సాక్షి, నిజామాబాద్ : బోధన్‌లో మళ్లీ అక్రమ పాస్‌పోర్టుల కలకలం మొదలైంది. బోధన్ పోస్టాఫీసుకు కొత్తగా మరో 80 నకిలీ పాస్‌పోర్టులు వచ్చాయి. షర్బత్ కెనాల్‌లోని నాలుగు ఇళ్ల అడ్రస్‌లపై ఈ పాస్‌పోర్టులు ఉన్నాయి. అవి తప్పుడు పాస్‌పోర్టులని గుర్తించిన పోస్టల్ సిబ్బంది డోర్‌లాక్ పేరుతో వాటిని వెనక్కు పంపేశారు. రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసు నుండి అవి వచ్చినట్లు తపాలా శాఖ అధికారులు చెబుతున్నారు.
కాగా, బోధన్ కేంద్రంగా నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించి ఇప్పటికే 72 మంది బంగ్లాదేశీయులు పొందిన సంగతి తెలిసిందే. పాస్‌పోర్టుల కుంభకోణంలో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మళ్లీ అవే అడ్రస్‌లకు నకిలీ పాస్‌పోర్టులు రావటంతో పోలీస్ శాఖలో టెన్షన్ మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment