ఇక చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్:సీపీ | PD Act on chain snatchers, says M. Mahender Reddy | Sakshi
Sakshi News home page

ఇక చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్:సీపీ

Published Sat, Oct 11 2014 3:49 PM | Last Updated on Mon, Oct 22 2018 2:17 PM

ఇక చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్:సీపీ - Sakshi

ఇక చైన్ స్నాచర్లపై పీడీ యాక్ట్:సీపీ

హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా పాస్పోర్టు దరఖాస్తుదారులకు ఇకపై ఎస్సెమ్మెస్ అలర్ట్ ఇస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్రెడ్డి వెల్లడించారు. పాస్పోర్టు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తామని తెలిపారు. శనివారం హైదరాబాద్లో మహేందర్ రెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. గత ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 804 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ వరకు 428 చైన్ స్నాచింగ్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.

చైన్స్నాచింగ్ పాల్పడేవారిపై పీడీ యాక్ట్ను ప్రయోగిస్తామన్నారు. ముస్తఫా కేసు దర్యాప్తులో సైనికాధికారులు సహకరిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఈ కేసును చేధిస్తామని మహేందర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement