
సాక్షి, నిర్మల్ : సాధారణంగా ఆవులకు రెండు చెవులు మాత్రమే వుంటాయి. కానీ పాక్‌పట్ల గ్రామం కేసరి గంగారెడ్డికి చెందిన ఓ ఆవు సోమవారం ఉదయం ఓ లేగదూడకు జన్మనిచ్చింది. అయితే ఆ దూడకు రెండు చెవులతో పాటు శిరస్సు పై భాగంలో మరో చెవు కూడా ఉండటంతో మూడు చెవులతో వింతగా పుట్టిన లేగదూడను చూడటానికి గ్రామస్తులు తరలివస్తున్నారు. జన్యుపరమైన లోపాల వలన ఇలాంటివి జరగుతాయని మండల పశువైద్యాధికారి మహేష్ తెలిపారు.