
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పట్టణంనలో కారు ఆదివారం ఉదయం బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు కమాన్ ప్రాంతంలోని రోడ్డు పక్కన ఉన్న గుడిసెల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతిచెందారు. మరో అయిదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్‌లో ఆక్సిడెంట్ చేసిన కారుపై 9 ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన చోటుచేసుకున్న తరువాత అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు పరారయ్యారు. తర్వాత వారి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
చదవండి: ఒకే గ్రామానికి చెందిన యవతితో ప్రేమ.. ఎన్నిసార్లు తిరిగినా ఒప్పుకోవడం లేదని..
నిర్లక్ష్యమే ఘోర ప్రమాదానికి కారణం
కరీంనగర్ కమాన్ సెంటర్ వద్ద జరిగిన యాక్సిడెంట్ మైనర్ల నిర్వహకమేనని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కారు యాక్సిడెంట్ చేసింది 16 సంవత్సరాల మైనర్ అబ్బాయని, కారు యాక్సిడెంట్ చేసే సమయంలో ముగ్గురు మైనర్లు ఉన్నారన్నారు. కారు ప్రమాదానికి కారణం యాక్సిడెంట్ చేసిన మైనర్ తండ్రి కచ్చకాయల రాజేంద్రప్రసాద్ నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment