భూపాలపల్లిలో చేర్చండి | please joined in bhupalapalli | Sakshi
Sakshi News home page

భూపాలపల్లిలో చేర్చండి

Published Mon, Sep 12 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

బ్రిడ్జిపై రాస్తారోకో చేస్తున్న వివిధ పార్టీల నాయకులు

బ్రిడ్జిపై రాస్తారోకో చేస్తున్న వివిధ పార్టీల నాయకులు

  • వాజేడు మండల వాసుల రాస్తారోకో
  • వాజేడు : వాజేడు మండలాన్ని వరంగల్‌ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్‌) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో 163వ జాతీయ రహదారి అయిన గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. తమకు ఎంతో దూరంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కాకుండా.. అనుకూలంగా ఉండే భూపాలపల్లిలో కలపాలని డిమాండ్‌ చేశారు. కొత్తగూడెంలో కలిపితే తీవ్ర నష్టం జరుగుతుందని వివిధ పార్టీల నాయకులు అన్నారు. అదే భూపాలపల్లిలో కలిపితే గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సానుకూలంగా ఉంటుందన్నారు. బ్రిడ్జిపై దాదాపు గంటపాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధర్మారం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఇన్‌చార్జ్‌ తహశీల్దార్‌ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement