బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం: ముగ్గురి పరిస్థితి విషమం
Published Wed, May 17 2017 3:46 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
ఘన్‌పూర్: మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని అధికారులు పదే పదే చెప్తున్నా కొందరు అది తలకెక్కించుకోవడం లేదు. కిక్కులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్ మండలం కర్కపల్లి సమీపంలో ఓ డీసీఎం డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సాయంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement