స్నేహితుడి కుమార్తె పై అత్యాచారయత్నం | rape attempt on 14 years girl in warangal district | Sakshi
Sakshi News home page

స్నేహితుడి కుమార్తె పై అత్యాచారయత్నం

Published Tue, Aug 25 2015 1:40 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

rape attempt on 14 years girl in warangal district

భూపాలపల్లి: వరంగల్ జిల్లా భూపాలపల్లిలో స్నేహితుడి కుమార్తె పై అత్యాచారానికి యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు కథనం ప్రకారం... భూపాలపల్లికి చెందిన సింగరేణి కార్మికుడు నాంపల్లి వెంకటేశ్వర్లు తన స్నేహితుడి కుమార్తె(14)ను ఆదివారం బైక్‌పై పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి... అత్యాచారం చేయబోయాడు.

దాంతో బాలిక బిగ్గరగా కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై బాలిక తండ్రి సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement