కరీంనగర్‌క్రైం: కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్లే బైపాస్‌రోడ్డులో సోమవారం వేకువజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మహిళ మృతిచెందగా.. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ అజ్మత్‌పురకు చెందిన శభానా అంజుమ్(48) తన బంధువు సయ్యద్ అఫ్జలుల్ రెహ్మాన్ ఎంగేజ్‌మెంట్ ఉండగా ఆదివారం ఉదయం ఎర్టిగా కారులో అఫ్జలుల్ రెహ్మాన్, శభానా అంజుమ్, మెహ్మతిపాతి మా, అమాల్ ఫాతిమా, రుక్సానాభేగం, మీర్జా సమీర్‌భేగ్ కలసి హైదరాబాద్‌కు షాపింగ్ కోసమని వెళ్లారు.
షాపింగ్ ముగించుకొని తిరిగి కరీ ంనగర్ వస్తుండగా సోమవారం వేకువ జామున 4.30గంటల ప్రాంతంతో కరీంనగర్ ఆటోనగర్ సమీపంలో కారు డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. కారులో ఉన్న అఫ్జలుల్ రెహ్మాన్, మెహ్మతిపాతిమా, అమాల్ ఫాతిమా, రుక్సానాబేగం, మిర్జాసమీర్‌బేగ్‌లకు స్వల్పగాయాలయ్యాయి. శభానా అంజుమ్‌కు తీవ్ర గాయాలు కావడంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందు తూ కాసేపటికే మృతిచెందింది. మృతురాలి భర్త సయ్యద్ అబ్దుల్ రెహమాన్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment