మద్యం తాగించి డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం  | Student Molested in Abandoned Hospital Building in Nizamabad, 5 Arrested | Sakshi
Sakshi News home page

Nizamabad:  మద్యం తాగించి డిగ్రీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం 

Published Thu, Sep 30 2021 11:47 AM | Last Updated on Thu, Sep 30 2021 4:15 PM

Student Molested in Abandoned Hospital Building in Nizamabad, 5 Arrested - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మంగళవారం రాత్రి డిగ్రీ చదువుతున్న యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. నలుగురు యువకులు బాధితురాలికి మద్యం తాగించి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఆర్మూర్‌ డివిజన్‌లోని ఓ గ్రామానికి చెందిన యువతి బోధన్‌లోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తోంది. యువతికి  జిల్లా కేంద్రంలోని డెకొరేషన్‌ పనిచేసే శేఖర్‌ అనే యువకుడితో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. యువతి బర్త్‌డే ఉండడంతో పార్టీ చేసుకోవాలంటూ శేఖర్‌ ఆమెను జిల్లా కేంద్రానికి రప్పించాడు. సాయంత్రం ఐదు గంటలకు గాయత్రినగర్‌లోని రూమ్‌కు తీసుకెళ్లాడు.

అతని స్నేహితులు మరో ముగ్గురిని పిలిచాడు. అక్కడ యువతితో మద్యం తాగించి వారు తాగారు. మద్యం మత్తులో యువతిపై నలుగురు అత్యాచారం జరిపారు. రాత్రి 11 గంటల వరకు రూమ్‌లోనే ఉన్నారు. అనంతరం యువతిని ఇంటికి పంపించేందుకు బైక్‌పై ఆర్మూర్‌ రోడ్డువైపు వెళ్లారు. అప్పటికే యువతి మద్యం మత్తులో ఉండడంతో ఉదయం పంపించాలని తిరిగి బస్టాండ్‌ వైపు వచ్చారు. యువకుడికి బస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేసే యువకుడు పరిచయం ఉండడంతో అతనికి ఫోన్‌చేసి ఈ రాత్రికి యువతిని ఉంచేందుకు ఆస్పత్రిలో రూమ్‌ కావాలని అడిగారు. ఆస్పత్రికి చేరుకున్న తర్వాత మద్యం మత్తులో ఉన్న యువతిని ఇద్దరు యువకులు బలవంతంగా ఆస్పత్రిలోకి తీసుకెళ్తున్నారని గమనించిన ఆస్పత్రి ముందు గల షాపింగ్‌ మాల్‌ సెక్యూరిటీ గార్డులు వారిని నిలదీశారు.

దీంతో యువకులు, సెక్యూరిటీ గార్డుల మధ్య వాగ్వివాదం జరిగింది. సెక్యూరిటీ గార్డులు డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో యువతిని అక్కడే వదిలివేసి యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఒకటో టౌన్‌ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పారిపోతున్న నలుగురిలో ఇద్దరిని పట్టుకున్నారు. యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ఇద్దరు యువకులను తెల్లవారుజామున పట్టుకున్నారు. నిందితుల్లో శేఖర్‌తో పాటు అతని స్నేహితులు కోటగల్లికి చెందిన భానుప్రకాశ్, నవీన్, బస్టాండ్‌లో పనిచేసే కరీం ఉన్నారు. అడిషనల్‌ డీసీపీ ఉషావిశ్వనాథ్‌ యువతిని విచారించి వివరాలు సేకరించారు. బాధితురాలిని సఖీ కేంద్రానికి తరలించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement