'నువ్వు ఈ జన్మలోనే తెలుసుకుంటావ్'.. మంచు ఫ్యామిలీలో ట్విటర్ వార్! | Manchu Manoj Counter To Manchu Vishnu Tweet In Social Media | Sakshi
Sakshi News home page

'ఆయనలా అవ్వాలని ప్రతి శునకానికి ఉంటుంది'.. విష్ణుకు మంచు మనోజ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్

Published Fri, Jan 17 2025 7:03 PM | Last Updated on Fri, Jan 17 2025 7:24 PM

Manchu Manoj Counter To Manchu Vishnu Tweet In Social Media

మంచు వారి ఫ్యామిలీ వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ దంపతులు వెళ్లగా మరోసారి వివాదం మొదలైంది.

మంచు మనోజ్‌ తన భార్య మౌనిక రెడ్డితో కలిసి తాత, నానమ్మకు నివాళులర్పించేందుకు రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీకి చేరుకున్నారు. అయితే లోపలికి వెళ్లకుండా వారిని సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ అనుచరులు గేటు పైకి ఎక్కి లోనికి దూసుకెళ్లారు. దీంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గతనెలలో తలెత్తిన వివాదం మరవకముందే మరోసారి గొడవ మొదలైంది.

తాజాగా ఈ వివాదం తర్వాత మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. మొదట మంచు విష్ణు ట్వీట్‌ తన రౌడీ సినిమాలో డైలాగ్‌ను షేర్ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 'సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది. కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ' అనే డైలాగ్‌ను పోస్ట్ చేశారు.

‍అయితే దీనికి అదే స్టైల్లో మంచు మనోజ్ కౌంటరిచ్చారు. కన్నప్ప సినిమాలో కృష్ణం రాజులా అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుంది.. ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావ్' అంటూ కృష్ణం రాజు సినిమాల పోస్టర్లను పంచుకున్నారు. దీంతో సోషల్ మీడియాలో అన్నదమ్ముల వార్‌ మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.  అయితే ఇన్‌డైరెక్ట్‌గా మంచు విష్ణు తెరకెక్కిస్తోన్న కన్నప్ప మూవీని మంచు మనోజ్ టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది.

 

 

ఇరువురిపై కేసులు..

ఇప్పటికే మనోజ్‌, మోహన్‌బాబుకు సంబంధించిన ఇరువర్గాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదు చేశారు. మోహన్‌బాబు పీ.ఏ చంద్రశేఖర్‌ నాయుడు ఫిర్యాదుతో మంచు మనోజ్‌, మౌనికతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో మంచు మనోజ్ కూడా తనతో పాటుగా భార్య మౌనికపై ఎంబీయూ యూనివర్శిటీ వారు దాడికి ప్రయత్నించారంటూ చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మోహన్‌బాబు పీఏతో పాటు యూనివర్శిటీ  సిబ్బంది 8 మందిపై మనోజ్‌ ఫిర్యాదు చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement