PASSPORTS
-
ఫ్రీ పాస్‌పోర్ట్, నో ట్యాక్స్.. ఓ దేశం బంపరాఫర్!
సెంట్రల్ అమెరికా దేశం ఎల్ సాల్వడార్ అత్యంత నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు బంపరాఫర్ ప్రకటించింది. తమ దేశానికి వచ్చే ఇలాంటివారికి 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను అందించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బుకెలే ప్రకటించారు. దేశ పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో ఈ సంఖ్య 5 బిలియన్ డాలర్లకు ( సుమారు రూ. 41 వేల కోట్లు) సమానం అని ఆయన తెలిపారు. "విదేశాల నుండి అత్యంత నైపుణ్యం కలిగిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, తత్వవేత్తలకు 5,000 ఉచిత పాస్‌పోర్ట్‌లను (మా పాస్‌పోర్ట్ ప్రోగ్రామ్‌లో 5 బిలియన్ డాలర్లకు సమానం) అందిస్తున్నాం. ఇది మా జనాభాలో 0.1 శాతం కంటే తక్కువే కాబట్టి వారికి పూర్తి పౌర హోదాను కల్పిస్తాం. ఓటింగ్ హక్కులతో సహా ఎటువంటి సమస్య లేకుండా చూసుకుంటాం" అని ఎల్ సాల్వడార్ ప్రెసిడెంట్ బుకెలే ‘ఎక్స్’లో ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా విదేశాల నుంచి తమ దేశానికి తరలివచ్చే కుటుంబాలకు, ఇక్కడ వారు సంపాదించుకునే ఆస్తులపై ఎటువంటి పన్నులు, సుంకాలు లేకుండా చూసుకుంటామన్నారు. దీని గురించి త్వరలో మరిన్ని వివరాల ప్రకటిస్తామని బుకెల్ వెల్లడించారు. We're offering 5,000 free passports (equivalent to $5 billion in our passport program) to highly skilled scientists, engineers, doctors, artists, and philosophers from abroad. This represents less than 0.1% of our population, so granting them full citizen status, including… — Nayib Bukele (@nayibbukele) April 6, 2024 -
ఒకే ఆధార్, పాన్‌కార్డు.. పాస్పోర్టులెన్నో
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కోరుట్ల: తీగ లాగితే పాస్‌పోర్టుల డొంకంతా కదులుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్లతోపాటు కరీంనగర్, వేములవాడ, సిరిసిల్లలోనే ఈ రాకెట్‌కు ప్రధాన ఏజెంట్లు ఉన్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు రోహింగ్యాలు విదేశాలకు వెళ్లారన్న విషయాన్ని గుర్తించిన సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వారికి పలు నిర్ఘాంతపోయే విషయాలు తెలుస్తున్నాయి. స్థానికులు, విదేశీయులు అన్న తేడా లేకుండా.. ఎవరికి పాస్‌పోర్టులు కావాలన్నా.. కేవలం కొన్నిరోజుల్లోనే వచ్చేలా చేయడంలో వీరిది అందెవేసిన చేయి. ఇప్పటివరకూ 92 మందిని దేశం దాటించగలిగారు. ఇలా వెళ్లిన వారిలో విదేశీయులు ఉండటంతో విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. పైగా ఈ దందాకు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సహకరించారన్న విషయాన్నీ ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. నాంపల్లి టు జగిత్యాల ఈ రాకెట్‌కు నాంపల్లికి చెందిన అబ్దుల్ సత్తార్ ఒస్మాన్ అల్ జవహరీ ప్రధాన సూత్రధారి. ఇతను నాంపల్లిలోని బడే మజీదు వద్ద నివసించే ఇతను డీటీపీ గ్రాఫిక్స్‌లో సిద్ధహస్తుడు. ఈ పనితోపాటు పాస్‌పోర్టు బ్రోకర్గాను పనిచేసేవాడు. నకిలీ విద్యార్హతలు, ఆధార్, పాన్‌కార్డు ఇలా కీలక నకిలీ డాక్యుమెంట్లు తయారు చేస్తూ గల్ఫ్ ఏజెంట్ల సర్కిల్లో బాగా పాపులర్ అయ్యాడు. వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లోని బ్రోకర్లకు పాస్‌పోర్ట్‌లకు కావాల్సిన సర్టిఫికెట్లు సమకూర్చేవాడు. ఈ గ్యాంగ్ వద్ద దగ్గర దొరకని పత్రం అంటూ ఏదీ ఉండదు. విద్యార్హత, ధ్రువీకరణ పత్రం, ఆధార్, పాన్ ఏది కావాలన్నా నిమిషాల్లో రెడీ చేస్తాడు. కొందరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా వీరికి సహకరించడంతో వీరి పని మరింత సులువై, పాస్‌పోర్టులు ఇప్పించి విదేశీయులను భారతీయులుగా దేశం దాటించగలిగారు. వీరు ఇప్పించిన పాస్‌పోర్టుల్లో అత్యధిక పాస్‌పోర్టులకు ఒకే ఆధార్, ఒకే ఫోన్ నంబరు ఉండటంతో విషయం వెలుగుచూసింది. ఈసీఎన్ఆర్ కేటగిరీలోనే.. ఇమిగ్రేషన్‌లో దొరికిపోకుండా తనిఖీలు అవసరం లేని ఈసీఎన్ఆర్ (ఇమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వైర్డ్) కేటగిరీలోనే పాస్‌పోర్టులు ఇప్పించారు. ఇందుకు వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారు. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్ నంబరునే అటాచ్ చేసి ఉంచడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేసిన సీఐడీ అధికారులు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న 12 మంది నిందితులను అరెస్టు చేసి, ఫారినర్స్ యాక్ట్ 1946, పాస్‌పోర్ట్ యాక్ట్‌తోపాటు పలు సెక్షన్ల కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏజెంట్లు రాకెట్ సూత్రధారి అబ్దుల్ సత్తార్ తన నెట్‌వర్క్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాడు. అబ్దుల్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి (హైదరాబాద్)కి చెందినవాడు కాగా.. మిగిలిన మహ్మద్ ఖమ్రుద్దీన్, చాంద్‌ఖాన్, దేశోపంతుల అశోక్ రావు (కోరుట్ల), పెద్దూరి శ్రీనివాస్ (తిమ్మాపూర్, కరీంనగర్), గుండేటి ప్రభాకర్ (జగిత్యాల), పోచంపల్లి దేవరాజ్ (వేములవాడ, సిరిసిల్ల), అబ్దుల్ షుకూర్ (రాయికల్, జగిత్యాల). వీరంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. వీరంతా కలిసి ఎంతమందికి నకిలీ సర్టిఫికెట్లు ఇప్పించారు..? ఎంతమంది విదేశీయులకు పాస్‌పోర్టులు ఇప్పించారు..? అన్న విషయంపై సీఐడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇక్కడి చిరునామాలతో పలువురు కెనడా, మలేసియా, దుబాయ్, గల్ఫ్ దేశాలు, స్పెయిన్, ఫ్రాన్స్, థాయ్‌లాండ్, ఇరాక్ తదితర దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు. వారంతా అక్కడ ఏం చేస్తున్నారు..? ఏ కంపెనీలో పనిచేస్తున్నారు..? అన్న విషయాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. పదేళ్ల తర్వాత మళ్లీ... 2014లోనే డబుల్ పాస్‌పోర్ట్‌లు, వాటికి అవసరమైన నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణలతో కోరుట్లకు చెందిన ఖమరోద్దీన్, అశోక్‌రావు, చాంద్‌పాషాపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. శుక్రవారం సీఐడీ అధికారుల దాడులతో వీరంతా పాస్‌పోర్ట్ దందా ఆపలేదని రుజువైంది. -
నకిలీ పాస్‌పోర్ట్‌ల ముఠా గుట్టురట్టు
సాక్షి, హైదరాబాద్, సాక్షిప్రతినిధి, కరీంనగర్: నివాస ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు ఇలా అన్నింటినీ నకిలీవి సృష్టించి విదేశీయులకు స్థానికంగా పాస్‌పోర్టులు జారీ చేయిస్తున్న ఓ ముఠా గుట్టురట్టు చేశారు తెలంగాణ సీఐడీ పోలీసులు. ఈ మొత్తం ముఠాలో కీలక నిందితుడు అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జహ్వరీతో పాటు నకిలీ పాస్ పోర్టుల జారీకి పనిచేస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులు, వీరికి సహకరిస్తున్న ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు.. మొత్తం 12మందిని శుక్రవారం అరెస్టు చేశారు. విదేశాల నుంచి వచ్చిన శరణార్థులు, అక్రమ చొరబాటు దారులకు నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టులు జారీ అవుతున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెలంగాణ సీఐడీ రంగంలోకి దిగింది. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్‌లోని పలు ప్రాంతాల్లో సీఐడీ అధికారుల 12 ప్రత్యేక బృందాలు ఈనెల 18న ఏక కాలంలో సోదాలు జరిపాయి. ఈ సోదాల్లో 108 పాస్‌పోర్టులు, 15 మొబైల్ ఫోన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, మూడు ప్రింటర్లు, 11 పెన్‌డ్రైవ్‌లు, ఒక స్కానర్, పాస్‌పోర్టు దరఖాస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐడీ ఎకనమిక్ అఫెన్స్ వింగ్ ఎస్పీ కే వెంకట లక్ష్మి నేతృత్వంలో చేపట్టిన ఈ ఆపరేషన్ వివరాలను సీఐడీ అడిషనల్ డీజీ శిఖాగోయల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ పత్రాల తయారీ నుంచి పాస్‌పోర్టుల వరకు హైదరాబాద్‌కు చెందిన అబ్దుస్ సత్తార్ స్థానికంగా గ్రాఫిక్ డిజైనింగ్, ప్రింటింగ్ వర్క్‌లో పనిచేసేవాడు. 2011నుంచి ఎస్సెస్సీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించడం ప్రారంభించాడు. చెన్నైకి చెందిన ఓ పాస్‌పోర్టు బ్రోకర్‌తో టచ్‌లోకి వెళ్లిన సత్తార్..రూ.75 వేల కమీషన్‌కు ఒక్కో పాస్‌పోర్టు జారీ చేసేలా.. ఇందుకు అవసరమైన నకిలీ పత్రాలు కూడా సృష్టించేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. ముందుగా నకిలీ ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన తర్వాత సత్తార్ హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని పాస్‌పోర్టు కార్యాలయాల్లో స్లాట్లు బుక్ చేయించి ఇక్కడి నుంచి పాస్‌పోర్టులు జారీ చేయించేవాడు. పోలీస్ వెరిఫికేషన్‌కు వచ్చే స్పెషల్ బ్రాంచ్ అధికారులకు సైతం లంచాలు ఇస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు కీలక నిందితులతోపాటు ఈ ముఠాలో చెన్నై ఏజెంట్‌ను సైతం బెంగళూరులో అరెస్టు చేసి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ ముఠా నుంచి పాస్‌పోర్టులు పొందిన వారిలో 92 మంది విదేశీ ప్రయాణాలు చేసినట్టు సీఐడీ అధికారుల దర్యాప్తులో తెలిసింది. మొత్తం 12 మంది నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు లంచాల ఎర! నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణంలో సీఐడీ అధికారులు తవ్విన కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన ఈ ముఠా.. కేవలం నకిలీ పత్రాలతో పాస్‌పోర్టులను సంపాదించడమే కాకుండా.. విదేశీయులు, దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు కూడా భారతీయత ఉండేలా తప్పుడు ఐడీలు సృష్టించి, పాస్‌పోర్టులు, వీసాలు ఇప్పించి సాగనంపారని తెలుస్తోంది. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సైతం లంచాలిచ్చి భారతీయులు కాని వారికి సైతం ఇక్కడి జనన, విద్యార్హత, ఇతర ధ్రువీకరణ పత్రాలు ఇప్పించి విదేశాలకు విమానాలెక్కించారని విచారణలో తెలిసింది. చాలా పాస్‌పోర్టులకు ఒకే ఆధార్ కార్డు ఉండటం, కస్టమర్లందరికీ ఏజెంట్లు తమ ఫోన్నెంబరునే అటాచ్ చేసి ఉంచడంతో అనుమానం వచ్చిన పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు చేపట్టడంతో ముఠా గుట్టు బయటపడింది. అరెస్టు అయింది వీరే! అబ్దుస్ సత్తార్ ఉస్మాన్ అల్ జవహరీ నాంపల్లి.. హైదరాబాద్, మహ్మద్ ఖమ్రుద్దీన్ కోరుట్ల, చాంద్ ఖాన్ కోరుట్ల, దేశోపంతుల అశోక్ రావు కోరుట్ల, పెద్దూరి శ్రీనివాస్ తిమ్మాపూర్.. కరీంనగర్, గుండేటి ప్రభాకర్ జగిత్యాల, పోచంపల్లి దేవరాజ్ వేములవాడ, చెప్పాల సుభాష్ భీంగల్.. నిజామాబాద్, అబ్దుల్ షుకూర్ రాయికల్.. జగిత్యాల, సయ్యద్ హాజీ (కాలాపత్తర్) తోపాటు వీరికి సహకరించిన మరో ఇద్దరు స్పెషల్ బ్రాంచ్ అధికారులు అరెస్టయ్యారు. -
పాస్ పోర్టు కోసం ఎగబడుతున్న దక్షిణాది ప్రజలు!
కరోనా ప్రభావం విదేశీ ప్రయాణాలపై పడుతుందని వేసిన అంచనా.. ఘోరంగా తప్పింది. ట్రావెల్ బ్యాన్లు ఎత్తేయడం, పలు దేశాలు నిబంధనల సరళీకరణ గేట్లు తెరవడంతో.. మళ్లీ విదేశీయానాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో భారత్‌లో పాస్‌పోర్ట్ దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరగ్గా.. అందులో దక్షిణాది రాష్ట్రాల ప్రజలు అత్యధికంగా పాస్‌పోర్టుల కోసం దరఖాస్తు చేసుకోవడం, మంజూరు కావడం గమనార్హం. దేశంలో లాక్డౌన్ శకం ముగిశాక.. అంటే జూన్ 1, 2021 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 28 దాకా భారత దేశంలో మంజూరు అయిన పాస్‌పోర్టుల సంఖ్య వివిధ రాష్ట్రాల లిస్ట్‌ను పరిశీలిస్తే.. అత్యధిక పాస్‌పోర్టుల మంజూరుతో మొదటి స్థానంతో పాటు మొత్తం దక్షిణ భారత దేశ రాష్ట్రాలు టాప్ టెన్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాయి. ఈ జాబితాలో కేరళకు అత్యధికంగా పాస్‌పోర్టులు మంజూరు అయ్యాయి. 23,69,727 పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఆ రాష్ట్రం నుంచి వలసలు కొత్త కాదన్న సంగతి తెలిసిందే. ఇక.. అత్యల్పంగా లక్షద్వీప్‌కు 3,086 పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఇక అత్యధిక పాస్‌పోర్టులు జారీ అయిన రాష్ట్రాల్లో కేరళ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర(19,96,829) నిలిచింది. ఆపై వరుసగా ఉత్తర ప్రదేశ్(17, 40,522), తమిళనాడు(16,69,807) ఉన్నాయి. లిస్ట్‌లో నెక్ట్స్ పంజాబ్(15,13,519), గుజరాత్(12,19,914) అత్యధికంగా పాస్‌పోర్టులు మంజూరు అయ్యాయి. ఇక ఈ లిస్ట్‌లో తర్వాతి ప్లేస్‌లో ఉన్న కర్ణాటకకు 11,29,758 పాస్‌పోర్టులు జారీ అయ్యాయి. ఆ తర్వాతి ప్లేస్‌లో తెలుగు రాష్ట్రాలు నిలిచాయి. తెలంగాణకు 10,22,887 పాస్‌పోర్టులు, ఏపీలో 7,99,713 పాస్‌పోర్టులు మంజూరు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలు మధ్యలో వెస్ట్ బెంగాల్ 8,75,915 పాస్‌పోర్టులతో జాబితాలో నిలిచింది. మొత్తంగా పాస్‌పోర్టులకు దక్షిణ భారత దేశంలో ఎంత డిమాండ్ ఉందన్నది ఈ గణాంకాలు మరోసారి తేటతెల్లం చేశాయి. -
బోధన్‌లో మళ్లీ అక్రమ పాస్‌పోర్టుల కలకలం
-
బోధన్‌లో మళ్లీ అక్రమ పాస్‌పోర్టుల కలకలం
సాక్షి, నిజామాబాద్ : బోధన్‌లో మళ్లీ అక్రమ పాస్‌పోర్టుల కలకలం మొదలైంది. బోధన్ పోస్టాఫీసుకు కొత్తగా మరో 80 నకిలీ పాస్‌పోర్టులు వచ్చాయి. షర్బత్ కెనాల్‌లోని నాలుగు ఇళ్ల అడ్రస్‌లపై ఈ పాస్‌పోర్టులు ఉన్నాయి. అవి తప్పుడు పాస్‌పోర్టులని గుర్తించిన పోస్టల్ సిబ్బంది డోర్‌లాక్ పేరుతో వాటిని వెనక్కు పంపేశారు. రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసు నుండి అవి వచ్చినట్లు తపాలా శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా, బోధన్ కేంద్రంగా నకిలీ ఆధార్‌కార్డులను సృష్టించి ఇప్పటికే 72 మంది బంగ్లాదేశీయులు పొందిన సంగతి తెలిసిందే. పాస్‌పోర్టుల కుంభకోణంలో ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయ్యారు. కేసు దర్యాప్తు కొనసాగుతుండగానే మళ్లీ అవే అడ్రస్‌లకు నకిలీ పాస్‌పోర్టులు రావటంతో పోలీస్ శాఖలో టెన్షన్ మొదలైంది. చదవండి : దారుణం: ఎంగిలి పల్లెం విసిరాడని చిన్నాన్నను.. పోలీసులకు తలనొప్పిగా మారిన పందెం కోడి ! -
ఎన్నారై భర్తల ఆగడాలకు కేంద్రం చెక్
-
45 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్టులు రద్దు
న్యూఢిల్లీ: భార్యలను వదిలేస్తున్న ఎన్నారై భర్తలపై కొరడా ఝుళిపించినట్లు కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ తెలిపారు. ఇప్పటివరకూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ 45 మంది ఎన్నారైల పాస్‌పోర్టులను రద్దుచేసినట్లు వెల్లడించారు. కేంద్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాత్సవ నేతృత్వంలో సమీకృత నోడల్ ఏజెన్సీ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. మహిళలకు న్యాయం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును తాము తీసుకొచ్చినప్పటికీ రాజ్యసభలో ఆగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 1967 నాటి పాస్‌పోర్ట్ చట్టం, 1973 నాటి క్రిమినల్ ప్రొసిజర్‌లో సవరణలు తీసుకొచ్చి ఈ బిల్లు రూపొందిచినట్టు తెలిపారు. విదేశాంగ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ బిల్లును తయారు చేశాయని వెల్లడించారు. -
త్వరలో హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసులు మరో 3 నెలల్లో అత్యంత భద్రతా ఫీచర్లున్న హై సెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు అందుకోనున్నారు. ఉన్నత విద్య, వైద్యం, పర్యాటకం, తాత్కాలిక నివాసం తదితర అవసరాల నిమిత్తం విదేశీ పర్యటనలు చేసేందుకు పాస్‌పోర్ట్‌లు తప్పనిసరి. దీంతో మహానగరం పరిధిలో నెలకు లక్షకు పైగా నూతన పాస్‌పోర్ట్‌ల జారీ, పాతవాటి రెన్యువల్స్ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో హైసెక్యూరిటీ గల ఈ–చిప్‌లు ఉండే పాస్‌పోర్ట్‌లను అందజేసేందుకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ అనుమతితో దేశవ్యాప్తంగా పాస్‌పోర్ట్‌ల డిమాండ్ అధికంగా ఉన్న నగరాలకు అత్యంత భద్రతా ఫీచర్లతో పాస్‌పోర్ట్‌లను ముద్రించే ప్రింటింగ్ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ యంత్రాలను నాసిక్‌లోని సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ ఆధ్వర్యంలో నిపుణుల పర్యవేక్షణలో తయారు చేస్తున్నట్లు వివరించారు. మరో 3 నెలల తర్వాత నూతనంగా పాస్‌పోర్ట్ దరఖాస్తు చేసుకున్నవారికి, పాతవాటిని రెన్యువల్ చేసుకునేవారికి ఈ–చిప్‌లు ఉన్న అత్యంత భద్రమైన పాస్‌పోర్ట్‌లను అందజేయనున్నారు. నో ట్యాంపరింగ్..: పాస్‌పోర్ట్‌లో అత్యంత కీలకమైన పుట్టినతేదీ, తండ్రి, భార్య, భర్త పేరు, ఆధార్ నంబర్, ప్రస్తుత, శాశ్వత చిరునామా వంటి వ్యక్తిగత వివరాలకు అత్యంత భద్రత కల్పించేందుకే ఈ హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లు జారీ చేయాలని విదేశాంగ శాఖ సంకల్పించింది. ప్రస్తుతం జారీ చేస్తున్న 36 పేజీలు లేదా 60 పేజీల బుక్‌లెట్‌లా ఉండే హైసెక్యూరిటీ పాస్‌పోర్ట్‌లో అత్యంత నాణ్యత ఉండే కాగితాన్ని వినియోగించడంతోపాటు పేజీల్లో అంతర్లీనంగా ఈ–చిప్‌లను పొందుపరచనున్నారు. ఒకవేళ ఇతరుల ఫొటో పెట్టి ట్యాంపరింగ్‌కు ప్రయత్నిస్తే ఈ–చిప్‌ల ద్వారా పాస్‌పోర్ట్ కార్యాలయానికి సందేశం అందుతుందని పాస్‌పోర్ట్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. భద్రత పరంగా ఇవి అత్యంత సురక్షితమని తెలిపారు. ఇక ఈ–చిప్ ఉన్న పాస్‌పోర్ట్‌ల జారీకి ప్రస్తుతమున్న చార్జీలే వర్తిస్తాయని చెప్పారు. -
స్త్రీలోక సంచారం
పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లాక భార్యను వదిలించుకుని, ముఖం చాటేసి తిరుగుతున్నారన్న ఆరోపణలపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవలి కొద్ది నెలల్లోనే 25 మంది ఎన్నారై భర్తల పాస్‌పోర్ట్‌లను రద్దు చేసి, వారిపై ‘లుకౌట్ సర్క్యులర్’ జారీ చేసినట్లు కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ తాజాగా విడుదల చేసిన సమాచారంలో వెల్లడైంది. భార్యకు, కుటుంబ సభ్యులకు తెలియకుండా, నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటుకూ దొరక్కుండా తిరిగే ఇటువంటి భర్తలను వలపన్ని పట్టేందుకు జారీ అయ్యే లుకౌట్ నోటీసు వల్ల నిందితులు దేశాలు దాటేందుకు అవకాశం ఉండదు. ఎక్కడిక్కడ తనిఖీ చేస్తారు కనుక, ఎక్కడివారు అక్కడే ఉండిపోవలసి వస్తుంది. మరోవైపు.. తప్పుడు ఎన్నారై భర్తల ఆగడాలను నియంత్రించేందుకు జాతీయ మహిళా కమిషన్ ఈ ఏడాది జనవరిలో చట్టాన్ని మరింత కట్టుదిట్టం చేయడంతో ఇంతవరకు 578 మంది మహిళలు ముందుకొచ్చి తమ భర్త పెడుతున్న గృహహింసపైన, ఇతర దుశ్చర్యల మీద కమిషన్‌కు ఫిర్యాదు చేయగలిగారు. దీర్ఘకాలిక వ్యాధులకు నిత్యం మందులు వాడుతుండే మహిళల్లో ఔషధ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గించేందుకు పంజాబ్ ఆరోగ్యశాఖ ‘హార్మ్ రిడక్షన్ ప్రాజెక్టు’ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా మొదట పంజాబ్‌లోని కపుర్తల జిల్లాలో అమలు చేయబోతున్నారు. ‘హార్మ్ రిడక్షన్ అడ్వొకసీ ఇన్ ఏషియా’, ‘గ్లోబల్ ఫండ్ టు ఫైట్ ఎయిడ్స్, ట్యూబర్క్యులోసిస్ అండ్ మలేరియా’ సంస్థల భాగస్వామ్యంతో పంజాబ్ ఆరోగ్య శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది. మందుల దుష్ఫ్రభావాలను తగ్గించడానికి మార్గాలను అన్వేషించడమే కాకుండా, మందుల వాడకం వల్ల సామాజికంగా, ఆర్థికంగా మహిళలకు ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను వెదికేందుకు పెట్టుబడులు రాబట్టి, పరిశోధనలు, అధ్యయనాలు చేయించడం; వాటి ఫలితాలను అనుసరించి మందులు వాడే మహిళలకు సూచనలు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని ‘ఇండియా హె.ఐ.వి./ఎయిడ్స్’ సంస్థ డైరెక్టర్ (పాలసీ) డాక్టర్ ఉమంగ్ చావ్లా తెలిపారు. -
పాస్‌పోర్టుకు ‘ఈ–వెరిఫికేషన్’
నెల్లూరు: పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం రోజుల తరబడి దరఖాస్తు దారుడు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం (మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్) ఇటీవల ఉత్తర్వులు విడుదల చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై వెరిఫికేషన్ ప్రక్రియ దరఖాస్తు దారుడితో నిమిత్తం లేకుండానే ఆయా ప్రాంత పోలీసుస్టేషన్, డీసీఆర్బీలో అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ ద్వారా (క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్)ను నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పాస్‌పోర్టు దరఖాస్తు స్పెషల్ బ్రాంచ్ కార్యాలయానికి వచ్చిన మూడు రోజులలోపే పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మార్పు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి దరఖాస్తుదారుడితో నిమిత్తం లేకుండా వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో పాస్‌పోర్టు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న మరుసటి రోజు వెరిఫికేషన్ నిమిత్తం జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తును డౌన్లోడ్ చేసుకొంటారు. దరఖాస్తు సమయంలో సమర్పించిన పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం, ఆధార్‌కార్డు, విద్యార్హత, పెళ్లికి సంబంధించిన డాక్యుమెంట్లను క్షేత్రస్థాయిలో పరిశీలన నిమిత్తం స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి పరిశీలించే వారు. చుట్టు పక్కల వారిని విచారించి దరఖాస్తుదారుడు ప్రవర్తనపై ఆరా తీయడంతో పాటు దరఖాస్తుదారుడి వద్ద సంతకాలు సేకరించేవారు. అతనిపై ఏవైనా కేసులు ఉన్నాయో లేవో ఆయా ప్రాంత పోలీస్స్టేషన్లలో తెలుసుకుని దాని ఆధారంగా నివేదిక తయారు చేసేవారు. ఈ ప్రక్రియ పూర్తిచేయడంలో అనేక సమస్యలు ఉండేవి. కొన్నిసార్లు దరఖాస్తుదారుడు అందుబాటులో లేకపోవడం, మరికొన్ని సార్లు వెరిఫికేషన్‌లో ఆలస్యం అవుతుండటం, కొన్నిచోట్ల వెరిఫికేషన్ పేరిట దరఖాస్తుదారుడి ఇబ్బందులకు గురిచేయడం తదితరాల కారణంగా పాస్‌పోర్టు రావడం ఆలస్యం అయ్యేది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసింది. వెరిఫికేషన్ పేరిట పోలీసులు వస్తే ఫిర్యాదు చేయండి పాస్‌పోర్టు వెరిఫికేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం సులభతరం చేసింది. దరఖాస్తుదారుడితో నిమిత్తం లేకుండా వెరిఫికేషన్ ప్రక్రియ రెండు, మూడు రోజుల్లో ఎస్బీ పోలీసులు పూర్తి చేస్తారు. వెరిఫికేషన్ పేరిట ఎవరైనా ఎస్బీ పోలీసులు దరఖాస్తుదారుడి ఇంటికి వస్తే వెంటనే స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం, లేదా స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ, సీఐలకు సమాచారం అందించాలి. – సత్యయేసుబాబు, ఇన్చార్జి ఎస్పీ -
ఏడ్రోజుల్లో ఎన్నారై వివాహ రిజిస్ట్రేషన్
న్యూఢిల్లీ: భారత్‌లో జరిగే ఎన్నారై వివాహాలన్నీ ఏడు రోజుల్లోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సిందేనని కేంద్ర మహిళా, శిశుసంక్షేమ శాఖ స్పష్టం చేసింది. ఒకవేళ వారం రోజుల్లో రిజిస్టర్ చేసుకోని పక్షంలో పాస్‌పోర్టులు, వీసాలు జారీ చేసే అవకాశం ఉండదని పేర్కొంది. గతవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మనేకా గాంధీ ఎన్నారై వివాహాలు కచ్చితంగా రెండ్రోజుల్లోనే రిజిస్టర్ అవ్వాలని సూచించారు. అయితే.. ఇలాంటి వివాహాల్లో మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రుల బృందం (రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, రవిశంకర్ ప్రసాద్, మేనకా గాంధీ) సమావేశంలో దీన్ని ఏడురోజులకు పెంచాలని నిర్ణయించారు. ఎస్క్రో (వివాహం తర్వాత భార్యను తీసుకెళ్తానని మూడో వ్యక్తి సమక్షంలో పత్రము రాసుకుని ఆ తర్వాత అది చెల్లదని తప్పించుకోవడం) కేసుల్లో భార్యను వదిలేసి పారిపోయే ఎన్నారైల ఆస్తులను జప్తు చేసుకోవడంతోపాటు.. ఇలాంటి వివాహాల్లోని పలు సమస్యలను పరిష్కరించడంపైనా మంత్రివర్గ బృందం చర్చించింది. ఇందుకు నేర శిక్ష్మాస్మృతి నిబంధనలు, వివాహ చట్టం, పాస్‌పోర్ట్ చట్టాల్లో సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నిర్ణయించారు. ప్రస్తుతం ఎన్నారై వివాహాల రిజిస్ట్రేషన్‌కు ఎలాంటి సమయ పరిమితి లేదు. -
వెనక్కి తగ్గిన కేంద్రం: రాహుల్ ఎఫెక్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్టు రంగుమార్పులో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆరెంజ్ కలర్లో పాస్‌పోర్టులను జారీ చేయాలనే ఆలోచనను విరమించుకుంది ఇకమీదట ప్రస్తుతం ఉన్న విధానం కొనసాగుతుందని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. పాస్‌పోర్ట్ చివరి పేజీ ప్రింటింగ్‌లో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించిందని ఒక ప్రకటనలో విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనిపై రివ్యూ నిర్వహించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివిధ వాటాదారులతో సమగ్ర చర్చలు చేపట్టారు. అనంతరం నారింజ రంగు జాకెట్ తో ఒక ప్రత్యేక పాస్‌పోర్ట్ జారీ కాదు , చివరి పేజీ ముద్రణలో ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించిందని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఇమిగ్రేషన్ చెక్ అవసరం ఉన్న పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఆరెంజ్ రంగు పాస్‌పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణికి నిదర్శనమనీ, వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ మండిపడిన సంగతి తెలిసిందే. -
వారికి పాస్‌పోర్టు ఫీజు మినహాయింపు
న్యూఢిల్లీ: పాస్‌పోర్టు చట్టం ఉత్సవాల సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ సీనియర్ సిటిజనులకు, చిన్నపిల్లలకు పాస్‌పోర్టు పీజులో మినహాయింపును ప్రకటించారు. అలాగే పాస్‌పోర్టులు ఇకపై రెండు భాషల్లో జారీకానున్నాయని చెప్పారు. కేవలం ఇంగ్లీషులోనే కాకుండా హిందీ, ఇంగ్లీషు రెండు భాషల్లో ఉండనున్నాయని సుష్మా స్వరాజ్ శుక్రవారం ప్రకటించారు. 1967 పాస్సోర్ట్ చట్టం 50 సంవత్సరాల సందర్భంగా నిర్వహించిన పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా అధికారుల సమ్మేళనంలో ఆమె ప్రసంగించారు. రెండురోజుల పాటు నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో పాస్‌పోర్ట్ రుసుములో తగ్గింపును ప్రకటించారు. ముఖ్యంగా ఎనిమిది సం.రాల లోపు వారికి, 60 ఏళ్లు పైబడిన దరఖాస్తుదారులకు ఫీజులో 10 శాతం తగ్గింపుని ప్రకటించారు. కాగా పాస్‌పోర్ట్‌లో ప్రకటించే వ్యక్తిగత వివరాలు ప్రస్తుతం ఆంగ్లంలో మాత్రమే ముద్రిస్తున్న సంగతి తెలిసిందే. -
ఒకే వ్యక్తి నుంచి 47 పాస్‌పోర్టులు స్వాధీనం
అఫ్జల్‌గంజ్: 47 పాస్‌పోర్ట్‌లు తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అమ్మిరెడ్డి(26) బెంగళూరులోని ఓ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో కొరియర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ట్రాన్స్‌పోర్టు యజమాని రషీద్ పురమాయించిన మేరకు అతడు సోమవారం హైదరాబాద్ చేరుకున్నాడు. పాతబస్తీకి చెందిన రషీద్ స్నేహితుడు వాహిద్‌ను కలుసుకుని, అతనిచ్చిన బ్యాగ్‌తో తిరిగి బెంగళూరు వెళ్లేందుకు ఎంజీబీఎస్‌కు చేరుకున్నాడు. అతడు అక్కడ బస్ కోసం వేచి చూస్తుండగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. అమ్మిరెడ్డి వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో 47 పాస్‌పోర్టులు బయటపడ్డాయి. అయితే, వాటి విషయం తనకు తెలియదని, రషీద్ చెప్పిన మేరకు బ్యాగ్ తీసుకువెళ్తున్నానని అతడు తెలిపాడు. పోలీసులు అతని నుంచి 47 పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకొని, రిమాండ్‌కు తరలించారు. దీనికి కారకులైన వాహీద్, రషీద్‌లు పరారీలో ఉన్నారు. -
చేతిరాత పాస్‌పోర్ట్ చెల్లదిక!
నవంబర్ 24 తర్వాత వీటిని అనుమతించరు సాక్షి, హైదరాబాద్: చేతిరాతతో జారీ చేసిన పాస్‌పోర్ట్‌లు ఇకపై చెల్లుబాటు కావు. వాటిని తీసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే విదేశాలకు వెళ్లేందుకు చేతిరాత పాస్‌పోర్ట్‌లు అనుమతించరు. ఈ మేరకు ఇప్పటికే అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) విదేశాంగ శాఖకు సూచించింది. ఈ నేపథ్యంలో విదేశీ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాల పాస్‌పోర్ట్ కార్యాలయాలకు ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం జారీ అయ్యే మెషిన్ రీడబుల్ (యంత్రాల ఆధారంగా రూపొందించిన) పాస్‌పోర్ట్‌లు పదేళ్ల కాలపరిమితికి ఇస్తున్నారు. 2001 ఏడాదికి ముందు హ్యాండ్ రిటన్ (చేతిరాత)తో పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు. అప్పట్లో కొంతమంది 20 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నారు. ఆ తరహా చేతిరాత పాస్‌పోర్ట్‌లు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఇలాంటి పాస్‌పోర్ట్‌లు 2015 నవంబర్ 24 వరకే చెల్లుబాటవుతాయి. ఆ తర్వాత వీటికి వీసా ఇవ్వడానికి నిరాకరిస్తారు. ఏడాది ముందే దరఖాస్తు చేసుకోవచ్చు.. చాలా దేశాలు పాస్‌పోర్ట్ గడువు 6 మాసాల కంటే తక్కువ ఉన్నప్పుడు ప్రయాణానికి అనుమతించవు. అందుకే పదేళ్ల పాస్‌పోర్ట్ కాలపరిమితిలో తొమ్మిదేళ్లు పూర్తవగానే రెన్యువల్ చేసుకోవాలి. పాస్‌పోర్టు బుక్‌లెట్‌లో 2పేజీలకి మించి లేకపోతే చాలా దేశాలు అనుమతించ వు. తరచూ విదేశీ ప్రయాణాలు చేసేవారు జంబోబుక్లెట్కు దరఖాస్తు చేసుకోవాలి. - అశ్విని సత్తారు, హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిణి -
మయన్మార్ దేశస్తులకు భారత్ పాస్‌పోర్టులు
సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్‌కు చెందిన అక్రమ వలసదారులకు ఇండియన్ పాస్‌పోర్టులు ఇప్పించేందుకు సహకరించిన పాస్‌పోర్టు బ్రోకర్‌తో పాటు ఇద్దరు ఎస్బీ సిబ్బందిని సౌత్‌జోన్ టీమ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక ఒరిజినల్ పాస్‌పోర్టు, ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ టి.ప్రభాకర్‌రావు కథనం ప్రకారం...ముంబైకి చెందిన అసన్ జియా అన్సారీ ఉపాధి నిమిత్తం 2003లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. తొలినాళ్లలో ప్రైవేట్ ఉద్యోగం చేసిన అన్సారీ...ఆ తర్వాత డాటా ఎంట్రీ అపరేటింగ్‌ను ఉపాధిగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి అక్రమంగా నగరంలో నివాసముంటున్న మయన్మార్ శరణార్ధులకు ఆధార్ కార్డులు సమకూరుస్తున్న షాహీన్‌నగర్‌కు మహమ్మద్ జావేద్ (మయన్మార్ వాసి)తో పరిచయం ఏర్పడింది. దీంతో పాస్‌పోర్టు బ్రోకర్ అవతారమెత్తిన అతను ఎస్బీ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్‌తో పరిచయం పెంచుకుని మయన్మార్ దేశస్తులకు ఇండియన్ పాస్‌పోర్టులు ఇప్పించేవాడు. బషీర్ అహ్మద్‌తో పాటు పాస్‌పోర్టు దరఖాస్తులను పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్లో హోంగార్డుగా పనిచేస్తున్న సలీమ్‌కు కూడా భారీ మొత్తంలో లంచాలు ఇచ్చాడు. పాస్‌పోర్టులు పొందినవారు టూరిస్టు వీసాపై సౌదీ అరేబియా వెళ్లినట్టు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎన్.కోఠి రెడ్డి ఆధ్వర్యంలో సౌత్‌జోన్ ఇన్స్పెక్టర్ ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్, ఎస్ఐలు జి.మల్లేశ్, కె.వెంకటేశ్వర్లు, ఎస్కే జాకీర్ హుస్సేన్, డి.వెంకటేశ్వర్లు ఈ దాడులు నిర్వహించారు. -
ఆన్లైన్లో పాస్పోర్ట పరిశీలన
చెన్నై, సాక్షి ప్రతినిధి: పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు శుభవార్త. ఆన్లైన్లోనే దరఖాస్తులను పరిశీలించే విధానం ఈ ఏడాది నవంబర్ నుంచి అమల్లోకి రానుంది. దేశంలోని మహానగరాల్లో ఒకటైన చెన్నైలో అమెరికన్ ఎంబసీ, శ్రీలంక రాయబార కార్యాలయం, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఎందరో పారిశ్రామిక వేత్తల ద్వారా విదేశీ మార్కెట్‌తో ఎగుమతులు, దిగుమతులు సాగుతుంటాయి. ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం వేలాది మంది విద్యార్థులు చెన్నై నుంచి వెళుతుంటారు. గతంలో విదేశాలకు వెళ్లదలిచిన వారు మాత్రమే పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునేవారు. ఇలాంటి వారి సంఖ్య స్వల్పంగా ఉండేది. కానీ సాఫ్ట్వేర్ కంపెనీల పుణ్యమా అని భారత్‌కు ప్రపంచ దేశాలకు మధ్య దూరం తగ్గిపోయింది. రెండు దశాబ్దాలుగా పాస్‌పోర్టుల సంఖ్య పెరిగిపోయింది. చెన్నై నగరం నుంచి సగటున రోజుకు వెయ్యి మంది వరకు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. గత ఏడాది చెన్నై నుంచి రెండు లక్షల పాస్‌పోర్టులు మంజూరయినాయంటే వీటి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పోలీస్ తనిఖీలు తప్పనిసరి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోగానే అధికారికంగా పడే తొలిఅడుగు పోలీస్ వెరిఫికేషన్ (పోలీస్ తనిఖీలు). జిల్లా స్థాయిలో ఎస్పీలు, నగరంలో పోలీస్ కమిషనర్లు స్వయంగా పాస్‌పోర్టు దరఖాస్తుల వ్యవహారాన్ని పరిశీలిస్తుండగా, పోలీస్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా పాస్‌పోర్టు పరిశీలన విభాగాలే ఉన్నాయి. సంబంధిత విభాగానికి చెందిన పోలీసులు దరఖాస్తు దారుడి నివాసం , ఆపరిసరాల్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అతనిపై ఏమైన కేసులు, రౌడీషీట్లు వంటివి ఏమైనా ఉన్నాయాని తనిఖీ చేస్తారు. ఆ తరువాత ఇంటికి వచ్చి చిరునామాను నిర్ధారణ చేసుకుని ఇతర వివరాలపై విచారణ జరుపుతారు. అన్నీ సంతృప్తికరంగా ఉన్న పక్షంలో మాత్రమే పాస్‌పోర్టు మంజూరుకు సిఫార్సు చేస్తారు. చె న్నై నగరంలో రోజు రోజుకూ పాస్‌పోర్టు దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతుండగా, వాటి పరిశీలనకు నేరుగా వెళ్లడంలో జాప్యం జరుగుతోంది. సిబ్బంది కొరత, దరఖాస్తు దారుడు ఇంటిలో లేకపోవడం వంటి అనేక కారణాలతో ఒక్కో దరఖాస్తు పరిశీలనకు కనీసం వారం నుండి 20 రోజులు పడుతోంది. ఇక ఆన్లైన్లోనే పోలీస్ తనిఖీలు పాస్‌పోర్టు దరఖాస్తులపై పోలీస్ పరిశీలనలో జాప్యాన్ని నివారించేందుకు ఆన్లైన్ విధానం అమలులోకి తెస్తున్నారు. జనాభా జాబితా, ఆధార్ కార్డు, ఓటరు కార్డు తదితర వివరాలను పొందుపరుస్తారు. క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ పేరుతో దరఖాస్తులను అనుసంధానం చేస్తారు. ఈ రకమైన్ ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు దారునిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే సంగతి పోలీస్ కార్యాలయం నుండే పసిగట్టేస్తారు. కేసులు లేని పక్షంలో వెంటనే పాస్‌పోర్టు మంజూరుకు సిఫార్సు చేస్తారు. ఈ విధానం వల్ల దరఖాస్తు దారుని ఇంటికి, పరిసరాల్లోని పోలీస్ స్టేషన్లకు పోలీసు సిబ్బంది తిరిగే బాధ తప్పుతుంది. అంతేగాక జాప్యానికి తావులేకుండా పాస్‌పోర్టు మంజూరవుతుంది. చెన్నైకు సంబంధించి పోలీస్ కమిషనర్ జార్జ్ స్వియ పర్యవేక్షణలో పాస్‌పోర్టు విభాగం పనిచేస్తోంది. పోలీసు తనిఖీలు ముగిసిన దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే పోలీస్ కమిషనర్ కార్యాలయం నుంచి పాస్‌పోర్టు కార్యాలయానికి పంపే విధానం ఇప్పటికే అమలులో ఉండటం విశేషం. -
ప్రయాణానికి బీమా.. ధీమా..
విహారయాత్రలు కావొచ్చు.. లేదా ఇతరత్రా అవసరాలరీత్యా పర్యటనలు కావొచ్చు.. సాఫీగా సాగాలంటే ముందస్తుగా ప్రణాళిక ఉండాలి. ఎందుకంటే.. ఏది ఎంతగా ప్లానింగ్ చేసుకున్నా మన చేతుల్లో లేని కారణాల వల్ల ఏవయినా అవాంతరాలు కలగొచ్చు. ఫ్లయిట్ డిలే కావడమో లేదా పర్యటనలో ఏదైనా అనుకోని పరిస్థితుల్లో చిక్కుకోవడమో లాంటివి జరగొచ్చు. ఇలాంటప్పుడే ఆదుకుంటాయి ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు. నిజంగా అవసరమా? తొలిసారిగా పర్యటిస్తున్న వారిలో చాలా మందిలో కలిగే సందేహమే ఇది. కొన్ని దేశాల్లో పర్యటించాలంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి.. మరి కొన్ని దేశాల్లో అవసరం లేదు. ఈ నేపథ్యంలో అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్‌కి ఇంత ప్రాధాన్యమివ్వడం అవసరమా అనే ప్రశ్న తలెత్తవచ్చు. అయితే, దేశం ఏదైనప్పటికీ ప్రయాణ బీమా తీసుకోవడం మంచిదే. ఉదాహరణకు సింగపూర్ లాంటి దేశానికి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా ఏ పంటి నొప్పి వచ్చినా.. లేదా ఏదైనా ప్రమాదంలో గాయపడినా చికిత్స కోసం వేలల్లో వెచ్చించాల్సి వస్తుంది. అది కూడా డాలర్లలో. అలాంటప్పుడు అంత పెద్ద మొత్తం కట్టడం సాధ్యపడకపోవచ్చు. పైగా దీని వల్ల ట్రీట్మెంట్లోనూ జాప్యం జరిగి శాశ్వతంగా బాధపడాల్సిన పరిస్థితి ఎదురుకావొచ్చు. కేవలం ఆరోగ్యపరమైనవే కాదు.. మనం వెంట తీసుకెళ్లే ఖరీదైన కెమెరానో లేదా మరో వ్యక్తిగత ప్రాపర్టీనో పోగొట్టుకునే రిస్కులు కూడా విదేశాల్లో ఎదురవ్వొచ్చు. దేశం కాని దేశంలో .. ఏదో మారుమూల ప్రాంతంలో ఇలా జరిగినప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ప్రయోజనాలనేకం.. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తినా పర్యటనలు సజావుగా సాగిపోగలవు. ఎందుకంటే.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంటే డైలీ అలవెన్సు, పాస్‌పోర్టులు.. టికెట్లు మొదలైన ట్రావెల్ పత్రాలు పోగొట్టుకుంటే పరిహారం, చెకిన్ బ్యాగేజీ పోయినా పరిహారం, వైద్య చికిత్స ఖర్చులు మొదలైన వాటన్నింటినీ బీమా కంపెనీయే చూసుకుంటుంది. నగదుపరమైన పరిహారం ఇవ్వడమే కాకుండా.. విస్తృతమైన నెట్వర్క్ ఉన్న పెద్ద బీమా సంస్థలు మరిన్ని అదనపు సర్వీసులు కూడా అందించగలవు. ఉదాహరణకు మొరాకో లాంటి ఏ దేశంలోనో పాలసీదారుకు అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు హెలికాప్టర్లాంటి వాటి ద్వారా సైతం వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆస్పత్రులకు తరలించగలవు. ప్రాణాంతక పరిస్థితిలో చిక్కుకున్నప్పుడు ఇలాంటి సర్వీసులు ప్రాణాలు నిలబెట్టగలవు. చౌకయినవి.. నమ్మకమైనవి... ప్రస్తుతం బీమా సంస్థలు పాలసీదారుల బడ్జెట్లు, అవసరాలకు అనుగుణంగా వివిధ పాలసీలు అందిస్తున్నాయి. సుమారు రూ. 800 కడితే చాలు.. 7 రోజుల ట్రిప్‌కి 50,000 డాలర్ల మేర కవరేజీ (ఒక్కరికి) లభించగలదు. కావాలనుకుంటే కస్టమరు తనకు అవసరాన్ని బట్టి మరికొన్ని రైడర్లు కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం పాలసీ ప్రీమియంలో సుమారు 10-20 శాతం కడితే చాలు. గ్రూప్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. తరచుగా విదేశీ పర్యటనలు చేసే వారు మల్టీ-ట్రిప్ ప్లాన్స్ తీసుకుంటే మరికాస్త తక్కువ ప్రీమియంకే లభిస్తాయి. ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు చౌకైనవి, నమ్మికైనవే కాకుండా తీసుకోవడం కూడా సులభతరమైన ప్రక్రియే. వివిధ కంపెనీలు అందిస్తున్న పాలసీలను, కట్టాల్సిన ప్రీమియంలను ఆన్లైన్లో పోల్చి చూసుకుని.. సమగ్రమైనవాటిని అప్పటికప్పుడు కొనుక్కోవచ్చు. ట్రిప్ వివరాలు పొందుపరిస్తే చాలా మటుకు కంపెనీలు తమ కొటేషన్లు అందజేస్తాయి. కనుక, తప్పనిసరి అయినా.. కాకపోయినా ఏదైనా పర్యటనకు బైల్దేరినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ధీమాగా ట్రిప్ పూర్తి చేసుకురావొచ్చు. -
నకిలీ పాస్‌పోర్టులతో వచ్చిన 5గురి అరెస్టు
శంషాబాద్: సౌదీ అరేబియా నుంచి నకిలీ పాస్‌పోర్టులపై వచ్చిన ఐదుగురు ప్రయాణికులను విమానాశ్రయ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు రాజస్థాన్, ఇద్దరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు. అక్కడ ఉద్యోగాలు కల్పించిన సంస్థలు తమ పాస్‌పోర్టులను లాగేసుకోవటంతో గత్యంతరం లేక నకిలీ పాస్‌పోర్టులపై వచ్చినట్లు వారు తెలిపారని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వర్గాలు పేర్కొన్నాయి. -
ఏజెంట్ల గుప్పిట్లోనే పాస్‌పోర్టులు
మోర్తాడ్ : మలేసియాలో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులకు సంబంధించిన పాస్‌పోర్టులను ఏజెంట్లు తమ గుప్పిట్లో ఉంచుకుని వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అక్కడ ఎయిర్‌పోర్టు నుంచి బయట పడగానే ఏజెంట్లు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. పర్యాటకులకు స్వర్గధామంగా విరాజిల్లుతున్న మలేసియాలో బార్లు, రె స్టారెంట్లు, రిసార్టులు, పబ్‌లు, వాణిజ్య సముదాయాల్లో పనులు ఉన్నాయని నమ్మించి కార్మికులను మభ్య పెట్టారు. నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు రెండు వేల మందిని మలేసియాకు తరలించినట్లు అంచనా. వర్క్ వీసాలు ఇస్తామని నమ్మించిన ఏజెంట్లు కార్మికుల నుంచి లక్షన్నర రూపాయల చొ ప్పున వసూలు చేశారు. విజిట్ వీసాలు చేతిలో పెట్టి నట్టేట ముంచారు.ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమిటని ప్ర శ్నిస్తే వర్క్ వీసా కోసమని బురిడీ కొట్టించారు. కొందరు కార్మికులు మాత్రం ముందు జాగ్రత్తగా పాస్‌పోర్టు జిరాక్స్ కాపీలను తమ వద్ద ఉంచుకున్నారు. వాటి ఆధారం గానే మలేసియాలో సెల్ సిమ్‌కార్డులను పొందారు. చెన్నైలోని ఏజెంటుకు ఫోన్ చేస్తే మరో రూ. 30వేలు చెల్లిస్తే పాస్‌పోర్టును ఇప్పిస్తామని స్పష్టం చేశాడని కార్మికులు వివరించారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకపోయిన తాము మళ్లీ అంత డబ్బు ఎలా చెల్లించగలమని ప్రశ్నిస్తున్నారు. చేతిలో పాస్‌పోర్టు లేకపోవడంతో దొంగచాటుగా దొరి కిన పని చేస్తు కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. మలేసియా పోలీసులకు చిక్కకుండా తలదాచుకుంటున్నారు. మలేసియాలో పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులను పట్టుకుని జైళ్లో పెడుతున్నారు. జరిమానా చెల్లించినవారికి ఔట్ పాస్‌పోర్టును జారీ చేసి పంపిస్తున్నారు. జరి మానాతోపాటు విమాన టిక్కెట్‌కు అయ్యే ఖర్చును కార్మికులు సొంతంగా భరించాల్సి ఉంది. కార్మికులు జైళ్లో ఉండటంతో వారికి ఇంటి నుంచి సొమ్మును పంపాల్సిన అ వసరం ఏర్పడింది. మలేసియాలో కష్టాలు పడుతున్న మనవారిని ఇంటికి రప్పించాలని, ఏజెంట్లను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. -
8 లక్షల పాస్‌పోర్టుల జారీ లక్ష్యం
పీఓ అశ్వినీ సత్తార్ ‘ఎక్స్‌పిడీషియస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్’ ప్రారంభం మూడు రోజుల్లో వెరిఫికేషన్: కమిషనర్ సీవీ ఆనంద్ ఎస్బీ సిబ్బందికి ట్యాబ్స్ పంపిణీ గచ్చిబౌలి: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లే ఈ ఏడాది 8 లక్షల పాస్‌పోర్టులు ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నామని హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్టు అధికారి అశ్వినీ సత్తా ర్ తెలిపారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ‘ఎక్స్‌పిడీషియస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్’ను ఆమె ముఖ్యతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్వినీ సత్తార్ మాట్లాడుతూ విదేశాంగ శాఖ గతేడాది ఆయా రాష్ట్రాలకు కోటి పాస్‌పోర్టులు లక్ష్యంగా నిర్ణయించిందన్నారు. సమైక్య రాష్ట్రంలో 7 లక్షల పాస్ పోర్టులు జారీ చేశామన్నారు. ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో 8 లక్షల పాస్ పోర్టులు జారీ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రపంచంలో పాస్‌పోర్టుల జారీలో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 3వ స్థానంలో ఉందన్నారు. పారదర్శకంగా వెరిఫికేషన్ రిపోర్టు ఇచ్చే బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తాత్కాల్ పాస్‌పోర్టు కోసం ఐపీఎస్‌ల వెరిఫికేషన్ తప్పని సరికాదని అఖిల భారత సర్వీస్‌లో విధులు నిర్వహిస్తున్న గెజిటెడ్ ఆఫీసర్లు వెరిఫికేషన్ చేయొచ్చన్నారు. ఇంటెలిజెన్స్ డీఐజీ శివధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్ల క్రితం జిల్లాలోని ఎస్పీ కార్యాలయాలకు పాస్‌పోర్టు వెరిఫికేషన్ కోసం ఎంతో మంది వచ్చేవారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. 107 రోజుల నుంచి 7 రోజులకు తగ్గిండమే ఎంతో గొప్ప విషమన్నారు. నేడు వెరిఫికేషన్ సమయాన్ని 3,4 రోజులకు తగ్గిండం ప్రజలకు ఎంతో మేలు చేస్తుందనడంలో సందేహం లేదన్నారు స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) సిబ్బంది అంకిత భావంతో పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ రమేశ్ మాట్లాడుతూ... పాస్‌పోర్టుల జారీలో పోలీసుల పాత్ర కీలకమన్నారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్ చేసేందుకు 2012లో దేశ వ్యాప్తంగా సరాసరి 107 రోజులు పడితే.. సమైకాంధ్రలో 21 రోజులు పట్టేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సరాసరి 9 రోజులలో వెరిఫికేషన్ జరుగుతోందన్నారు. సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ విభాగం, సైబరాాబాద్ పోలీసులు, రీజనల్ పాస్‌పోర్టు అధికారులు 8 నెలలు శ్రమించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ‘ఎక్స్‌పిడీషియస్ పాస్‌పోర్ట్ వెరిఫికేషన్’ను ప్రారంభించామన్నారు. దీని ద్వారా ప్రస్తుతం 13 రోజుల ఉన్న వెరిఫికేషన్ సమయాన్ని 3 లేక 4 రోజులకే పరిమితం చేయనున్నామన్నారు. ఆన్లైన్ పాస్‌పోర్టు దరఖాస్తులను సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయం నుంచి ఆయా పోలీస్ స్టేషన్లలో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్ల (ఎస్బీ అధికారి)కు పంపిస్తామన్నారు. వారు ట్యాబ్‌లో దరఖాస్తును చూసుకొని వెరిఫికేషన్ చేసి రిపోర్టును ట్యాబ్‌లోనే సబ్మిట్ చేస్తారన్నారు. ఆ రిపోర్టును సైబరాబాద్ కమిషనర్ కార్యాలయం సిబ్బంది పరిశీలించి రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయానికి ఆన్లైన్లో పంపిస్తారని, దీంతో 3 లేదా 4 రోజుల్లో పాస్‌పోర్టు జారీ చేసేందుకు అవకాశముంటుందని చెప్పారు. వెరిఫికేషన్‌కు ఎప్పుడు వచ్చేది దరఖాస్తుదారుడికి ఎస్ఎంఎస్ అలర్ట్ పంపిస్తామన్నారు. కాగా, ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రఘువాసు రూపొందించారు. -
హజ్‌యాత్రకు పాస్‌పోర్టులు సిద్ధం చేసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్ర-2015కు వెళ్లాలనే ఆసక్తి ఉన్నవారు పాస్‌పోర్టులను సిద్ధం చేసుకోవాలని తెలంగాణ హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్.ఎ.షుకూర్ బుధవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. హజ్ యాత్రకు సంబంధించిన దరఖాస్తు ఫారాల పంపిణీ ప్రక్రియ జనవరి నుంచి ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. పాస్‌పోర్టులను ఖచ్చితంగా జతచేయాలని, లేనియెడల ఆ దరఖాస్తులు స్వీకరించబోమని ఆయన స్పష్టం చేశారు. దరఖాస్తు ఫారంలో బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌తోపాటు ఖాతా నంబరు కూడా తెలియజేయాలని సూచించారు. -
ఇక చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్:సీపీ
హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా పాస్‌పోర్టు దరఖాస్తుదారులకు ఇకపై ఎస్సెమ్మెస్ అలర్ట్ ఇస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మహేందర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 804 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 428 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. చైన్‌స్నాచింగ్ పాల్పడేవారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగిస్తామన్నారు. ముస్తఫా కేసు దర్యాప్తులో సైనికాధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఈ కేసును చేధిస్తామని మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
పనిలేదు... తిండిలేదు
* ఇరాక్‌లో రోడ్డు పాలైన రాష్ట్ర వాసులు * పాస్‌పోర్టులు లాక్కుని పని కల్పించని అక్కడి దళారులు * ప్రభుత్వం సాయం చేయాలని వేడుకోలు రాయికల్, న్యూస్‌లైన్: బతుకుదెరువు నిమిత్తం ఇరాక్ వెళ్లిన సుమారు వంద మంది బడుగు జీవులు అక్కడి ఏజెంట్ల చేతిలో మోసపోయి నరకయాతన పడుతున్నారు. వీరిలో అత్యధికులు తెలంగాణ జిల్లాలకు చెందిన వారే. వారి వ్యథలను గురువారం ‘న్యూస్‌లైన్’కు ఈమెయిల్ ద్వారా వివరించారు. ఇరాక్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని ఇక్కడి ఏజెంట్లు చెప్పడంతో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన పలువురు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు అప్పు తెచ్చి మరీ వారి చేతిలో పెట్టారు. వీరిలో కరీంనగర్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన సంతోష్, జ్ఞానేశ్వర్, చిన్నఎల్లయ్య, జగిత్యాలకు చెందిన విక్రమ్, నవీన్, నిజామాబాద్ జిల్లాకు చెందిన కృష్ణ, ముత్యం, శ్రీనివాస్, నవీన్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కిరణ్, ఖమ్మంకు చెందిన రాములుతోపాటు ఆంధ్రా ప్రాంతానికి చెందిన పలువురు ఉన్నారు. ఏజెంట్లు ఇచ్చిన వీసాలతో వీరంతా 45 రోజుల క్రితం ఇరాక్‌లోని బాగ్దాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే అక్కడి దళారులు ఒక్కొక్కరివద్ద 200 డాలర్లతోపాటు పాస్‌పోర్టులు లాక్కున్నారు. పని చూపించమని అడిగితే దాడి చేసి తీవ్ర భయభ్రాంతులకు గురిచేశారు. అప్పటినుంచి వీరి బతుకులు రోడ్డు పాలయ్యాయి. తిండిలేక, వసతి లేక నానా అవస్థలు పడుతున్నారు. కొందరు తెలిసిన వారి గదుల్లో తలదాచుకుంటున్నారు. పాస్‌పోర్టులు లేకపోవడంతో ఎక్కడా పనికి వెళ్లలేకపోతున్నారు. ఇరాక్ పంపించిన ఏజెంట్లను ఫోన్లో సంప్రదిస్తే తమకు సంబంధం లేదని సమాధానం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారత రాయబార కార్యాలయం అధికారులు స్పందించాలని, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని తమ సమస్య పరిష్కరించాలని బాధితులు కోరుతున్నారు.