కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడిపల్లి జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు, వృద్ధుడు ఉన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లికి చెందిన వీరంతా షిర్డీ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడినవారిని జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
షిర్డీ నుంచి వస్తూ మృత్యువాత
Published Tue, Jan 28 2014 8:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement