
కోతులను కొట్టబోయి.....
వరంగల్ : ఇంటిపైకి వచ్చిన కోతులను కొట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి శరీరంలోకి ప్రమాదవశాత్తు ఐరన్ రాడ్ చొచ్చుకుపోయింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం కార్ల్‌మాక్స్ కాలనీలో మంగళశారం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభాకర్ అనే వ్యక్తి కోతులను కొడుతుండగా, సిమెంట్ రేకు విరిగిపడి ప్రమాదవశాత్తు ఇంటి ప్రహారీ గోడపై ఉన్న రాడ్డుపై పడ్డాడు.
దాంతో రాడ్ కడుపు కింది భాగంలోకి దిగిపోయింది. దీంతో అతడు నొప్పికి తాళలేక విలవిల్లాడిపోయాడు. రాడ్ను పట్టుకుని అలాగే ఉండిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. సింగరేణి రెస్క్యూటీమ్ సాయంతో రాడ్ను కట్ చేసి, 108లో ప్రభాకర్‌ను ఆసుపత్రికి తరలించారు.