న్యూఢిల్లీ : భూపాలపల్లి నివాస ప్రాంతంలోని సింగరేణి ఓపెన్ మైనింగ్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సింగరేణి యాజమాన్యం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌పై సుప్రీం కోర్టు శుక్రవారం విచారణ చెపట్టింది. ఈ విచారణలో భూపాలపల్లి బాధితుల తరపు న్యాయవాది శ్రవణ్ వాదిస్తూ.. సింగరేణి ఒపెన్‌కాస్ట్ మైనింగ్ బాంబు పేలుళ్ల వల్ల ప్రజలకు ప్రమాదాలు జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా సురక్షిత చర్యలు తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.
కాగా ఈ పటిషన్‌పై విచారణ చెపట్టిన జస్టిస్ నాగేశ్వరరావు ధర్మాసనం ఓపెన్ కాస్ట్ మైనింగ్‌పై తనిఖీ నిర్వహించి కోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ క్రమంలో సింగరేణి యాజమాన్యం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక తమకే అనుకూలంగా ఉందని కోర్టుకు తెలిపింది. అయితే బాధితుల తరపు న్యాయవాది కాలుష్య మండలి నివేదికలో వాయు, ధ్వని, జల కాలుష్యం ఉందని శ్రవణ్ కోర్టుకు వివరించారు. అయితే కేంద్ర పర్యావరణ శాఖ ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేసేందుకు రెండు రోజులు సమయం కావాలని సుప్పీం కోర్టును కోరింది. దీంతో తదుపరి విచారణను సెప్టెంబర్ 5వ తేదికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment