‘నిర్భయ’ను మించిన దారుణం.. మహిళను కిడ్నాప్‌ చేసి రెండ్రోజులుగా..! | Delhi Woman Allegedly Kidnapped Gang Raped By 5 Men In Ghaziabad | Sakshi
Sakshi News home page

ఆస్తి తగాదాతో మహిళ కిడ్నాప్‌.. రెండ్రోజులుగా గ్యాంగ్‌ రేప్‌.. ఇనుప రాడ్‌తో చిత్రహింసలు..

Oct 19 2022 12:36 PM | Updated on Oct 19 2022 12:48 PM

Delhi Woman Allegedly Kidnapped Gang Raped By 5 Men In Ghaziabad - Sakshi

గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన దుండగులు బాధితురాలికి తెలిసినవారే కావటం గమనార్హం.

గాజియాబాద్‌: బస్సు కోసం బస్టాండ్‌లో వేచి చూస్తున్న ఓ మహిళ(40)ను కిడ్నాప్‌ చేసిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై ఇనుప రాడ్డుతో చిత్రహింసలకు గురిచేశారు. రెండు రోజుల తర్వాత రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో జరిగింది. గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడిన దుండగులు బాధితురాలికి తెలిసినవారే కావటం గమనార్హం. నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇనుప రాడ్‌ ఇంకా మహిళ మర్మాంగాల్లోనే ఉందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ శ్వాతి మాలివాల్‌ ట్వీట్‌ చేశారు.

ఏం జరిగింది?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజియాబాద్‌లో బంధువుల ఇంటిలో బర్త్‌డే పార్టీకి హాజరై ఢిల్లీకి తిరుగు ప్రయాణమైంది బాధితురాలు. ఆమె సోదరుడు బస్టాండ్‌లో దింపి వెళ్లాడు. బస్సు కోసం వేచి చూస్తుండగా.. ఐదుగురు కారులో అక్కడికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలికి, నిందితులకు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ అంశం కోర్టులో ఉందని గాజియాబాద్‌ ఎస్పీ నిపున్‌ అగర్వాల్‌ తెలిపారు. ఢిల్లీకి వెళ్లే ఆశ్రమ్‌ రోడ్డులో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే బాధితురాలిని జీటీబీ ఆసుపత్రికి తరలించారు. ఫిర్యాదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 

గాజియాబాద్‌ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని ఢిల్లీ మహిళా కమిషన్‌  చీఫ్‌ శ్వాతి మలివాల్‌ ఎస్పీని కోరారు. ‘ ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డుతో మహిళ రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గాజియాబాద్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో కారులో బలవంతంగా తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు ఆమెపై ఐదుగురు ‍అత్యాచారం చేశారు. ప్రైవేటు భాగాల్లో ఇనుప రాడ్డును చొప్పించారు. రోడ్డు పక్కన పడిపోయి ఉన్న సమయంలోనూ ఇనుప రాడ్డు అలాగే ఉంది. ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. గాజియాబాద్‌ ఎస్ఎస్‌పీకి నోటీసులు పంపించాం’అని ట్వీట్‌ చేశారు శ్వాతి.

ఇదీ చదవండి: స్పా, సెలూన్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement