చెవి తమ్మె పూర్తిగా తెగిపోతే..! | Earlobe Repair Treatment How to Wear Heavy Earrings Without Stretching | Sakshi
Sakshi News home page

Earlobe Repair: చెవి తమ్మె పూర్తిగా తెగిపోతే..!

Published Tue, Nov 26 2024 10:31 AM | Last Updated on Tue, Nov 26 2024 10:31 AM

Earlobe Repair Treatment How to Wear Heavy Earrings Without Stretching

ఫ్యాషన్‌లో భాగంగానో లేదా తమ దుస్తులకు మ్యాచింగ్‌గా ఉంటాయనో కొందరు చాలా బరువైన ఇయర్‌ రింగ్స్‌ను వాడుతుంటారు. ఇలాంటి ఫ్యాషనబుల్‌ ఇయర్‌ రింగ్స్‌ ఎక్కువగా వాడుతుండటం లేదా హ్యాంగింగ్స్‌ తరచూ వేసుకుంటూ ఉండటంలో వాటి బరువు కారణంగా క్రమంగా చెవి రంధ్రం సాగితూ, ఆ రంధ్రం పెద్దదైపోయి ఒకదశలో చెవి తమ్మె పూర్తిగా తెగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ఇది పూర్తిగా తెగిపోయాక అప్పుడు రిపేర్‌ చేయించుకోవడం కంటే రంధ్రం పెద్దది అవుతున్న సమయంలోనే చేయించుకోవడం మంచిది. 

చాలా ఎక్కువ బరువుండే ఇయర్‌ రింగ్స్‌ లేదా హ్యాంగింగ్స్‌ కారణంగా చెవి బాగా సాగిపోయిన లేదా తెగిపోయిన చెవి తమ్మెను ప్లాస్టిక్‌ సర్జరీ ప్రక్రియ ద్వారా రిపేర్‌ చేయడం సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియలో బాధితులకు ఎలాంటి మత్తుమందు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. కేవలం ఆ ప్రాంతం వరకు శరీరం మొద్దుబారేలా మత్తు (లోకల్‌ అనస్థీషియా) ఇస్తే సరిపోతుంది. 

రెండుగా చీలిపోయినట్లుగా తెగిన చెవి తమ్మెను నేరుగా ప్లాస్టిక్‌ సర్జరీ చికిత్సలోనైనా లేదా చికిత్స తర్వాత గాయం మానిన తర్వాతనైనా... సదరు గాయం మచ్చను కనపడకుండా చేసేందుకూ చికిత్స అందించడం వచ్చు ఇందులో భాగంగా చెవి తమ్మెను వంకరటింకరగా (జిగ్‌జాగ్‌)గా అతికిస్తూ నిపుణులు రిపేర్‌ చేస్తారు. అయితే ఇలా చెవి తమ్మెలను అతికించే ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. 

అయితే ఈ అతికింపు ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. చెవి రంధ్రం చీరుకున్న తీరును బట్టి బాధితులకు ఎలాంటి ప్రక్రియ అవసరమో డాక్టర్లు నిర్ణయిస్తారు. ఆ తర్వాత వాళ్లతోనే మాట్లాడుతూ (కౌన్సెలింగ్‌ నిర్వహిస్తూ) వాళ్లకు అవసరమైన ప్రక్రియ గురించి వివరిస్తారు. వాళ్లు అంగీకరిస్తే అప్పుడు అతికింపు చికిత్స చేస్తారు. 

ఈ చికిత్సలో భాగంగా రెండుగా చీరుకున్న రంధ్రానికి కుట్లు వేయడం కోసం అత్యంత నాణ్యమైన, బయటకు కనపడని సున్నితమైన దారాన్ని ఉపయోగిస్తారు. ప్రక్రియ అంతా పూర్తయ్యాక చికిత్స నిర్వహించిన చోట కొన్నాళ్ల పాటు పైపూతగా ఉపయోగించే యాంటీబయాటిక్‌ క్రీమ్‌ను కొంతకాలం పాటు రాయాల్సి ఉంటుంది. కాక΄ోతే గాయం అంతా మానాక వెంటనే బయటకు కనపడదుగానీ... బాగా పరిశీలనగా చూస్తే ఓ పెన్సిల్‌తో గీసినంత సన్నగా ఉండే గీత అస్పష్టంగా కనిపిస్తుంది. 

ఈ అతికింపు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ చెవి కుట్టించుకోవాలంటే... చెవి రంధ్రం పూర్తిగా పూడిపోయాక కనీసం ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు ఆగి, అప్పుడు కుట్టించుకోవచ్చు. అయితే ఈసారి మళ్లీ అలాంటి చాలా బరువైన హ్యాంగింగ్స్‌ కాకుండా తేలికైనవి వాడుతూ మాటిమాటికీ చెవి తమ్మె తెగి΄ోకుండా చూసుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చెవి తమ్మెలు బాగా లేతగా ఉండే చిన్నారి బాలికలూ, చెవి తమ్మెలో తగినంత స్థలం లేనివారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. 
డా. ముఖర్జీ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌  

(చదవండి: ఛాతీలో నీరు చేరితే...?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement