సాక్షి, నెట్‌వర్క్: మండుతున్న ఎండలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. వడదెబ్బతో బుధవారం వేర్వేరుచోట్ల 19 మంది మృతి చెందారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లికి చెందిన రైతు తాటి రమేశ్ (28), కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఒంటర్‌పల్లి తండాకు చెందిన కాట్రోత్ కేస్లీ (56), నల్లగొండ జిల్లా నియమనూరు మండల కేంద్రానికి చెందిన పిల్లి మంగమ్మ (55), నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని బైరాపూర్ గ్రామానికి చెందిన గోరటి సాలమ్మ(47), మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం పాత మొల్గర గ్రామానికి చెందిన బి.లవన్నగౌడ్(61), నల్లగొండ జిల్లా చెందిన పగిడి రామయ్య(50),భువనగిరి పట్టణానికి చెందిన ఆలేటి ఆంజనేయులు (46) ఉన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన రైతు శనిగరం మొగిళి(57) కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లికి చెందిన మహిళాకూలీ వేముల లక్ష్మి(46), ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లికి చెందిన కడెం గంగాధర్ (42) రామడుగు మండలంలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన బక్కశెట్టి రాజిరెడ్డి (55) ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం 8 మంది మృత్యువాత పడ్డారు.