మోర్తాడ్ : మలేసియాలో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులకు సంబంధించిన పాస్‌పోర్టులను ఏజెంట్లు తమ గుప్పిట్లో ఉంచుకుని వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అక్కడ ఎయిర్‌పోర్టు నుంచి బయట పడగానే ఏజెంట్లు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. పర్యాటకులకు స్వర్గధామంగా విరాజిల్లుతున్న మలేసియాలో బార్‌లు, రె స్టారెంట్‌లు, రిసార్టులు, పబ్‌లు, వాణిజ్య సముదాయాల్లో పనులు ఉన్నాయని నమ్మించి కార్మికులను మభ్య పెట్టారు.
నిజామాబాద్, కరీంనగర్,ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన దాదాపు రెండు వేల మందిని మలేసియాకు తరలించినట్లు అంచనా. వర్క్ వీసాలు ఇస్తామని నమ్మించిన ఏజెంట్లు కార్మికుల నుంచి లక్షన్నర రూపాయల చొ ప్పున వసూలు చేశారు. విజిట్ వీసాలు చేతిలో పెట్టి నట్టేట ముంచారు.ఎయిర్‌పోర్టు నుంచి బయటకు రాగానే పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఇదేమిటని ప్ర శ్నిస్తే వర్క్ వీసా కోసమని బురిడీ కొట్టించారు. కొందరు కార్మికులు మాత్రం ముందు జాగ్రత్తగా పాస్‌పోర్టు జిరాక్స్ కాపీలను తమ వద్ద ఉంచుకున్నారు.
వాటి ఆధారం గానే మలేసియాలో సెల్ సిమ్‌కార్డులను పొందారు. చెన్నైలోని ఏజెంటుకు ఫోన్ చేస్తే మరో రూ. 30వేలు చెల్లిస్తే పాస్‌పోర్టును ఇప్పిస్తామని స్పష్టం చేశాడని కార్మికులు వివరించారు. ఇప్పటికే అప్పుల్లో కూరుకపోయిన తాము మళ్లీ అంత డబ్బు ఎలా చెల్లించగలమని ప్రశ్నిస్తున్నారు. చేతిలో పాస్‌పోర్టు లేకపోవడంతో దొంగచాటుగా దొరి కిన పని చేస్తు కార్మికులు పొట్టపోసుకుంటున్నారు. మలేసియా పోలీసులకు చిక్కకుండా తలదాచుకుంటున్నారు. మలేసియాలో పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఉంటున్న కార్మికులను పట్టుకుని జైళ్లో పెడుతున్నారు.
జరిమానా చెల్లించినవారికి ఔట్ పాస్‌పోర్టును జారీ చేసి పంపిస్తున్నారు. జరి మానాతోపాటు విమాన టిక్కెట్‌కు అయ్యే ఖర్చును కార్మికులు సొంతంగా భరించాల్సి ఉంది. కార్మికులు జైళ్లో ఉండటంతో వారికి ఇంటి నుంచి సొమ్మును పంపాల్సిన అ వసరం ఏర్పడింది. మలేసియాలో కష్టాలు పడుతున్న మనవారిని ఇంటికి రప్పించాలని, ఏజెంట్లను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఏజెంట్ల గుప్పిట్లోనే పాస్‌పోర్టులు
Published Thu, Feb 5 2015 4:54 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM
Advertisement