చెవి కుట్టించుకున్న విష్ణు | Vishnu Manchu pierces ears for next film | Sakshi
Sakshi News home page

చెవి కుట్టించుకున్న విష్ణు

Published Fri, Dec 26 2014 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

చెవి కుట్టించుకున్న విష్ణు

చెవి కుట్టించుకున్న విష్ణు

ఎప్పుడు ఆరంభిస్తున్నారో ఎప్పుడు పూర్తి చేస్తున్నారో తెలియనంత వేగంగా ఈ ఏడాది మంచు విష్ణు నాలుగు సినిమాలు చేసేశారు. ‘పాండవులు పాండవులు తుమ్మెద, రౌడీ, అనుక్షణం, ఎర్రబస్సు’ చిత్రాలను నిర్మించి, నటించిన విష్ణు తాజాగా మరో చిత్రంలో నటిస్తూ, నిర్మిస్తున్నారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘అరిమా నంబి’కి రీమేక్ ఇది. దేవా కట్టా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విష్ణు ఓ వినూత్న లుక్‌లో కనిపించనున్నారు.

అందులో భాగంగా ఆయన నిజంగానే చెవులు కుట్టించుకున్నారట! ఫిజిక్ కూడా కొత్తగా ఉంటుందని చిత్రబృందం తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేశామని ఈ సందర్భంగా దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని విష్ణు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement