![Husband Pour Kerosene On His Wife In Bodhan - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/24/kerosene.jpg.webp?itok=5_-n_afq)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బోధన్: నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో పాటు అత్త, మరిది కలిసి ఆరు నెలల గర్భవతిపైన కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో బాధితురాలు సీతాలు తీవ్రంగా గాయపడింది. క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు.. రాకాసిపేట్‌లో నివసిస్తోన్న గైని ప్రశాంత్, సీతాలు భార్యాభర్తలు. పెళ్లి అయిన నెల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది.
కల్యాణ లక్ష్మీ చెక్కు వచ్చాక ఇష్టం లేని పెళ్లి చేశారని సీతాలుకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. కుట్రలో భాగంగానే ఆమెను అంతమొందించేందుకు ఈ ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం అత్త, భర్త పరారయ్యారు. బోధన్ పోలీస్‌స్టేషన్లో బాధితులు జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment