ముక్కు, చెవులు కోసిన కుమారుడు | Dad's nose, ears sliced ​​son | Sakshi
Sakshi News home page

ముక్కు, చెవులు కోసిన కుమారుడు

Published Fri, Mar 31 2017 10:33 PM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

ముక్కు, చెవులు కోసిన కుమారుడు

ముక్కు, చెవులు కోసిన కుమారుడు

కేకే.నగర్‌: తాగడానికి డబ్బులివ్వలేదని కన్న తండ్రి చెవులనే కోసాడు కన్న కొడుకు. ఆగ్రహంతో తండ్రిపై దాడిచేసి కత్తితో ముక్కు, చెవులు కోసి కొడుకు  పరారైనాడు.ఈ సంఘటన చెన్నై పుదుపేట సౌత్‌లో జరిగింది.
 
 మోసల్‌ (50) కుమారుడు వేలాంకని అలియాస్‌ వేలా (38). ఈ ప్రాంతంలో రౌడీగా చెలామణి అవుతున్నాడు. ఇతనిపై హత్య, హత్యాయత్నం కేసులు ఉన్నాయి. గురువారం రాత్రి మద్యం తాగడానికి డబ్బులు తండ్రిని అడిగాడు. ఆయన నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో చుట్టుపక్కల వారు వేలాను సమాధానపరచి బయటికి పంపారు.అర్ద రాత్రి పొద్దు పోయాక ఇంటికి వచ్చిన కుమారుడు. ఆదమరచి నిద్రపోతున్న తండ్రి ముక్కు, చెవులను కత్తితో కోసి పరారైయ్యాడు. రక్తం మడుగులో పడి ఉన్న మోసల్‌ను ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు. దీనిపై మోసల్‌ ఎగ్మూర్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పరారిలో ఉన్న వేలా కోసం పోలీసులు గాలిస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement