ్ ట్యూబ్స్ ద్వారా మధ్య చెవి స్వాబ్ సేకరించే సమయంలో సర్జన్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. హెన్రీ ఫోర్డ్‌లోని ఓటోలారింగాలజీలో ఈ స్టడీ ప్రచురితమైంది. కరోనా వైరస్ చెవి ఇన్ఫెక్షన్లు లేదా చెవి సమస్యలతో ముడిపడి ఉందని వెల్లడి కావడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్, 2020 నాటి ఒక అధ్యయనంలో కరోనా రోగుల్లో చెవిపోటు, వినికిడి లోపం లాంటి లక్షణాలను కనుగొన్నారు. అంతకుముందు వినికిడి సమస్యల చరిత్ర లేకపోయినా, కరోనా సోకిన తరువాత ఈ సామర్ధ్యం క్షీణించినట్టు మరో అధ్యయనంలో కనుగొన్నారు. -
మూడు చెవులతో వింత లేగ దూడ
సాక్షి, నిర్మల్ : సాధారణంగా ఆవులకు రెండు చెవులు మాత్రమే వుంటాయి. కానీ పాక్పట్ల గ్రామం కేసరి గంగారెడ్డికి చెందిన ఓ ఆవు సోమవారం ఉదయం ఓ లేగదూడకు జన్మనిచ్చింది. అయితే ఆ దూడకు రెండు చెవులతో పాటు శిరస్సు పై భాగంలో మరో చెవు కూడా ఉండటంతో మూడు చెవులతో వింతగా పుట్టిన లేగదూడను చూడటానికి గ్రామస్తులు తరలివస్తున్నారు. జన్యుపరమైన లోపాల వలన ఇలాంటివి జరగుతాయని మండల పశువైద్యాధికారి మహేష్ తెలిపారు. -
చెవిన వేసుకోండి
ఇయర్ రింగ్స్ ఎప్పుడూ ట్రెండీలుక్‌నే ఇస్తాయి. మరీ ముఖ్యంగా చెవుల నుంచి భుజాల వరకు వేలాడే హ్యాంగింగ్స్‌ను చూస్తే ఎవరికైనా ఒకసారి పెట్టుకోవాలని మనసు పోతుంది. ఎవరైనా పెట్టుకున్నప్పుడు అవి బాగున్నాయని అలాంటివే కొంటే... అవి మన ముఖానికి నప్పకపోతే ఎలా? అందుకే మన ముఖాకృతిని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. ►ఓవల్ షేప్ ముఖానికి ఏ మోడల్ అయినా చక్కగా నప్పుతుంది. చెవులకు అంటినట్లుండే దిద్దుల నుంచి మీడియం సైజు లోలకుల వరకు అన్నీ బాగుంటాయి. ఇక భుజాలను తాకే హ్యాంగింగ్స్ అయితే చెప్పక్కరలేదు. ఎంతమందిలో ఉన్నా ప్రతి ఒక్కరి దృష్టి వాటి మీద, వాటిని అలంకరించుకున్న వాళ్ల మీద కొన్ని సెకన్లపాటు కేంద్రీకృతమవుతుంది. ఈ ఫేస్‌కట్‌కి మెటల్, బీడ్స్, స్టోన్స్ ఏవైనా నప్పుతాయి. ►స్క్వేర్ ముఖాకృతి ఉన్న వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ముఖం ఆకారానికి పూర్తి విరుద్ధంగా ఉండాలి చెవి ఆభరణాలు. కొట్టొచ్చినట్లు కనిపించేవిగా కాకుండా పొందికగా ఉన్నట్లనించే మోడల్స్ తీసుకోవాలి. అందులో వాడిన బీడ్స్ రంగులు కూడా హుందాగా ఉండాలి. ►హార్ట్ షేప్ ముఖానికి చెవుల దగ్గర తక్కువగా ఉండి కింద వేళ్లాడే భాగం వెడల్పుగా ఉంటే ముఖం అందంగా కనిపిస్తుంది. దీనినే ట్రయాంగిల్ ఫేస్ అని కూడా అంటారు. నుదురు వెడల్పుగా ఉండి చెంపలు పలుచగా, కింది దవడలోపలికి, గడ్డం కొనదేలి ఉంటుంది. చెవుల నుంచి గడ్డం మధ్యలో ఉన్న గ్యాప్‌ని హ్యాంగింగ్స్ ద్వారా కవర్ చేయగలిగితే ఆ ఇయర్ రింగ్స్ వాళ్ల కోసమే డిజైన్ చేశారా అన్నట్లుంటుంది. ►రౌండ్ ముఖానికి ఇయర్ రింగ్స్ సైజు, పొడవు మీద దృష్టి కేంద్రీకరించాలి. మెడ పొడవును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. పొడవు హ్యాంగింగ్స్ కాని మీడియం సైజు లేదా చెవిని అంటిపెట్టుకుని ఉంటే దిద్దులు ఏవైనా బావుంటాయి. వాటి డిజైన్‌లో రౌండ్ ఉండకూడదు, ఓవల్ షేప్ కాని, నలుచదరం లేదా ఒకదాని కింద మరొకటిగా వేలాడదీసినట్లు ఉండాలి. ఈ ముఖానికి బీడ్స్ కూడా అందం తెస్తాయి. -
పాపాయికి చెవులు కుట్టిస్తున్నారా?
ఆడపిల్లలైతే వారు ఓ ఏడాది వయసుకు చేరగానే చెవులు కుట్టించడం మన సంప్రదాయం. దీనికి మతాలూ, కులాలన్న తేడా లేదు. అలాగే కాస్తంత పెద్ద వయసు రాగానే అమ్మాయిలు ముక్కు కూడా కుట్టించుకుంటున్నారు. ఇటీవల అయితే కేవలం చెవి తమ్మెకు ఒక చోట మాత్రమే కాకుండా... ఇంకా రెండు మూడు రంధ్రాలు కూడా పెట్టి ఆభరణాలు ధరిస్తున్నారు. ఇలా చెవులు కుట్టించుకోవడంలో కాస్తంత సంప్రదాయంతో పాటు... బోల్డంత కాస్మటిక్ ప్రయోజనాలు కూడా చూస్తున్నారు ఈకాలం మహిళలు. గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారు లేదా వెండి వైర్స్తో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీ సెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్సింగ్ గన్స్‌తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచుకున్న బంగారు, వెండి తీగలను ముందుగా స్టెరిలైజ్ చేసి ఈ పని చేస్తున్నారు. ఇలా చెవి, ముక్కు లేదా స్టడ్ వేయాల్సిన ఇతర ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే కుట్టించిన ముక్కు, చెవులు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉండటంతో పాటు అవి ఆరోగ్యంగా కూడా ఉంటాయి. చెవులు ముక్కు కుట్టించడంలో సహజంగా తలెత్తే సమస్యలు ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం: ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. మచ్చ ఏర్పడటం : కొన్నిసార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డెర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి ►చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవడం మంచిది. ►మన శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడే మీరు ఈ కుట్టించుకోవడం చేయండి. ►చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోండి. ►సాధారణంగా బంగారు, వెండి వైర్లతో కుట్టే సమయంలో అది చాలావరకు ఎలాంటి హానీ చేయదు. కానీ.. ముందుగానే ఆ వైర్లను స్టెరిలైజ్డ్ సొల్యూషన్‌లో శుభ్రపరచుకుని ఉండటం ఎందుకైనా మంచిది. ►చిన్న పోటుతో నొప్పిలేకుండానే కుట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరీ నొప్పిగా ఉంటే తప్ప... సాధ్యమైనంత వరకు అనస్థీషియా ఉపయోగించకూడదు. మీరు ఒకేసారి రెండుచోట్ల రంధ్రాలు వేయించడం వంటివి చేస్తున్నప్పుడు మాత్రం లోకల్ అనస్థీషియా క్రీమ్ పూయడం మంచిది. ►తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడం మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం. -
చెవులకు కఫ్స్
చెవి బుట్టలు, రింగులు, హ్యాంగింగ్స్‌లో వచ్చిన ఎన్నో డిజైన్లు తెలిసినవే. చెవి మొత్తాన్ని సింగారిస్తూ, చూడగానే ఆకట్టుకునే ఇయర్ కఫ్స్ నేటితరాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జుంకీలుగా వేలాడుతూ.. చెవి అంచుల వరకు ఉండేవి కొన్ని. మరికొన్ని దుద్దుల్లా చెవి భాగాన్ని పై వరకు పట్టి ఉంచుతాయి. ఈ కఫ్ ఇయర్ రింగ్స్ చెవినుండి పక్కకి పడిపోకుండా పోగు పైభాగంలో చిన్న కొక్కెం ఉంటుంది. రంధ్రం అక్కర్లేకుండా దాన్ని చెవికి పట్టి ఉంచేలా నొక్కితే సరిపోతుంది. డిజైన్స్ విషయానికి వస్తే లతలూ, పువ్వులూ, చేపలూ, జంతువుల బొమ్మలతో పాటు ఎన్నో ఫంకీ డిజైన్లు వీటిలో వస్తున్నాయి. బంగారమే కాదు బ్రాస్, స్టీల్.. ఇతర లోహాలతోనూ ఇయర్ కఫ్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటిని సందర్భాన్ని బట్టి ధరించవచ్చు. -
ముక్కు, చెవులు కోసిన కుమారుడు
కేకే.నగర్: తాగడానికి డబ్బులివ్వలేదని కన్న తండ్రి చెవులనే కోసాడు కన్న కొడుకు. ఆగ్రహంతో తండ్రిపై దాడిచేసి కత్తితో ముక్కు, చెవులు కోసి కొడుకు పరారైనాడు.ఈ సంఘటన చెన్నై పుదుపేట సౌత్‌లో జరిగింది. మోసల్ (50) కుమారుడు వేలాంకని అలియాస్ వేలా (38). ఈ ప్రాంతంలో రౌడీగా చెలామణి అవుతున్నాడు. ఇతనిపై హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. గురువారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులు తండ్రిని అడిగాడు. ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో చుట్టుపక్కల వారు వేలాను సమాధానపరచి బయటికి పంపారు.అర్ద రాత్రి పొద్దు పోయాక ఇంటికి వచ్చిన కుమారుడు. ఆదమరచి నిద్రపోతున్న తండ్రి ముక్కు, చెవులను కత్తితో కోసి పరారైయ్యాడు. రక్తం మడుగులో పడి ఉన్న మోసల్ను ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. దీనిపై మోసల్ ఎగ్మూర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న వేలా కోసం పోలీసులు గాలిస్తున్నామని తెలిపారు. -
చీమ కుట్టినట్టు కూడా ఉండదు!
గతంలో ఆభరణాలు తయారు చేసేవారే బంగారం లేదా వెండి తీగలతో చెవులు లేదా ముక్కు కుట్టడం చేసేవారు. ఇప్పుడు బ్యూటీసెలూన్లలో కూడా ఇది చేస్తున్నారు. అయితే డాక్టర్ ఆధ్వర్యంలోనే చేస్తున్నారు. ఇప్పుడు అధునాతన పియర్సింగ్ గన్స్‌తో చెవులు, ముక్కు లేదా అవసరమైన చోట్ల కుట్టడం జరుగుతోంది. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచుకున్న బంగారు, వెండి తీగలను ముందుగా స్టెరిలైజ్ చేసి ఈ పని చేస్తున్నారు. ఇలా చెవి, ముక్కు, లేదా స్టడ్ వేయాల్సిన ఇతర ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. ఆ అనర్థాలను దృష్టిలో పెట్టుకుని కాసిన్ని జాగ్రత్తలు తీసుకుంటే ముక్కు, చెవులు కుట్టించడం మరింత అందంగా, ఆకర్షణీయంగా చేయవచ్చు. అనర్థాలు ఇవి... ఇన్ఫెక్షన్స్: కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. సిస్ట్/గ్రాన్యులోమా ఏర్పడటం: ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్‌కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. మచ్చ ఏర్పడటం: కొన్నిసార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలర్జీలు: కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు... చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని విచారించడం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేయడం మంచి పద్ధతి. చెవులు, ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోండి.మన శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఉన్నప్పుడే మీరు ఈ కుట్టించుకోవడం చేయండి. సాధారణంగా బంగారు, వెండి వైర్లతో కుట్టే సమయంలో అది చాలావరకు ఎలాంటి హానీ చేయదు. కానీ... ముందుగానే ఆ వైర్లను స్టెరిలైజ్డ్ సొల్యూషన్‌లో శుభ్రపరచుకుని ఉండటం ఎందుకైనా మంచిది.చిన్న పోటుతో నొప్పిలేకుండానే కుట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి మరీ నొప్పిగా ఉంటే తప్ప... సాధ్యమైనంత వరకు అనస్థీషియా ఉపయోగించకూడదు. మీరు ఒకేసారి రెండుచోట్ల రంధ్రాలు వేయించడం వంటివి చేస్తున్నప్పుడు మాత్రం లోకల్ అనస్థీషియా క్రీమ్ పూయడం మంచిది. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడం మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ -
తాళాలు, చెవులు
హ్యూమర్‌ప్లస్ తాళం పుట్టినపుడే దొంగతనం పుట్టింది. దొంగలతో పాటు పోలీసులూ పుట్టారు. వాళ్లకు జీతాలివ్వడానికి ప్రభుత్వాలు, ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఓటర్లు పుట్టారు. తాళం వల్ల ఏర్పడిన అనవసర మేళమిది. ప్రపంచంలో అన్నింటికీ తాళమేసేవాళ్లు ఉంటారు. ఏ తాళాన్నయినా తీసిపడేసే వాళ్లూ ఉంటారు. తాళమంటూ ఉన్న తరువాత చెవి కూడా ఉంటుంది. చెవులతో పనిలేకుండా చేతులతో పని చేసేవాళ్లని దొంగలు అంటారు. తాళం చెవులు అనేకరకాలుగా ఉన్నట్టే దొంగలు కూడా డిఫరెంట్‌గా ఉంటారు. వెనుకటికి కన్నం దొంగలుండేవాళ్లు. ఇప్పుడు కన్నం వేసేంత పటిష్టంగా గోడలు లేవు. అపార్ట్మెంట్ గోడకి కన్నం వేయడానికి ప్రయత్నిస్తే మొత్తం బిల్డింగే కూలిపోయే ప్రమాదముంది. బిల్డర్లు గట్టివాళ్లే కానీ బిల్డింగ్లు కాదు కదా! పూర్వం కృష్ణ సినిమాల్లో పనీపాటా లేని వాళ్లు నిధిని తీసుకెళ్లి చచ్చీచెడి కొండగుహల్లో పెట్టేవాళ్లు. అంతటితో ఆగకుండా ఐదారు లావాటి తాళాలు వేసి, ఆ చెవుల్ని తలా ఒకటి పంచుకుని గుర్రాలేసుకుని ఎవరిళ్లకు వాళ్లు వెళ్లేవాళ్లు. ఇందులో ఒకాయన చేయి తిరిగిన చిత్రకళా నైపుణ్యంతో మ్యాప్ గీసేవాడు. ఇది విలన్ సత్యనారాయణకి తెలిసి చిత్రహింసలు పెట్టి మ్యాప్‌ని స్వాధీనం చేసుకునేవాడు. అప్పుడొస్తాడు కృష్ణ. గిటార్ వినిపిస్తుంటే, రివాల్వర్ పొగని ఊదుతూ, మంచివాళ్లకి మంచివాణ్ణి, మోసగాళ్లకి మోసగాణ్ణి అంటూ చెయ్యంత పొడవున్న ఒక్క తాళాన్ని స్వాధీనం చేసుకుంటూ చివరికి ఆ నిధిని పేదవాళ్లకి పంచేస్తాడు. కృష్ణ సినిమాలు చూసిన తరువాత నిధి తాళాలు ఎక్కడైనా దొరుకుతాయేమోనని మేము ఎంతో ప్రయత్నించాం. సైకిల్ తాళాలు కూడా దొరకలేదు. గోడలకి చెవులుంటాయో లేదో తెలియదు కానీ, కొన్ని ఇళ్ల గోడలకి తాళం చెవులు తప్పకుండా ఉంటాయి. మా మిత్రుడు ఒకాయన ఎండాకాలంలో తలుపులు తెరిచి నిద్రపోయాడు. నిద్రపట్టని ఒక దొంగ ఇంట్లోకి వచ్చి గోడకి ఉన్న బీరువా తాళాలు తీసుకుని బీరువా తెరిచాడు. అది పాతకాలం గాడ్రేజ్ బీరువా. తలుపు తీస్తే ‘కుయ్యోకిక్కిక్’మని రెండు వీధులకి వినిపించేలా సౌండొస్తుంది. అయినా మనవాడు లేవలేదు. దొంగ తన విధి ధర్మాన్ని వీడలేదు. దొంగ చేతికి తాళాలివ్వడం అని ఒక సామెతుంది. ప్రజాస్వామ్య పారిభాషిక పదమిది. ఎవరు మనకు చెవులు మూసి చావగొడతారో వాళ్లకే మనం తాళం చెవులు అప్పగిస్తాం. ఒక చిన్న రంపంతో తాళం చెవి పళ్లుతోమి, ఏ తాళమైనా తెరిచేవాళ్లుంటారు. వాళ్లు రోడ్డు మీద పేదరికంతో ఉంటారు. తాళం తీయడం తెలిసిన ప్రతివాడు దొంగకాదు. మా ఊళ్లో చిన్న ఏడుకొండలు అని ఒకాయన ఉండేవాడు. ఆయన మొలతాడుకి ఒక పొడుగాటి తాళముండేది. బీరువాలో బంగారు నాణాలు దాచాడని అందరూ అనుకునేవారు. కొడుకులు కోడళ్లు కూడా మర్యాదగా చూసేవాళ్లు. బీరువాలో ఏముందో ఆయనకి తప్ప ఇంకెవరికీ తెలియదు. ఒకరోజు పోయాడు. కొడుకులు కోడళ్లు ఆదరాబాదరాగా బీరువా తెరిచారు. నాలుగు గణేష్ బీడీల కట్టలు, రెండు అగ్గిపెట్టెలు కనిపించాయి. మన ఆత్మ తృప్తి కోసం ఇళ్లకి తాళాలు వేసుకుంటాం గానీ దొంగలనుకుంటే అవొకలెక్కా? తాళం హృదయం దొంగలకి అర్థమైపోతుంది. దాని పొట్టలో ఎన్ని లీవర్లున్నాయో కనిపెడతారు. తాళాల జాతకం దొంగలకి తెలిసినట్టే, దొంగల జాతకం పోలీసులకి తెలిసిపోతుంది. ఒక్కో దొంగకి ఒక్కో స్టయిలుంటుంది. అన్ని స్టయిల్స్ తెలిసిన స్టయిల్ కింగ్స్ పోలీసులు. దేవుడు మనల్ని సంకెళ్లతో పుట్టిస్తాడు. కీ ఎక్కడుందో తెలుసుకోడానికి జీవితమంతా ప్రయత్నిస్తాం. దొరికేసరికి మనం సంకెళ్లకి అలవాటు పడివుంటాం. అవి లేకుండా జీవించలేం.మృచ్ఛకటికం నాటకంలో ఒక దొంగ కళాత్మకంగా కన్నం వేస్తాడు. దొంగ నేర్పుని చారుదత్తుడు ప్రశంసిస్తాడు. దొంగల్ని ప్రశంసించే చారుదత్రులతో రాబోయే రోజుల్లో లోకం నిండిపోతుందని బహుశా శూద్రక మహాకవి ఊహించి ఉండడు. మనం ప్రశాంతంగా జీవించాలంటే తలుపుల కంటే నోటికే ఎక్కువ తాళం అవసరం. - జి.ఆర్. మహర్షి -
ఫేస్ ద ప్రాబ్లమ్స్
సమస్యల్ని ఫేస్ చేయడం కష్టమే సమస్య వచ్చాక ఫేస్ చేయడం ఇంకా కష్టం ఫేస్‌లో ఉన్న... కళ్లు, ముక్కు, చెవులు, నోరు ప్రాబ్లమ్స్‌ను ఎలా ఫేస్ చేయాలో చూద్దాం అంతకంటే ముందు వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం! చెవి చెవి ఇన్ఫెక్షన్ అందరిలోనూ చెవుల నుంచి గొంతులోకి ఒక యూస్టేషియన్ ట్యూబ్ అనే నాళం ఉంటుంది. అలర్జీలు లేదా జలుబు వంటి ఇన్ఫెక్షన్ల వల్ల యూస్టేషియన్ ట్యూబ్‌లోకి క్రిములు చేరుతాయి. అవి మధ్యచెవికి చేరినప్పుడు పిల్లల్లో తీవ్రమైన చెవి నొప్పి వస్తుంది. ఈ కారణం వల్లనే కొందరు పిల్లల్లో జలుబు చేసిన తర్వాత చెవి నొప్పి వస్తుంది. నిర్ధారణ : ఓటోస్కోప్ ఉపయోగించి ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. చికిత్స : యాంటీబయాటిక్స్, యాంటీ అలర్జీ మందులతో ఈ సమస్యకు చికిత్స చేస్తారు. ఇది దీర్ఘకాలిక సమస్య (క్రానిక్)గా మారినప్పుడు పిల్లల వినికిడిని తెలుసుకునే ఆడియోగ్రామ్ పరీక్ష, చెవిలోని పొర ఇయర్ డ్రమ్ సాధారణంగా కదులుతుందో లేదో తెలుసుకునే టింపనోగ్రామ్ పరీక్షలు అవసరం కావచ్చు. నివారణ: జబులు చేసిన వ్యక్తుల నుంచి పిల్లలను దూరంగా ఉండటం, చేతులను శుభ్రంగా కడగడం, మురికి చేతులను ముక్కుకు, కళ్లకు అంటకుండా చూడటం వంటి జాగ్రత్తలతో పిల్లలను చెవి ఇన్ఫెక్షన్ల నుంచి నివారించవచ్చు. ముక్కు సైనసైటిస్ ముక్కుకు ఇరువైపులా ముఖంలో గాలి ఉండే కొన్ని ఖాళీ స్థలాలు ఉంటాయి. ఈ ఖాళీ స్థలాలలో వచ్చే ఇన్ఫెక్షన్ను సైనసైటిస్ అంటారు. సాధారణంగా పిల్లల్లో జలుబు లేదా అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ తర్వాత ఈ సమస్య కనిపిస్తుంటుంది. ఇది వచ్చిన వారిలో ముక్కు కారడం, తలనొప్పి, నోటిదుర్వాసన (బ్యాడ్ బ్రెత్), దగ్గు, జ్వరం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. నిర్ధారణ : ఎక్స్‌రే, సీటీ స్కాన్, సైనస్ స్రావాల కల్చర్ పరీక్షలతో ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. చికిత్స : యాంటీబయాటిక్స్, అసిటమైనోఫెన్, ఛాతీ పట్టేసినట్లు ఉండటాన్ని తగ్గించే డీ కంజెస్టెంట్స్తో చికిత్స చేయవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అవసరం కావచ్చు. అలర్జిక్ రైనైటిస్ ఏదైనా సరిపడని పదార్థం ముక్కులోకి వెళ్లి, అది తీవ్ర ఇబ్బంది కలిగించడాన్ని అలర్జిక్ రైనైటిస్ అంటారు. ఇది కుటుంబ చరిత్రలో ఉండే రుగ్మత. సాధారణంగా పుప్పొడి, దుమ్ములో ఉండే డస్ట్‌మైట్స్, బొద్దింకలు వాటి విసర్జకాలు, జంతువుల ఒంటి నుంచి వెలువడే వాసనలు, పొగాకు పొగ వంటివి అలర్జిక్ రైనైటిస్‌కు కారణమవుతాయి. లక్షణాలు : ఈ సమస్య ఉన్నవారిలో తుమ్ములు, ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం, ముక్కులో దురద, ముక్కు కారుతూ ఉండటం వంటివి కనిపిస్తాయి. నిర్ధారణ : కుటుంబ వైద్య చరిత్రతో పాటు బయటకు కనిపించే లక్షణాల ఆధారంగా ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు. నివారణ / చికిత్స: ఈ సమస్యను ప్రేరేపించే అంశాల నుంచి దూరంగా ఉండటం ద్వారా నివారించవచ్చు. పుప్పొడి వ్యాపించే సీజన్లో ఎయిర్కండిషన్లో ఉండటం, దుమ్ము ధూలికి ఎక్స్పోజ్ కాకపోవడం, బూజు, పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం కూడా నివారణకు మంచి మార్గం. ఇక యాంటీహిస్టమైన్స్, కార్టికోస్టెరాయిడ్స్, ముక్కులో వాడే స్ప్రేలు, యాంటీట్యూకోట్రైన్స్ వంటి మందులు వాడుతుంటారు. కళ్లు కళ్ల సమస్యలు కళ్ల సమస్యలు: పిల్లల్లో కళ్లకు సంబంధించిన సమస్యలు ఈ కింది కారణాల వల్ల రావచ్చు. అవి... కళ్లను అదేపనిగా రుద్దుతూ ఉండటం కాంతికి తీవ్రంగా ప్రతిస్పందించే గుణం ఒకేచోట దృష్టినిలపడంలో ఇబ్బందులు ఏదైనా వస్తువును చూడటంలో సమస్యలు ఆర్నెల్ల వయసు తర్వాత రెండు కనుగుడ్లు ఒకేవైపునకు, ఒకేలా కదలకపోవడం (అబ్నార్మల్ అలైన్మెంట్) దీర్ఘకాలికంగా కళ్లు ఎర్రగా ఉండటం కళ్లలో నల్లగుడ్డు ఉండాల్సిన చోట తెల్లటి మచ్చ ఉండటం. నిర్ధారణ: సాధారణంగా కళ్ల సమస్యలు ఆసిటీ చార్ట్ వంటి కొన్ని స్క్రీనింగ్ పరీక్షలతో స్కూల్‌కు వెళ్లే ముందుగానే తెలిసిపోతుంటాయి. ఇక కాంతి కిరణాలు అవసరమైన చోట కేంద్రీకృతం కాకపోవడం వంటి సమస్యలను రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అని అంటారు. ఇందులో దగ్గరి దృష్టిలో కేవలం దగ్గరి వస్తువులు మాత్రమే స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యను మయోపియా అంటారు. ఇక కొందరు పిల్లల్లో దూరంగా ఉన్నవి కనిపిస్తూ దగ్గరగా ఉన్నవి స్పష్టంగా కనిపించవు. ఈ సమస్యను హైపరోపియా అంటారు. ఇక కన్ను ముందువైపున ఉండే వంపు సరిగా లేకపోవడం వల్ల చూసే ప్రక్రియ ఇబ్బంది ఉంటుంది. దీన్ని ఆస్టిగ్మాటిజమ్ అంటారు. ఈ మూడు సమస్యలను కళ్లజోడు ఉపయోగించడం ద్వారా సరిచేయవచ్చు. నోరు నోటిలో పుండ్లు (ఓరల్ అల్సర్స్) ఇవి పిల్లలో చెంపలు, పెదవుల లోపలి వైపున, చిగుర్లపైన కనిపిస్తాయి. కొందరిలో నాలుకపైన కూడా కనిపిస్తుంటాయి. కారణాలు : ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి 12, ఐరన్ వంటి లోపాల వల్ల ఇవి వస్తుంటాయి. కొందరిలో నోటిలో అయ్యే గాయాల వల్ల, తీవ్రమైన మానసిక ఒత్తిడి, అలర్జీల వల్ల కూడా కనిపిస్తుంటాయి. చికిత్స/ నివారణ : సాధారణంగా ఈ సమస్య రెండు వారాల్లో తగ్గిపోతుంది. ఇలా పిల్లలో నోటిలో పుండ్లు వస్తున్నప్పుడు పోషకాహార లోపాలు లేక వ్యాధి నిరోధకతలోపాలు ఏవైనా ఉన్నాయా అని చూడాలి. కొన్ని ఆహారాలు సరిపడకపోవడం (ఫుడ్ అలర్జీ) కూడా ఉందేమో అని తెలుసుకోవాలి. డాక్టర్ శివనారాయణరెడ్డి వెన్నపూస కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ - ఇన్టెన్సివిస్ట్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్,విక్రమ్‌పురి, సికింద్రాబాద్ -
బాకాసురులు
సోల్ / స్వోత్కర్ష ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయించే అంతర్ముఖులు పెద్దగా స్వోత్కర్షకు పాల్పడరు గానీ, ఇంటా బయటా వాగుడుకాయలుగా పేరుమోసిన బహిర్ముఖులు మాత్రం అవకాశం చిక్కినప్పుడల్లా ఎంతో కొంత స్వోత్కర్షకు పాల్పడుతూనే ఉంటారు. కొందరిలో ఈ లక్షణం కాస్త అతిగా ఉంటుంది. నలుగురూ పోగైన చోట అలాంటి వాళ్లను కాస్త కదిపితే చాలు.. తేనెతుట్టెను కదిలించినట్లే! ఇక మొదలెడతారు సొంతడబ్బా మోత.. అలసట చెందే వరకు లేదా అంతరాయం కలిగే వరకు వాళ్లు ఆ మోతను మోగిస్తూనే ఉంటారు. ఆ మోత ధాటికి వినేవాళ్ల చెవులు దిబ్బెళ్లెక్కడమే కాదు, మైండ్ బ్లాకవుతుంది కూడా. ఇలాంటి వాళ్లే డబ్బారాయుళ్లుగా పేరుమోస్తారు. డబ్బారాయుళ్లకు సమయ సందర్భాలతో నిమిత్తం ఉండదు. తమ మాటలు వినే బకరాలు దొరికితే చాలు, వాళ్లకు పూట గడిచిపోతుంది. స్వోత్కర్షను పెద్దలు అవలక్షణంగా పరిగణిస్తారు గానీ దీనిని అంత తేలికగా తీసిపారేయలేం. మోతతోనే మేత చాలామందికి ఈ లక్షణమే జీవనోపాధి. కొన్ని వృత్తులకు ఈ లక్షణం తప్పనిసరి కూడా. పోటీ యుగంలో వ్యాపారాలు నిలదొక్కుకోవాలంటే, సొంతడబ్బా మోతకు మించిన మార్గమే లేదు. ఇదేదో డబ్బా మోతే కదా అని చిత్తమొచ్చిన రీతిలో మోగిస్తే కుదరదు. పైగా, అలాంటి మోత వికటించే ప్రమాదాలూ లేకపోలేదు. అందువల్ల ఆచి తూచి జనాల మెదళ్లలో కదలిక తెచ్చేస్థాయిలో కొంచెం లయబద్ధంగా, ఇంచుక శ్రావ్యంగా మోగించాలి. ఇదొక కళ. దీనికే అడ్వర్టైజ్మెంట్... ప్రాపగాండా... అని రకరకాల మోడర్న్ పేర్లు ఉన్నాయి. ఎంత మోతకు అంత మేత. కళాత్మకంగా సొంత డబ్బాను ప్రచారం చేసుకోగలిగే వారికి బువ్వకు లోటుండదు. జీవితం నల్లేరు మీద బండి నడకలా సాఫీగా సాగిపోతుంది. సొంతడబ్బాకు లౌక్యమూ, చాకచక్యమూ తోడైతేనా... ఇక తిరుగే ఉండదు. అలాంటి శాల్తీలు అనతికాలంలోనే ఏకంగా దేశనాయకులుగా అవతరిస్తారు. అలాంటి వారి డబ్బా మోతకు పత్రికలు, టీవీ చానళ్లు లౌడ్స్పీకర్లలా ఉపయోగపడుతుంటాయి. రాచరిక కాలంలో మహా మహారాజులకు, చక్రవర్తులకు సొంతడబ్బా మోగించుకునే లక్షణం ఎంతో కొంత ఉన్నా, పాపం వారికి ఆ అవకాశం ఎక్కువగా ఉండేది కాదు. రాజాధి రాజులు, చక్రవర్తుల డబ్బా మోగించడానికి వారి చుట్టూ వందిమాగధులు మందలాదిగా ఉండేవారు. ఇది ప్రజాస్వామిక యుగం. పల్లకిమోసే బోయీలు కనుమరుగైపోయిన కానికాలం ఇది. నాయకమ్మన్యుల ఘనతను వేనోళ్ల పొగుడుతూ స్తోత్రపాఠాలు చదివే వందిమాగధులు అంతరించిపోయిన శకం ఇది. ఇలాంటి యుగంలో ప్రతిఫలం లేకుండా మన ఘనతను చాటేవారు ఎవరూ ఉండరు. అయితేనేం? మన ఘనతను ఎవరూ చాటకుంటే, మనమే చాటుకుందాం అన్నదే నేటి సిద్ధాంతం. ‘కన్యాశుల్కం’ కథానాయకుడు గిరీశం ప్రవచించిన సిద్ధాంతం ఇదే. పార్టీలకు అతీతంగా ఇప్పటి మన రాజకీయ నాయకులు అనుసరిస్తున్నదీ ఇదే. అందుకే, ఎన్నికలవేళ రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోలన్నీ వాటి సొంతడబ్బాలే. ఎవరి డబ్బా బాగా మోగితే, వారిదే గెలుపు, వారిదే అధికారం. సోది పురాణం స్వోత్కర్ష ఆధునిక లక్షణమేమీ కాదు. మానవజాతిలో ఆది నుంచి ఉన్న లక్షణమే. పురాణ పురుషులందరూ ఇలాంటి అవలక్షణం లేని సత్తెకాలపు అమాయకులే అనుకుంటే తప్పులో కాలేసినట్లే! పురాణ పురుషులను పొగడటానికి వారి వారి వందిమాగధ గణాలు ఉండేవి. తమను తాము పొగుడుకునే అవసరం పెద్దగా ఉండేది కాదు. అయినా, వందిమాగధుల పొగడ్తల డోసు చాలదనిపించినప్పుడు కొందరు విజృంభించి మరీ స్వోత్కర్షను వినిపించేవారు. తమ ఘనతను చాటుకొనేందుకు పద్యగద్యాలతో సొంత డబ్బాను మోగించుకునేవారు. పలు పురాణాలలో ఇలాంటి ఉదాహరణలు కొల్లలుగా దొరుకుతాయి. రామాయణంలోని ఒక ఉదాహరణను చెప్పుకుందాం. విశ్వామిత్రుడి వెంట జనస్థానానికి వెడలిన రామలక్ష్మణులు అక్కడ అరాచకం సృష్టిస్తున్న రాక్షసులను మట్టుబెట్టారు. రామలక్ష్మణుల చేతిలో ఖరదూషణులు మరణించడంతో, అకంపనుడు ప్రాణభీతితో లంకకు చేరుకుని, రావణుడికి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు చూడాలి రావణుడి ఆగ్రహం. ఆ ఆగ్రహంలోనే లంకాధీశుడు సొంతడబ్బా మోతకు లంకించుకున్నాడు. ‘నా పేరు చెబితేనే మూడు లోకాలూ గజగజ వణికిపోతాయే! ఈ సాహసానికి ఒడిగట్టిందెవరు? నేను సూర్యుడిని, అగ్నిహోత్రుడిని కూడా కాల్చేస్తానే! అలాంటి నాకు ఆగ్రహం తెప్పించిందెవరు? చెప్పు..’ అంటూ అకంపనుడి మీద విరుచుకుపడ్డాడు. రామాయణ కాలంలో సొంత డబ్బా పాపం ఈ స్థాయిలోనే ఉండేది. అల్ట్రామోడర్న్ కాలంలో సొంతడబ్బా హైటెక్కుటమారాలను సంతరించుకుని, ఆ విధంగా ముందుకుపోతోంది. సుత్తి లయలు సొంత డబ్బా కొట్టుకోవడాన్నే, సొంత బాకా మోగించుకోవడం అని కూడా అంటారు. డబ్బా మోతలో లయ ఉంటుంది. బాకా మోతలో శ్రుతి ఉంటుంది. జనాల కర్మకాలి రెండూ ఏకకాలంలో మోగితే, కర్ణభీకర సంగీతం పుడుతుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఇలాంటి సంగీతమే జనాలను ఓలలాడిస్తూ ఉంటుంది. పత్రికల ద్వారా, టీవీ చానళ్ల ద్వారా, వెబ్సైట్ల ద్వారా ఈ సంగీతమే ప్రతిధ్వనిస్తూ ఉంటుంది కూడా. సొంతబాకాను దిక్కులు పిక్కటిల్లేలా వినిపించేవాళ్లనే బాకాసురులనవచ్చు. సత్తెకాలపు పెద్దలు స్వోత్కర్షను అవలక్షణంగా ఎంచారు గానీ, నిజానికి దీనిని లలితకళగా పరిగణించాలి. స్వోత్కర్ష చేతగాని వాళ్లను ఆధునిక సమాజం దద్దమ్మలుగానే పరిగణిస్తుందనేది తిరుగులేని బహిరంగ రహస్యం. డబ్బా లయను, బాకా శ్రుతిని చిన్ననాటి నుంచే వంటబట్టించుకోవడం ఈ మాయలోకంలో మనుగడ సాగించడానికి అత్యవసరం. స్వోత్కర్షను పాఠశాల స్థాయి నుంచే సిలబస్‌లో చేరిస్తే, భావిపౌరులు బాగుపడగలరని, ఆ విధంగా వారి భవిష్యత్తుకు బంగారు బాట ఏర్పడగలదని నిక్కచ్చిగా చెప్పవచ్చు. అందువల్ల మన శాసనకర్తలెవరైనా ఈ దిశగా కృషిచేస్తే, మన దేశం అభివృద్ధి పథంలో ఎక్కడికో వెళ్లిపోగలదని కూడా నిర్మొహమాటంగా చెప్పవచ్చు. -
ఈ పిల్లలకు చెవులు ఉండవు... కానీ వినపడుతుంది..!
మెడిక్షనరీ కొందరు పిల్లలు చెవులే లేకుండా పుడతారు. అంతమాత్రాన వీళ్లకు వినిపించదేమో అనుకోకండి. తలకు ఇరువైపులా కనిపించే చెవులు నిజానికి చెవికి బాహ్యభాగాలే. దీన్ని ఇంగ్లిష్‌లో పిన్నా అంటారు. కొందరిలో ఈ బాహ్య చెవులు అసలే ఉండవు. ఇలా రెండు చెవులూ లేకుండా పుట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. వైద్యపరంగా ఈ కండిషన్‌ను ‘బైలాటరల్ అర్టీషియా మైక్రోషియా’ అంటారు. అసలు చెవులే లేకుండా ఉండే కండిషన్ ‘మైక్రోషియా’లోని అనోషియా అనే గ్రేడ్ కిందకు వస్తుంది. ఈ ఇలాంటివారిలో బాహ్యచెవి పెరగకపోయినా, చెవిలోపలి భాగాలైన మధ్యచెవి, లోపలి చెవి భాగాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. వీళ్లకు ఒక శస్త్రచికిత్స చేసి శబ్దతరంగాలు లోపలికి వెళ్లే మార్గాన్ని రూపొందిస్తారు. దాంతో వీళ్లు మమూలుగానే వినవచ్చు. -
డోరేమాన్ చెవులేమయ్యాయి?
డోరేమాన్... పిల్లిలా కనిపిస్తుంది. పిల్లి కాదు. మరబొమ్మలా ఉంటుంది. కానీ మనిషిలా స్పందిస్తుంది. మనిషికంటే ఎక్కువ శక్తులున్నట్లు వ్యవహరిస్తుంది. ఈ పాత్ర ఇప్పటికి కాదు, భవిష్యత్తు కాలానిది. నిజమే డోరేమాన్ పుట్టిన రోజు 2112వ సంవత్సరం, 9వ నెల, 3 తేదీ. డోరేమాన్ బరువు సుమారు 130 కిలోలు. పొడవు 130 సెంటీమీటర్లు. గంటకు నూట ముప్పై కిలోమీటర్ల దూరం పరుగెడుతుంది. ఇంతకీ దీనికి ఒక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది తెలుసా? మీరు ఊహించింది నిజమే! డోరేమాన్కి చెవులుండవు. ఆ చెవులను ఎలుక కొరికేసింది. అందుకే డోరేమాన్కి ఎలుకలంటే కోపం, భయం కూడా. డోరేమాన్కు ఇష్టమైన ఆహారం డోరాయాకీ. తియ్యని గింజలతో చేసిన పేస్టును బన్నులో కూరితే అదే డోరాయాకీ. ఇంతకీ భవిష్యత్తులో ఎప్పుడో... పుట్టాల్సిన డోరేమాన్ ఇప్పుడెందుకు కనిపిస్తోందంటారా? తాతగారి కోసం వర్తమానంలోకి వచ్చి జీవిస్తుంటుంది. ఇంతకీ ఆ తాత ఎవరో తెలుసా? మనకు డోరేమాన్లో తప్పనిసరిగా కనిపించే అబ్బాయి నోబిత. -
మిడతలకు చెవులున్నాయా?
మిడుతలకు మనలాగ చెవులుండవు. కాని వాటి జీవితంలో శబ్దానికి చాల ప్రాముఖ్యముంది. అసలు చెప్పాలంటే వాటికి తోడు కావలసిన మిడతల్ని కనుక్కునేందుకు ఈ శబ్దమే ముఖ్యమైన సాధనం. మగ మిడతలను ఒక గాజు గిన్నెలో ఉంచినపుడు, వాటిని గురించి ఆడ మిడతలు అసలు పట్టించుకోవని శాస్త్రజ్ఞులు వారి పరిశోధనల్లో తెలుసుకున్నారు. ఆడమిడతలు గాజు గిన్నెలోని మగ మిడతల్ని చూడగలిగినప్పటికీ వాటిని వినలేకపోయినందువల్ల సరిగా గుర్తించలేకపోయాయి. కాని ఒక మైక్రోఫోను ఆ మగ మిడుత శబ్దాన్ని స్పీకరుకు అందించినపుడు ఆడ మిడతలు ఎంతో సంతోషంగా ఆ గాజుగిన్నె చుట్టూ చేరినట్లు పరిశోధనల్లో తేలింది. అసలు విషయం ఏమిటంటే...మిడుతలకు చెవులుండవు. వాటికి బదులు వాటి ముందు కాళ్ళలో శబ్ద గ్రాహకాలు ఉంటాయి. అవి మద్దెలలాగ ఉంటాయి. ప్రతి ‘మద్దెల’ మధ్యలో ఒక గుండ్రటి కొమ్ములాంటి అమరిక ఉంటుంది. ఈ ‘మద్దెల’ పల్చటి చర్మాలు చుట్టుపక్కల ఉన్న శబ్దతరంగాలను - మిగతా క్రిమికీటకాలు చేసే చప్పుళ్ళను గ్రహించి ఆ మిడుత నాడీవ్యవస్థకు పంపుతాయి. అక్కడ ఆ శబ్దాల్ని డీకోడ్ చేసుకుంటాయి. -
గుర్రాల జ్ఞాపకశక్తి గొప్పదా?
జంతు ప్రపంచం ప్రపంచంలో దాదాపు 160 జాతుల గుర్రాలు ఉన్నాయి. అన్నింట్లోకీ అరేబియన్ గుర్రాన్ని ఉత్తమ జాతిగా పేర్కొంటారు! ఐదేళ్ల వయసు వచ్చేవరకూ గుర్రాన్ని గుర్రం అనరు. మగది అయితే కాల్ట్ అని, ఆడది అయితే ఫిల్లీ అనీ అంటారు! భూమ్మీద నివసించే జీవులన్నింటిలోకీ గుర్రం కళ్లే పెద్దగా ఉంటాయి. వీటి నిర్మాణం కూడా ప్రత్యేకంగా ఉంటుంది. దానివల్ల ఒకేసారి రెండు కళ్లతో రెండు దృశ్యాలను చూడగలవు ఇవి. అంతేకాదు... చిక్కని చీకటిలో సైతం కొన్నిమైళ్ల దూరంలో ఉన్నవాటిని కూడా స్పష్టంగా గుర్తించగలిగే శక్తి వీటి కళ్లకు ఉంది! వీటి చెవులు కదులుతూ ఉంటాయి. గుండ్రంగా తిరుగుతాయి కూడా. ఆ కదలికను బట్టి వీటి దృష్టి దేనిమీద ఉందో చెప్పేయవచ్చు. ఎందుకంటే... కన్ను ఎటువైపు చూస్తోందో, చెవి కూడా అటువైపే తిరుగుతుంది! వీటి ఎత్తును ‘హ్యాండ్స్’లో కొలుస్తారు. ఒక హ్యాండ్ నాలుగు అంగుళాలతో సమానం! మగ గుర్రాలకు 40 నుంచి 44 దంతాలు ఉంటే... ఆడగుర్రాలకు 36 ఉంటాయి. ఈ దంతాలను బట్టే వీటి వయసును లెక్కిస్తారు. అయితే అది కూడా తొమ్మిదేళ్లు నిండేవరకే. ఆ తర్వాత వీటి వయసును దంతాల ద్వారా కనుక్కోవడం కష్టమంటారు జీవశాస్త్రవేత్తలు! ఇవి రోజుకు కేవలం గంటనుంచి మూడు గంటల సేపు నిద్రపోతాయి. అయితే ఇంతసేపూ పడుకోవు. కాసేపు నిలబడి కూడా నిద్రపోతుంటాయి! దాదాపు జీవులన్నీ కూడా శ్వాసనాళాల్లో సమస్య ఉంటే నోటితో శ్వాసను తీసుకుంటూ ఉంటాయి. కానీ గుర్రాలు అలా చేయలేవు. అంతేకాదు... ఇవి త్రేన్చలేవు. వాంతి చేసుకోలేవు! తెల్లగుర్రాలను చూసి భలే ఉన్నాయే అనుకుంటాం మనం. అయితే నిజానికి ఇవి పుట్టినప్పుడు తెల్లగా ఉండవు. గ్రే కలర్లో ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ తెల్లగా మారతాయి! వీటి జ్ఞాపకశక్తి అత్యద్భుతమైనదని పరిశోధనలు తేల్చాయి. ఒక్కసారి మనం ప్రేమగా సాకితే, గుర్రాలు మనలను జీవితంలో మర్చిపోవట. పైగా ఎంతమందిలో ఉన్నా కూడా మనల్ని గుర్తు పట్టేస్తాయట. అలాగే స్థలాలు కూడా. కొంతకాలం వీటిని ఓ ప్రదేశంలో తిప్పి, తర్వాత దూరంగా తీసుకెళ్లి వదిలేస్తే... ఇవి తిరిగి పాత ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లిపోగలవట! -
చెవి కుట్టించుకున్న విష్ణు
ఎప్పుడు ఆరంభిస్తున్నారో ఎప్పుడు పూర్తి చేస్తున్నారో తెలియనంత వేగంగా ఈ ఏడాది మంచు విష్ణు నాలుగు సినిమాలు చేసేశారు. ‘పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు’ చిత్రాలను నిర్మించి, నటించిన విష్ణు తాజాగా మరో చిత్రంలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అరిమా నంబి’కి రీమేక్ ఇది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు ఓ వినూత్న లుక్‌లో కనిపించనున్నారు. అందులో భాగంగా ఆయన నిజంగానే చెవులు కుట్టించుకున్నారట! ఫిజిక్ కూడా కొత్తగా ఉంటుందని చిత్రబృందం తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేశామని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని విష్ణు చెప్పారు. -
భార్య ముక్కు, చెవులు కోసిన భర్త
-
భార్య ముక్కు, చెవులు కోసిన భర్త
వరంగల్ : వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. దాంతో విచక్షణ మరచిన భర్త...ఆమె ముక్కు, చెవులు కోసిన ఘటన భూపాలపల్లి మండలం గొల్లబుద్ధారంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న శ్రీనివాస్ గత కొంతకాలంగా భార్య రజితను అనుమానంతో వేధిస్తున్నాడు. ఇదే విషయమై గత రాత్రి కూడా భార్యాభర్తల మధ్య ఘర్షణ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున పడుకున్న భార్య చేతులు, కాళ్లను మంచానికి తాడుతో కట్టేసిన శ్రీనివాస్...ఆమె ముక్కు, చెవులు కోశాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతూ మంచంలోనే పడి ఉన్న రజితను గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం భూపాలపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనలో శ్రీనివాస్‌కు అతని తల్లి కూడా సహకరించినట్లు సమాచారం. -
చిప్స్ ప్యాకెట్‌కూ చెవులుంటాయి!
న్యూయార్క్: రహస్యమైన విషయాలను మాట్లాడుకునేటప్పుడు.. గోడలకు చెవులుంటాయంటూ నక్కి ఉండేవారిని గూర్చి అంటుంటారు. మరి ఎవరూ నక్కి ఉండకపోయినా, ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలూ లేకపోయినా మీరేం మాట్లాడుకున్నా తెలిసిపోతుంది! ఇక ముందు మీరు చిప్స్ తినేసి పక్కన పెట్టిన ఖాళీ ప్యాకెట్, మంచినీళ్ల గ్లాసు, పక్కనే ఉన్న ఒక మొక్క.. ఇలాంటివన్నీకూడా మీరేం మాట్లాడుకున్నారో చెప్పేస్తాయి. ఇందుకు తోడ్పడే అల్గారిథమ్ (ప్రోగ్రామ్)ను అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు మైక్రోసాఫ్ట్, అడోబ్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. సాధారణంగా ధ్వని తరంగాలు.. అన్నిరకాల వస్తువులలో స్వల్పస్థాయిలో ప్రకంపనాలను కలిగిస్తాయి. ధ్వనిలో హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఉండే ఈ ప్రకంపనాలు సాధారణ కంటికి కనిపించవు. కానీ అత్యంత వేగంగా చిత్రీకరించే సామర్థ్యమున్న కెమెరాలతో.. ఆ ప్రకంపనాలను గుర్తించవచ్చు. వీటిని శాస్త్రవేత్తలు రూపొందించిన అల్గారిథమ్ సహాయంతో విశ్లేషిస్తే.. ఆ ధ్వని పునరుత్పత్తి అవుతుంది. దీనిని శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిర్ధారించారు కూడా. తొలుత వారు ఒక ధ్వని చేసి.. ఆ ధ్వనికి ఐదు మీటర్ల దూరంలో ఉన్న చిప్స్ ప్యాకెట్లో కలిగిన ప్రకంపనాలను చిత్రించారు. వాటిని ‘అల్గారిథమ్’తో విశ్లేషించి.. అదే ధ్వని తిరిగి ఉత్పత్తి చేయగలిగారు. -
తెగిన వృద్ధుడి చెవులు
తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్), న్యూస్‌లైన్ : ఎండతీవ్రతకు సొమ్మసిల్లి పడిపోయిన ఘటనలో ఓ 80 ఏళ్ల వృద్ధుడికి తెగి వేలాడుతున్న రెండు చెవులకు స్థానిక ప్రైవేట్ వైద్యుడు సకాలంలో శస్త్రచికిత్స చేసి వాటిని తిరిగి అతికించారు. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల మండలం తక్కెళ్లపాడునకు చెందిన సుమారు 80 ఏళ్ల వయస్సు ఉన్న కర్రి వెంకటరెడ్డి 15 రోజుల క్రితం పట్టణంలోని డీఎస్ చెరువు వద్ద ఉన్న చిన్న కూతురు ఇంటికి వచ్చారు. ఆదివారం ఉదయం ఇంట్లో వెంకటరెడ్డి అల్పాహారం తిన్న అనంతరం శేషమహల్ థియేటర్ రోడ్డులో నడుచుకుంటూ వెళుతుం డగా, ఎండ ధాటికి సొమ్మసిల్లి కింద పడిపోయాడు. కొందరు ఆటోలో అతనిని కు మార్తె ఇంటికి చేర్చారు. అయితే కుమార్తె పరిశీలనగా చూడగా దాదాపుగా ఎడమ చెవి తెగి వేలాడుతుండగా, రెండో చెవి పాక్షికంగా తెగిఉండటాన్ని గమనించి హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి సూర్య ఈఎన్టీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్ పట్నాల సత్యశ్రీనివాస్ అతనిని పరిశీలించి శస్త్ర చికిత్స చేసి తెగిన రెండు చెవులను అతికించారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
వివరం: నిశ్శబ్దాన్ని వినేవాళ్లు
కంటి ద్వారా చూసే ప్రపంచం వాళ్లది. దృశ్యాన్ని శబ్దంలోకి తర్జుమా చేసుకునే నేర్పు వాళ్లది. మౌనాన్ని అనుభవిస్తూ, శరీరపు కదలికలను అనుభూతిస్తూ, ఒళ్లంతా చెవులు చేసుకుంటూ, తమ లోపల మరో మనోలోకాన్ని నిర్మించుకుంటూ, కొన్నిసార్లు వ్యక్తీకరిస్తూ, కొన్నిసార్లు వెల్లడి కాలేక... వారిదో ప్రపంచం! ఒక నిశ్శబ్దపు ప్రపంచం!! మౌఖిక భాష అనే అగాధాన్ని సంకల్పపు గెంతుతో దాటుతూ వాళ్లు సాధించింది, ప్రపంచానికి అందించింది ఎవరికీ తక్కువ కాదు. సెప్టెంబర్ చివరి ఆదివారం నుంచి ‘ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్’ (వినికిడి శక్తి లేనివాళ్ల అంతర్జాతీయ వారోత్సవాలు) సందర్భంగా చరిత్రలో కొందరు చెవిటి విజేతల గురించిన ప్రత్యేక కథనం. మనిషి తొలి సమాచార మార్పిడి సంజ్ఞలతో చేసుకున్నాడు. సామాన్య జనానికి ఎప్పుడోగానీ అవసరం కాని ఈ మూగసైగలు చెవుడు బారిన పడ్డవాళ్లకు జీవితాంతం అత్యావశ్యాలు. ఆ లెక్కన వారు చేసేది భాషాపోరాటం. దేహాన్ని, చేతుల్ని కదిలిస్తూ, తల కదలికలు, కవళికల ద్వారా తమ లోపలిది ఎదుటివారితో పంచుకుంటూ వాళ్లకు కావాల్సింది తిరిగి పొందుతూ చేయాల్సిన జీవనసమరం మామూలుది కాదు. అలాగని చెవుడు ఉన్న ప్రతివాళ్లూ మాట్లాడలేరని కాదు. మాటను వినకపోవడం వల్ల వాటిని ఎలా వాడుకోవాలో వారికి తెలియదు. ముఖ్యంగా పుట్టుచెవుడు ఉన్నవాళ్లు. అంతేతప్ప వారి స్వర పేటికల్లో ఏ లోపమూ ఉండదు. అంటే చెవుడు ఉన్నవారు బదిరులయ్యే ప్రమాదం ఉంది; అంతేతప్ప చెవుడు ఉన్నవాళ్లందరూ బదిరులు కాదు. మేమూ సమానమే! ప్రపంచవ్యాప్తంగా 36 కోట్ల మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు. ప్రపంచజనాభాలో ఇది 5.3 శాతం. వెయ్యి మంది శిశువుల్లో 0.5-5 మందికి పుట్టుకతోనే చెవుడు ఉండటమో, శిశుప్రాయంలోనే దాని బారిన పడటమో జరుగుతోంది. తీవ్రమైన చెవి ఇన్ఫెక్షన్లు, అకస్మాత్తుగా దాడిచేసే అనారోగ్యాలు, మందులు కలిగించే ప్రతికూల ప్రభావాలతో పాటు వంశపారంపర్యంగా కూడా చెవుడు సోకే ప్రమాదం ఉంది. 75-80 శాతం మందికి తల్లిదండ్రుల్లో, పూర్వుల్లో అణిచివేయబడి ఉండిన జన్యువుల ద్వారా సంక్రమిస్తుంది. అంటే, పెద్దవాళ్లలో ఇది బయటపడకపోయినా, పిల్లలకు రావొచ్చన్నమాట! మ్యూజిక్, వినోద సాధనాల ద్వారా ఉత్పన్నం అవుతున్న శబ్ద కాలుష్యం కూడా కౌమారపు పిల్లల్లో వినికిడి లోపం తలెత్తడానికి కారకమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా 5.6 కోట్ల హియరింగ్ ఎయిడ్ వాడకందారులు ఉన్నారని అంచనా! అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని చాలామందికి ఇవి కూడా అందుబాటులో లేవు. చెవుడు దానికదే ఒక సమస్య అయినా, దానివల్ల శక్తి సామర్థ్యాలకు లోటుండదు. వాళ్లు కూడా అందరిలాంటివాళ్లే. అందరితో సమానమే! ఈ థీమ్‌తోనే ఈ ఏడాది ‘డెఫ్ వీక్’ జరుగుతోంది. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి కేంద్రంగా ఉన్న ‘ద వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్’ దీన్ని జరుపుతోంది. 1958లో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మొదట ‘డే’గా ఉండేవి. తర్వాత వీక్(వారం)గా పాటిస్తున్నారు. భాష, సంస్కృతి, కళ, రాజకీయ, సామాజిక రంగాల్లో వినికిడిలోపం ఉన్నవారి విస్మరించలేని పాత్రను తలుచుకోవడమే ఈ ఏడాది థీమ్. ఆ అంశం ప్రాతిపదికన చరిత్రలో ఎన్నదగిన పాటవం కనబరిచిన కొందరిని తలుచుకుందాం. దేవుడే ఆమెకు చెవివొగ్గాడు! 15వ శతాబ్దానికి చెందిన స్పెయిన్ సన్యాసిని థెరెసా డె కార్టజీనా. రెండు పదుల వయసులో ఆమె తన వినికిడి శక్తిని కోల్పోయారు. మనోశక్తిని కాదు. ధార్మిక రచనలు చేశారు. గ్రోవ్ ఆఫ్ ద ఇన్ఫర్మ్, వండర్ ఎట్ ద వర్క్స్ ఆఫ్ గాడ్ ఆమె స్పానిష్ రచనలకు ఇంగ్లీషు పేర్లు. తీవ్రమైన శోకం నన్ను చుట్టుముట్టినప్పుడు, లోతైన దురదృష్టపు సముద్రంలో దారీతెన్నూ లేక కొట్టుకుపోతున్నప్పుడు నాకు చెవివొగ్గింది దేవుడే, అన్నారామె. స్త్రీవాద రచనలకు తొలితరపు ప్రతినిధిగా ఆమెను ఇప్పుడు గౌరవిస్తున్నారు. ఫ్రెంచ్ భాషనే సంస్కరించాడు! చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్నారు ఫ్రాన్స్‌కు చెందిన జొయాచిమ్ డు బెల్లే (1522-60). దాంతో సరైన బాల్యం అనుభవించలేకపోయారు. పైగా యౌవనప్రాయంలో తలెత్తిన అనారోగ్యంతో చెవుడు బారిన కూడా పడ్డారు. ప్రపంచం మూగబోయినా, అతడి లోపలి హృదయం పలికింది; బతికిన అచిరకాలంలోనే గొప్ప కవిగా ఎదిగారు. ఫ్రాన్స్ పునరుజ్జీవన కాలపు మరో ఇద్దరు కవులు పియరే డె రొన్సార్డ్, జీన్ ఆంటోనీ డె బా... తో కలిసి ‘లె ప్లీయాడె’ నెలకొల్పారు. ఇప్పటి ఆధునిక ఫ్రెంచ్ భాష సంస్కరణలకు కారణం కాగలిగిన బృందం అది! తనువు లోపలి సంగీతం లుడ్విగ్ వ్యాన్ బీతోవెన్ (1770-1827) గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన ప్రకృతిలోకన్నా, తన తనువు నదిలోనే సంగీతం విన్నారేమో! పాశ్చాత్య క్లాసిక్ సంగీతానికి మకుటం లేని మహారాజు లాంటి బీతోవెన్ దురదృష్టం ఏమిటంటే, ఆయన సృష్టించే శబ్దసౌందర్యాన్ని ఆయన వినలేకపోవడం! తన సంగీతానికి ముగ్ధులై కొట్టే ప్రశంసాపూర్వక చప్పట్లు తన చెవి పట్టకపోవడం! జర్మనీలో జన్మించిన బీతోవెన్ తన రుగ్మతని జయిస్తూ, తన అంతర్జ్వాల మొత్తాన్నీ సంగీతంగా పలికించారు. 9 సింఫనీలు (సింఫనీ=స్వరసమ్మేళనం), 5 పియానో కన్సెర్టోలు (పియానో ప్రధాన వాద్యంగా గల ఆర్కెస్ట్రాలు), 32 పియానో సొనాటాలు (సొనాటా= పాడేది కాదు, పలికించాల్సిందని అర్థం), 16 స్ట్రింగ్ క్వాటెట్స్ (నలుగురి బృందంతో కూడిన వయోలిన్ లాంటి తీగవాద్యాల సమ్మేళనం)... ప్రపంచం చెవులారా వినడానికి ఆయన అందించిపోయిన సంగీత నిధి. వెలిగిన మనసుదీపం! అమెరికా శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్(1847-1931) ఎడమ చెవి వినబడేది కాదు; కుడిది కష్టంగా వినబడేది. 80 శాతం చెవుడు. చిన్నప్పుడు వచ్చిన స్కార్లెట్ ఫీవర్ దీనికి కారణమంటారు. ఆ సమస్య ఆయనకు ఫోనోగ్రాఫ్(సంగీతం వినడానికి ఉద్దేశించిన రికార్డ్ ప్లేయర్; 1877) కనిపెట్టడంలోగానీ, విద్యుత్ బల్బును వాణిజ్యపరంగా అందుబాటులోకి తేవడంలోగానీ (1879)అడ్డంకి కాలేదు. తన స్వదేశంలో 1,093 పేటెంట్లు పొందారాయన. మాటలు వచ్చి చెత్త మాటలతో పొద్దు పుచ్చేకన్నా , చెవిటివాడిగా ఉండి పుస్తకం చదువుకోవడం మేలన్న అభిప్రాయం ఆయనది. దృఢమైన మనసు మామూలు శబ్దాలు వినబడకపోయినా, రాతిలో శబ్దాన్ని వినగలిగే మృదుస్వభావి డగ్లస్ టిల్డెన్ (1861-1935). అమెరికా గొప్ప శిల్పిగా పేరు మోసిన టిల్డెన్ శిల్పాలు శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా నగర వాసులకు ప్రేరణనిస్తూ ఉంటాయి. ఆయన శిల్పాలు మెకానిక్స్ మాన్యుమెంట్, బేర్ హంట్, ఫుట్‌బాల్ ప్లేయర్స్, అడ్మిషన్ డే మాన్యుమెంట్ ఆ నగరాల్లో ప్రతిష్టించారు. టిల్డెన్ శిల్పాల్లో మగవాళ్లు కండలు తిరిగిన దేహంతో ఉంటారు. హోమోఎరోటిసిజం ఉంటుందని ఫిర్యాదు. మగస్నేహితుల బంధాన్ని చెక్కడానికి ఎక్కువగా ఇష్టపడతాడని ఒక వివరణ! వినికిడి లోపం గల పిల్లల కోసం ప్రపంచంలో తొలి పాఠశాల నెలకొల్పిన అబ్బే చార్లెస్ మైకేల్ డె ఈపీ స్వాతంత్య్రానంతర భారతీయ చిత్రకళను ప్రభావితం చేసిన సతీష్ గుజ్రాల్ ఫాదర్ ఆఫ్ ద డెఫ్ వినికిడి లోపం గురించి మాట్లాడుకునేప్పుడు విధిగా స్మరించుకోవాల్సిన పేరు అబ్బే చార్లెస్ మైకేల్ డె ఈపీ (24 నవంబర్ 1712- 23 డిసెంబర్ 1789). ఫ్రాన్స్‌లో జన్మించిన చార్లెస్ చెవిటి పిల్లల కోసం ప్రపంచంలోనే తొలి పాఠశాల(1760) నెలకొల్పిన మహనీయుడు. అందుకే ‘ఫాదర్ ఆఫ్ ద డెఫ్’ అంటారాయన్ని. అలాంటి పిల్లల కోసం సైగల భాషను రూపుదిద్దించుకోవాలన్న ఆలోచన చేసిన తొలివ్యక్తుల్లో ఆయనొకరు. దానివల్లే వారికి అక్షరాస్యత కల్పించి, స్వతంత్రుల్ని చేయగలమని భావించారు. కొత్త విధాన రూపకల్పన కోసం తపించినా, అంత్యదశలో మాత్రం నిర్మాణాత్మక సంకేత విధానం పనికిరాదన్నారు. ఎవరి సైగల భాష వాళ్లు రూపొందించుకోవడమే ఉచితమన్న అభిప్రాయంతో కన్నుమూశారు. అందుకే, ప్రపంచంలో ఏ ఒక్కటో ప్రామాణికమైన సంకేత భాష అంటూ లేదు. కొన్ని వందల సంకేత భాషలున్నాయి. అన్నీ ఆయా స్థానిక బృందాలు వాటికవే అభివృద్ధి చేసుకున్నవే.