ఈ పిల్లలకు చెవులు ఉండవు... కానీ వినపడుతుంది..!
మెడిక్షనరీ
కొందరు పిల్లలు చెవులే లేకుండా పుడతారు. అంతమాత్రాన వీళ్లకు వినిపించదేమో అనుకోకండి. తలకు ఇరువైపులా కనిపించే చెవులు నిజానికి చెవికి బాహ్యభాగాలే. దీన్ని ఇంగ్లిష్‌లో పిన్నా అంటారు. కొందరిలో ఈ బాహ్య చెవులు అసలే ఉండవు. ఇలా రెండు చెవులూ లేకుండా పుట్టడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. వైద్యపరంగా ఈ కండిషన్‌ను ‘బైలాటరల్ అర్టీషియా మైక్రోషియా’ అంటారు. అసలు చెవులే లేకుండా ఉండే కండిషన్ ‘మైక్రోషియా’లోని అనోషియా అనే గ్రేడ్ కిందకు వస్తుంది.
ఈ ఇలాంటివారిలో బాహ్యచెవి పెరగకపోయినా, చెవిలోపలి భాగాలైన మధ్యచెవి, లోపలి చెవి భాగాలు పూర్తిగా అభివృద్ధి చెంది ఉంటాయి. వీళ్లకు ఒక శస్త్రచికిత్స చేసి శబ్దతరంగాలు లోపలికి వెళ్లే మార్గాన్ని రూపొందిస్తారు. దాంతో వీళ్లు మమూలుగానే వినవచ్చు.