Chain snatchers
-
నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
హైదరాబాద్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల ఘటన మరువకముందే నగరంలో మరో చోట కాల్పులు కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్‌లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా.. గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు.కాగా, సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్‌ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉదంతంలో తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. -
హైదరాబాద్ సీ‘రియల్’ స్నాచర్ల కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని రెండు కమిషనరేట్ల పరిధిలో వరుస స్నాచింగ్స్‌కు పాల్పడిన సీరియల్ స్నాచర్ల వ్యవహారంలో స్పష్టత వస్తోంది. నగరానికి వచ్చిన నలుగురు బవారియా గ్యాంగ్ సభ్యుల్లో ఇద్దరే నేరుగా నేరాలు చేసినట్లు తేలింది. ఏడు గొలుసు దొంగతనాలు, రెండు వాహన చోరీలు వీళ్లే చేయగా.. మిగిలిన ఇద్దరూ పథక రచనలోనే కీలకంగా వ్యవహరించినట్లు, వీరు కేవలం నాంపల్లి రైల్వేస్టేషన్ పరిసరాలకు పరిమితమయ్యారని వెలుగులోకి వచ్చింది. ఇద్దరు సీరియల్ స్నాచర్లలో ఒకడైన మంగళ్‌ను రాచకొండ పోలీసులు ఇటీవల పీటీ వారెంట్‌పై తీసుకువచ్చారు. ఇతడిని కోర్టు అనుమతితో తొమ్మిది రోజుల పాటు విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే పలు కీలకాంశాలు వెలుగుచూశాయి. రైలులో వచ్చి.. నాంపల్లిలో దిగి... ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని ఉన్ మండలానికి చెందినదే ఈ బవారియా గ్యాంగ్. ఆ మండలంలోని పలు హామ్లెట్స్లో నివసించే పలు ముఠాలు దేశ వ్యాప్తంగా చైన్ స్నాచింగ్స్ సహా అనేక నేరాలు చేస్తుంటాయి. పంకజ్ అలియాస్ పింకు నేతృత్వంలో మంగళ్, దీపక్ అలియాస్ సెహ్వాగ్, సేవజ్ అలియాస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్నారు. బెంగళూరులో వరుస స్నాచింగ్స్ చేసిన తర్వాత రైలులో గత నెల 7న నగరానికి వచ్చారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో రైలు దిగిన నలుగురూ కాసేపు స్టేషన్ పరిసరాల్లోనే సంచరించారు. ఆ తర్వాత పింకు, మంగళ్ ఆటో ఎక్కగా మిగిలిన ఇద్దరూ స్టేషన్ బయట ఉన్న కేఫ్ వద్ద ఆగిపోయారు. కేవలం కొన్ని గంటల్లోనే తమ ‘పని’ పూర్తి చేసుకునే ఈ గ్యాంగ్ ఫోన్లు వాడదు. తమ వారి నుంచి ఎక్కడ వేరయ్యారో, మళ్లీ అక్కడికే వచ్చి కలుస్తుంటారు. మాస్టర్ ‘కీ’ వినియోగించి మ్యాస్ట్రో.. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆటో మాట్లాడుకున్న పింకు, మంగళ్ నేరుగా చార్మినార్ వద్దకు వెళ్లారు. అక్కడ ఆటోడ్రైవర్‌కు రూ.200 ఇచ్చి పంపేశారు. స్నాచింగ్స్ చేయడానికి అనువైన వాహనాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి తస్కరించడానికి గాలించారు. మిట్టీకా షేర్ వద్ద కనిపించిన మ్యాస్ట్రో వాహనాన్ని తమ వద్ద ఉన్న మాస్టర్ ‘కీ’ వినియోగించి చోరీ చేశారు. దానిపై నాంపల్లి ప్రాంతానికి చేరుకునేసరికే స్నాచింగ్స్ చేయడానికి అనువైందని కాదని భావించారు. అక్కడి శ్రీనివాస గ్రాండ్ హోటల్ వద్దకు అదే రోజు తెల్లవారుజామున 5.10 గంటలకు చేరుకున్న ఈ ద్వయం.. మ్యాస్ట్రో వాహనాన్ని వదిలి, అక్కడ ఉన్న పల్సర్ బైక్‌ను తస్కరించారు. దానిపైనే తిరుగుతూ ఉప్పల్, నాచారం సహా అయిదు పోలీసుస్టేషన్ల పరిధిలో ఏడు గొలుసు దొంగతనాలు చేసి 21 తులాల బంగారం అపహరించారు. తమ వారిని కలిసి తప్పుదారి పట్టిస్తూ.. రామ్‌గోపాల్‌పేట ప్రాంతంలో పల్సర్ వాహనాన్ని వదిలేసిన పింకు, మంగళ్ అక్కడ నుంచి ఆటోలో నాంపల్లి రైల్వేస్టేషన్ వద్దకు వచ్చారు. కేఫ్ సమీపంలో ఉన్న సెహా్వగ్, లక్ష్మణ్‌లను కలిశారు. అక్కడ నుంచి నలుగురూ పోలీసులను తప్పుదారి పట్టించేలా వివిధ ప్రాంతాల్లో తిరిగి చివరకు వరంగల్ జిల్లా కాజీపేట నుంచి కేరళ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ పారిపోయారు. చోరీ సొత్తు మొత్తం లక్ష్మణ్ తీసుకున్నాడని, అక్కడ నుంచి తాము స్వగ్రామాలకు వెళ్లిపోయారని మంగళ్ పోలీసుల వద్ద అంగీకరించాడు. ఇతడిచ్చిన వివరాల ఆధారంగా రాచకొండ పోలీసులు మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్టు చేయడంతో పాటు సొత్తు రికవరీ చేయడానికీ సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క మంగళ్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేసి, విచారించడానికి మిగిలిన నాలుగు ఠాణాల అధికారులూ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయా న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలు చేశారు. -
దొరకని సీరియల్ చైన్ స్నాచర్ల జాడ.. తిరిగొస్తేనే పట్టుకునేది!
సాక్షి, హైదరాబాద్: సీరియల్ చైన్ స్నాచింగ్‌లలో కలకలం రేపిన బవారియా ముఠా జాడ ఇంకా చిక్కలేదు. పక్షం రోజుల క్రితం హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏడు ప్రాంతాలలో స్నాచింగ్‌లకు పాల్పడిన పింకు గ్యాంగ్.. పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలకు చెందిన ముఠా కోసం వెళ్లిన పోలీసు బృందాలు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవటంతో తిరిగి వెనక్కి వచ్చేసినట్టు తెలిసింది. చేతిలోని డబ్బు అయిపోయాక మళ్లీ స్నాచింగ్‌ల కోసం తిరిగి ఈ పింకు గ్యాంగ్ నగరానికి వస్తేనే పట్టుకునే అవకాశం ఉందని ఓ పోలీసు అధికారి అభిప్రాయపడ్డారు. పంథా మార్చిన స్నాచర్లు.. ఆరేడేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం బవారియా గ్యాంగ్ స్నాచింగ్ పంథా మారింది. గతంలో వేరే రాష్ట్రంలో బైక్‌ను దొంగిలించి స్నాచింగ్ గూడ్స్ రైలులో బైక్‌ను పార్శిల్ చేసి తీసుకొచ్చేవారు. స్నాచింగ్ చేసేశాక బైక్‌లను ఇక్కడే వదిలేసి పరారయ్యేవాళ్లు. ప్రస్తుతం గూడ్స్ రైళ్లలో తనిఖీలు పెరగడంతో నేరస్తులు పంథా మార్చారని, స్థానికంగానే బైక్‌ను దొంగిలించే స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని ఓ పోలీసు ఉన్నతాధికారి వివరించారు. అలాగే గతంలో ఒక వృద్దురాలిని వెంట తీసుకొచ్చి దుస్తులు విక్రయించేందుకో లేదా ఆసుపత్రికి వచ్చామనో స్థానిక ఇంటి యజమానికి నకిలీ గుర్తింపు పత్రాలను సమర్పించి అద్దెకు తీసుకునేవాళ్లు. ఆపైన పలు ప్రాంతాలలో రెక్కీ చేసి ఉదయం 6 నుంచి 8 గంటలు లేదా సాయంత్రం 7 నుంచి 9 గంటల మధ్య మ్యాత్రమే స్నాచింగ్‌లకు పాల్పడేవాళ్లు. కానీ, ఇప్పుడు నగరంలో షెల్టర్ తీసుకోకుండా ఒకేసారి పలు నగరాలలో చోరీ చేసి నేరుగా సొంతూళ్లకు పరారవుతున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న బెంగళూరులో వరుస చోరీలు చేసిన నిందితులు 7న నగరానికి వచి్చ.. ఉప్పల్, నాచారం, సికింద్రాబాద్‌లో వరుసగా ఏడు ఘటనల్లో 24 తులాల బంగారు గొలుసులను స్నాచింగ్ చేశారు. పక్కా ప్లానింగ్.. ఉత్తరప్రదేశ్‌లోని శామ్లీ జిల్లాలోని 10–12 గ్రామస్తులు బవారియా ముఠాగా ఏర్పడ్డాయి బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలలో మాత్రమే ఈ ముఠా స్నాచింగ్‌లకు పాల్పడుతుంటాయి. రూట్లు తెలిసిన 4 నుంచి 6 మంది వరుసగా 6 నుంచి 10 ప్రాంతాల్లో స్నాచింగ్ చేస్తారు. ఒక్కో చోట 3 నుంచి 5 తులాలు బంగారం స్నాచింగ్‌లు చేస్తుంటారు. పోలీసులకు దొరికిపోతామని స్నాచింగ్ కోసం దిగే సమయంలో సెల్ఫోన్లను అసలు వాడరు. పని పూర్తయ్యాక ఎక్కడ కలుసుకోవాలి? ఎలా పరారవ్వాలో ముందుగా ప్లానింగ్ చేసుకున్నాకే రంగంలోకి దిగుతారు. ఈ ముఠాపై హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి చాలా రాష్ట్రాలలో చాలా కేసులున్నాయని.. వీళ్లను పట్టుకునేందుకు వెళ్లితే పోలీసులపైనా కూడా దాడులు చేస్తారని, బయటి వాళ్లు వచ్చారనే సమాచారం సెకన్లలో వీరికి చేరిపోతుందని ఓ అధికారి తెలిపారు. -
చైన్ స్నాచింగ్‌లపై పోలీసులు అలర్ట్
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
హైదరాబాద్: రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉప్పల్, నాచారం, ఓయూ, నాచారం పరిధిలో ఆరు ఘటనలు జరిగాయి. దీంతో చైన్ స్నాచర్ల పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. పది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వరుస ఘటనల నేపథ్యంలో.. కాస్త అప్రమత్తంగా ఉండాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు. మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వృద్ధులనే లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. మాస్క్‌లేసుకుని బైకులపై వచ్చి గొలుసులు, తాళి బొట్లు లాక్కెల్లారు. ఉప్పల్ నుంచి ఈ పర్వం మొదలైంది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇది ముఠా పనా? లేదంటే వేర్వేరు వ్యక్తుల ప్రమేయమా? అనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. స్నాచింగ్‌లు ఇలా.. ఉదయం టైంలో.. ఉప్పల్ 6.20 గంటలకు, 6.40కి ఉప్పల్లోనే మరోచోట.. నాచారంలో 7.10కి ఓయూలో 7.40కి చిలకడగూడలో 8 గంటలకు రామ్ గోపాల్పేట పరిధలో 8.20 ఇప్పటికే ఆయా ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గస్తీ నిర్వహిస్తూ.. అనుమానాదస్పదంగా కనిపిస్తున్న వాళ్లను ప్రశ్నిస్తున్నారు. జంట నగరాల్లో వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై రాచకొండ, హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. -
సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు.. ఇంటి బయట మహిళ.. బైక్‌పై వచ్చి ఒక్కసారిగా..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్స్ మరోసారి రెచ్చిపోయారు. ఇంటి బయట పనిచేస్తున్న ఓ మహిళ మెడలో నుంచి 5 తులాల చైన్‌ను బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. హైదరాబాద్ శివారులో నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితురాలు హైమావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులు కోసం గాలింపు చేపట్టారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చదవండి: సినిమాను తలపించిన ఎటాక్ సీన్.. స్విగ్గీ డెలివరీ బాయ్‌పై వెంటపడి మరీ.. -
చైన్ స్నాచర్ల కోసం జొమాటో డెలివరీ బాయ్‌గా మారిన ముంబై పోలీసులు.. 3 రోజులపాటు
ముంబై: పోలీసులకు చిక్కకుండా దొంగలు వివిధ వేషాల్లో తిరుగుతుండటం అందరికీ తెలిసిందే. అప్పుడప్పుడు దొంగలను పట్టుకునేందుకు పోలీసులు కూడా సివిల్ డ్రెస్సుల్లో కనిపిస్తుంటారు. కానీ తాజాగా పోలీసులు దొంగలను పట్టుకునేందుకు జొమాటో డెలివరీ బాయ్‌లాగా మారారు. ఈ ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఇద్దరు చైన్ స్నాచర్లు అనేక దోపీడీలు చేసి పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్నారు. వీరిపై అనేక కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఓ కొత్త ప్లాన్ వేశారు. ముంబై పోలీసులు జొమాటో డెలివరీ బాయ్‌లుగా వేషాధారణ మార్చుకొని చాకచక్యంగా వారిని పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు. ఈ కేసుకు సంబంధించిన వివారాల ముంబై డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సోమ్‌నాథ్ ఘర్గే వివరించారు.. ఇద్దరు చైన్ స్నాచర్లపై కస్తూర్బా మార్గ్ పోలీస్ స్టేషన్లో 3, బంగూర్ నగర్ పీఎస్‌లో ఓ కేసు నమోదయ్యాయి. వీరిని గాలించేందుకు పోలీసుల బృందం రంగంలోకి దిగింది. దాదాపు 300 సిసిటీవీ ఫుటేజీలను పరిశీలించారు. విచారణలో దొంగతనం చేసే సమయంలో ఉపయోగించిన బైక్‌ను రైల్వే స్టేషన్ వద్ద పార్క్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు తమ బైక్‌ను తీసుకెళ్లేందుకు వస్తారని పోలీసులు ఖచ్చితంగా భావించారు. చదవండి: ఆశ్చర్యం..‘ఇలాంటివి మానవుల్లో కామనేగానీ.. పులుల్లో చాలా అరుదు’ దీంతో కస్తూర్బా పోలీసుల బృందమంతా జొమాటో డెలివరీ బాయ్‌ల దుస్తులను ధరించి స్టేషన్ వద్ద సుమారు 3 రోజులు వేచి ఉన్నారు. అనంతరం నిందితుల్లో ఒకరు తమ బైక్‌ను తీసుకోవడానికి వచ్చినప్పుడు అతన్ని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకొని పీఎస్‌కు తరలించారు. అతడిచ్చిన సమాచారం మేరకు మిగితా వారిని నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, దొంగిలించిన గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిని ఫిరోజ్ నాసిర్ షేక్, జాఫర్ యూసుఫ్ జాఫ్రీగా గుర్తించారు. ఇద్దరూ విఠల్వాడి, అంబివిలి నివాసితులుగా తెలిపారు. ఇద్దరు 20కి పైగా దోపిడీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. -
ఇద్దరు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
-
చైన్ స్నాచర్‌ను చితక్కొట్టిన స్తానికులు
-
మేదక్ జిల్లాలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
బంధువులే ముఠాగా ఏర్పడి..
నెల్లూరు(క్రైమ్): వారు ముగ్గురూ బంధువులు. ముఠాగా ఏర్పడ్డారు. బైక్‌లను దొంగలించి వాటిపై సంచరిస్తూ మహిళ మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లసాగారు. నెల్లూరు సీసీఎస్, పొదలకూరు పోలీసులు వారి కదలికలపై నిఘా ఉంచి అరెస్ట్ చేశారు. శుక్రవారం నగరంలోని సీసీఎస్ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్ సైదా వివరాలను వెల్లడించారు. దగదర్తి మండలం చాముదల గ్రామానికి చెందిన కె.తిరుపతి, ఆత్మకూరుకు చెందిన డి.తిరుపతి అలియాస్ పులి, ఎన్.కిరణ్‌లు బంధువులు. వారు చెడు వ్యవసనాలకు బానిసలై దొంగలుగా మారారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలు పాలై బెయిల్‌పై బయటకు వచ్చారు. తిరిగి దొంగతనాలు చేయడం ప్రారంభించారు. పలు ప్రాంతాల్లో.. నిందితులు కొంతకాలం క్రితం బుచ్చిరెడ్డిపాళెంలో ఓ మోటార్‌బైక్‌ను దొంగలించారు. దానిపై పొదలకూరు, రాపూరు, కండలేరు, కలువాయి ప్రాంతాల్లో తిరుగుతూ మహిళల మెడల్లోని బంగారు గొలుసులను తెంపుకెళ్లసాగారు. వీరి కదలికలపై సీసీఎస్, పొదలకూరు పోలీసులు నిఘా ఉంచారు. శుక్రవారం ఉదయం నిందితులు పొదలకూరు సంగం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. సీసీఎస్ ఇన్స్పెక్టర్ షేక్ బాజీజాన్ సైదా, పొదలకూరు సీఐ ఎండీ ఫిరోజ్, ఎస్సై రవినాయక్‌లు తమ సిబ్బందితో కలిసి నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించగా నేరాలు చేసినట్లు అంగీకరించారు. దీంతో వారి వద్ద నుంచి రూ.3.25 లక్షలు విలువచేసే ఒక మోటార్‌బైక్, 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. సిబ్బందికి అభినందన నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు రాబట్టేందుకు కృషిచేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ బాజీజాన్ సైదా, పొదలకూరు సీఐ ఫిరోజ్, ఎస్సై రవినాయక్, సీసీఎస్ హెడ్‌కానిస్టేబుల్స్ ఆర్.సురేష్‌కుమార్, కె.వెంకటేశ్వర్లు, పి.సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్స్ జి.రాజేష్, జి.ప్రభాకర్, యు.సురేష్, సీహెచ్ శ్రీనివాసులను సీసీఎస్ డీఎస్పీ బి.నరసప్ప అభినందించి రివార్డులు ప్రకటించారు. నిందితులపై పలు కేసులు ♦ కె.తిరుపతిపై జలదంకి పోలీసు స్టేషన్లో బంగారు దొంగతనం కేసు ఉంది. ♦ డి.తిరుపతి అలియాస్ పులిపై పొదలకూరు పోలీసు స్టేషన్లో మర్డర్ ఫర్ గెయిన్ కేసు ఉంది. ♦ ఎన్.కిరణ్‌పై ఆత్మకూరు పోలీసు స్టేషన్లో రేప్, మర్డర్ కేసు ఉంది. మరో నిందితుడు పోలీసులకు చిక్కిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు వారి బంధువైన దగదర్తి మండలం చవటపుత్తేడు గ్రామానికి చెందిన కె.వినోద్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.75 వేలు విలువచేసే రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
బెంగళూరు మహిళలే వారి టార్గెట్
బనశంకరి : విమానాల్లో బెంగళూరు నగరానికి చేరుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముంబైకి చెందిన మహ్మద్‌అలియాస్ మోహమ్మద్, సయ్యద్ కతరార్‌హుసేన్ అలియాస్ సైయ్యద్ అనే చైన్స్నాచర్లను ఈశాన్య విభాగం పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.15 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఈశాన్య విభాగం డీసీపీ కలాకృష్ణస్వామి మీడియాకు వివరాలు వెల్లడించారు. నిందితులు ముంబై నుంచి బెంగళూరు నగరానికి విమానాల్లో చేరుకుని అక్కడ నుంచి రైలులో కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌కు చేరుకునేవారు. అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న డ్యూక్ బైక్‌ల్లో సంచరిస్తూ ఒంటరిగా సంచరిస్తున్న మహిళలను టార్గెట్ చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడేవారు. తర్వాత చోరీ సొత్తును రైలు లేదా బస్సులో ముంబైకి తరలించి విక్రయించేవారు. ఇప్పటి వరకు ఐదు సార్లు నగరానికి చేరుకున్న చైన్‌స్నాచర్లు విద్యారణ్యపుర, సదాశివనగర, ఆర్టీ.నగర, బాణసవాడి, అన్నపూర్ణేశ్వరినగర తదితర 20 కి పైగా ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు తెగబడ్డారు. గత నవంబరులో విద్యారణ్యపుర సింగాపుర ఎక్స్‌ప్రెస్‌లేఔట్‌లో విజయలక్ష్మీ అనే మహిళ ఇంటి ముందు నడుచుకుని వెళుతుండగా ఆమె మెడలో ఉన్న 30 గ్రాముల బరువు గల బంగారుచైన్ లాక్కెళ్లారు. కంటోన్మెంట్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగాపార్కింగ్ చేసిన డ్యూక్ బైక్‌పై దృష్టిసారించి అక్కడి సీసీకెమెరాల ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించిన అనంతరం తీవ్రంగా గాలించి నిందితులను అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు. బెంగళూరు నగర మహిళలు అధిక బరువు కలిగిన బంగారుచైన్లు ధరిస్తారని, ఒక చైన్ దొంగలిస్తే రూ.2 లక్షల వరకు లభిస్తుందనే అంచనాతో నిందితులు బెంగళూరును టార్గెట్ చేసుకున్నట్లు విచారణలో తేలిందని డీసీపీ తెలిపారు. గ్యాంగ్‌లో మరికొందరు ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. -
చెలరేగిపోయిన చైన్‌స్నాచర్లు
చైన్‌స్నాచర్లు మరోసారి చెలరేగిపోయారు. పట్టపగలే ముగ్గురు మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు తెంపుకుని ఉడాయించారు. అగనంపూడి సమీప రాజీవ్‌నగర్ సమీపంలోనూ, ఎంపీవీ కాలనీలో రెండు చోట్ల జరిగిన ఈ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి విశాఖపట్నం, అగనంపూడి (గాజువాక): స్నేహితురాలితో కలిసి మార్కెట్‌కు వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఇద్దరు దుండగులు బంగారు గొలుసు తెంపుకొని పరారైన సంఘటన దువ్వాడ పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దువ్వాడ క్రైం ఎస్ఐ సంతోష్ తెలిపిన వివరాల ప్రకారం... రాజీవ్‌నగర్ సమీపంలోని శివసాయినగర్కు చెందిన దేవినేని పద్మ ఆమె స్నేహితురాలితో కలిసి గురువారం ఉదయం 11.30 గంటల సమయంలో రాజీవ్‌నగర్ మార్కెట్‌కు నడిచి వెళ్తున్నారు. మార్కెట్‌కు సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు గ్రే కలర్ స్కూటీపై ఆమె పక్క నుంచి వాహనాన్ని పోనిచ్చి పద్మ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాయి. నిందితులను వెంబడించినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో బాధితురాలు దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తెలిపిన వివరాలు ప్రకారం రాజీవ్‌నగర్ కూడలిలోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులను నిందితుల చిత్రాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎంవీపీ కాలనీలో... పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పట్టపగలు రోడ్డుపై చైన్‌స్నాచర్లు చెలరేగిపోయారు. ఇద్దరు మహిళల మెడలులో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసి పారిపోయారు. ఈ రెండు దొంగతనాలకు పాల్పడిందని ఒకరేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎంవీపీ కాలనీ సెక్టార్ – 6 రోడ్డుపై నుంచి వస్తున్న ఎస్.రమావేది మెడలోని నాలుగు తులాల బంగారు చైనుని బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంపుకుని పరారయ్యారు. సెక్టార్ – 6 నుంచి మహాత్మాగాంధీ ఆస్పత్రికి వచ్చే రోడ్డులో గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఎస్.రమాదేవి (64) నడుచుకుని వస్తుండగా ఈ చైన్‌స్నాచింగ్ జరిగింది. నాలుగు తులాల బరువుగల చైన్ తెంపుకుని దుండగులు ఉడాయించారు. అలాగే ఎంవీపీ కాలనీ సెక్టార్ – 8 సత్యసాయి బాబా పాఠశాల రోడ్డులో టి.సావిత్రి (51) నడుచుకుంటూ వెళ్తుండగా బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు 7 తులాల బంగారు చైను, నల్లపూసలు దండ తెంపుకుని పరారయ్యారు. ఈ రోడ్డులో నడిచి వెళ్తుండగా వెనుక నుంచి బైకుపై వచ్చిన దొంగలు మెడలోని ఆభరణాలు చోరీ చేసి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎంవీపీ స్టేషన్ క్రైం ఎస్ఐ సూరిబాబు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాకులకు ‘సుపరిచితులే’!
సాక్షి,సిటీబ్యూరో: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల్లో 11 నేరాలు చేసి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన సీరియల్ స్నాచర్లు మోను వాల్మికి, ఛోకపై అక్రమ ఆయుధాల కేసులు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారిలో ఒకరు పోలీసు కాల్పుల నుంచి తప్పించుకోగా, మరొకరు మూడు నెలల క్రితం తూటా తగిలి గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో వీరిని పట్టుకోవడానికి వెళ్లిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది. మరోపక్క గత నెలలో ‘సీరియల్ స్నాచింగ్స్’కు పథకం వేసిన ఈ గ్యాంగ్ మొత్తం ఆరుగురిని రంగంలోకి దింపినట్లు తేలింది. నొయిడా డెకాయ్ ఆపరేషన్‌లో ‘మోను’.. సీరియల్ స్నాచింగ్స్ కేసులో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన ముగ్గురిలో ఒకడు నగరానికి చెందిన సూత్రధారి చింతమల్ల ప్రణీత్ చౌదరి కాగా, మిగిలిన ఇద్దరూ ఉత్తరప్రదేశ్ వారే. వీరిలో ఒకడైన మోను వాల్మికీకి ‘రాహుల్, గుడువా’ అనే మారుపేర్లూ ఉన్నాయి. నొయిడాలోని శ్రోక ప్రాంతంలో నివసించే ఇతగాడు పందుల పెంపకం చేస్తుండేవాడు. ఆపై నేరబాట పట్టి నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) పరిధిలోకి వచ్చే ఢిల్లీ, నొయిడా, ఘజియాబాద్ తదితర చోట్ల 150 స్నాచింగ్స్, దోపిడీలకు పాల్పడ్డాడు. స్నాచర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి నొయిడా పోలీసులు 2016లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆ ఏడాది జూలై 11న అక్కడి న్యూ స్పైస్ మాల్ ప్రాంతంలో కానిస్టేబుల్ అనురాధను డెకాయ్ పార్టీగా రంగంలోకి దింపారు. సాధారణ మహిళలా ఉన్న అనురాధ తన మెడలో బంగారం గొలుసుతో అక్కడ నిలబడ్డారు. ఈమెను గమనించిన వాల్మీకి తన అనుచరుడు రాజేంద్ర గౌతమ్‌తో కలిసి బైక్‌పై వచ్చి ఆమె మెడలోని చైన్ లాక్కుపోవడానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించడంతో ఘర్షణకు దిగి తమ వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు ప్రారంభించారు. వెంటనే అక్కడకు చేరుకున్న సమీపంలోని పోలీసు బృందం గౌతమ్ కాళ్లపై కాల్చడంతో అతడితో పాటు వాల్మీకి సైతం లొంగిపోయాడు. మూడు నెలల క్రితం ఛోకపై.. హైదరాబాద్‌లో స్నాచింగ్స్‌కు వచ్చేప్పుడు కత్తితో తిరిగిన ఛోక స్వస్థలం యూపీలోని బులంద్ షహర్. దాదాపు 40కి పైగా స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడు మూడు నెలల క్రితం కాల్పులకు తెగబడ్డాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన ఇతడు మరో వ్యక్తితో కలిసి వరుస స్నాచింగ్స్ చేస్తుండడంతో బులంద్ షహర్ పోలీసులు అప్రతమత్తమయ్యారు. ఓ ప్రాంతంలో కాపుకాసి పట్టుకోవడానికి ప్రయత్నించగా తుపాకీతో పోలీసులపై కాల్పులు ప్రారంభించాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపగా కుడి కాలుల్లోంచి తూటా దూసుకెళ్లింది. దీనికి సంబంధించి పోలీసులు తమపై హత్యాయత్నానికి పాల్పడినట్లు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఈ గాయం మానకుండానే బెయిల్‌పై వచ్చి హైదరాబాద్‌లో పంజా విసరడానికి వాల్మీకితో వచ్చాడు. మరో నలుగురితో కలిసి రంగంలోకి.. ప్రణీత్ పథకం మేరకు హైదరాబాద్‌ను టార్గెట్ చేసుకున్న ఈ గ్యాంగ్ వరుసపెట్టి స్నాచింగ్స్ చేయాలని పథకం వేసింది. గత నెల 24న మరో నలుగురితో కలిసి వాల్మీకి, ఛోక హైదరాబాద్ చేరుకున్నారు. మిగిలిన వారు కాచిగూడలోని లాడ్జిలోనే ఉండగా.. ప్రణీత్, వాల్మీకి రెక్కీ చేసి వచ్చారు. తొలుత వాల్మీకి... ఛోకతో కలిసి వరుస స్నాచింగ్స్ చేసి నగరం వదిలి పారిపోవాలని పథకం వేశాడు. ఇది జరిగిన ఒకటిరెండు రోజుల తర్వాత మరో ఇద్దరు, ఆపై ఇంకో ఇద్దరు ఇలా వరుస స్నాచింగ్స్ చేయాలని వాల్మీకి సూచించాడు. దీని కోసమే సెకండ్ హ్యాండ్లో పల్సర్ వాహనం ఖరీదు చేశారు. అయితే, డిసెంబర్ 26, 27 తేదీల్లో వాల్మీకి, ఛోక చేసిన వరుస స్నాచింగ్స్ నగరంలో అలజడి సృష్టించాయి. దీంతో పోలీసులు అప్రమత్తం కావడం, మీడియాలో సీసీ కెమెరాల ఫుటేజ్ ప్రచారం చేయడంతో మిగిలిన వారు సిటీ నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. -
ఒకేరోజు నాలుగు చోట్ల చైన్‌స్నాచింగ్‌లు
-
వైరల్ : బరితెగించారు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో చైన్‌స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను బెదిరించి బంగారు ఆభరణాలను అపహరిస్తున్నారు. ఢిల్లీలోని దయాల్‌పుర్ ప్రాంతంలో ఓ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు.. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళ నుంచి బంగారు గొలుసును కాజేశారు. తన కొడుకుతో కలిసి రోడ్డుపై వెళ్తున్న ఆమెను బైక్ మీద వచ్చిన చైన్ స్నాచర్స్ ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కునే ప్రయత్నం చేశారు. మెడలో నుంచి గొలుసు రాకపోవడంతో బైక్ నుంచి కిందికి దిగి కత్తితో బెదిరించి లాక్కెళ్లారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. ఆ ఇద్దర్నీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి బంగారు నగలను కూడా స్వాధీనం చేసుకున్నారు. #WATCH Two bike-borne men rob a woman at knifepoint in Delhi's Dayalpur (Source CCTV footage). Both the culprits were apprehended by the police and the robbed gold chain was recovered from their possession. (26/10/18) pic.twitter.com/4mr5VIdAAy — ANI (@ANI) November 3, 2018 -
స్నాచింగ్‌ల కలకలం
ఎన్ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ)/విశాఖ క్రైం: నగరంలో చైన్‌స్నాచర్లు హడలెత్తించారు. గురువారం ఒక్క రోజే ఓ గంట వ్యవధిలోనే నాలుగు చోట్ల మహిళల మెడలోని బంగారు ఆభరణాలు తెంపుకుని ఉడాయించారు. బుచ్చిరాజుపాలెం సుసర్లకాలనీ, శాంతినగర్, మర్రిపాలెం ఉడా లే అవుట్, బాలయ్య శాస్త్రి లే అవుట్లో నలుగురు మహిళల మెడలోని 16తులాల బరువు గల చైన్లు లాక్కుని పారిపోయారు. ఒక బైక్‌పై ఇద్దరు యువకులు వచ్చి తెంపుకు పోయారని బాధితులంతా చెబుతుండడంతో... ఈ చోరీలన్నీ ఆ ఇద్దరే చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల చిత్రాలు విడుదల చేశారు. ప్రస్తుతం వారి కోసం గాలిస్తున్నారు. చైన్స్నాచర్లకు భయపడి బయటకు రావాలంటేనే మహిళలు బెంబేలెత్తిపోతున్నారు. చైన్‌స్నాచింగ్‌లు జరిగా యని తెలుసుకున్న ఎయిర్పోర్ట్ నేర విభాగ పోలీసులు ఘట నా స్థలాలకు చేరుకుని వివరాలు సేకరించారు. సీఐ సాయి, ఎస్ఐలు కుమార్, మన్మథరావు, ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మళ్ల శేషు, ఎస్ఐలు నర్శింగరావు, సురేష్, నాగేశ్వరరావు, జీడీ బాబు వివరాలు సేకరించారు. మహిళలు అప్రమత్తంగా ఉండాలి నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు వస్తువులను దుండగులు తెంపుకుపోయిన నేపథ్యంలో మహిళలంతా అప్రమత్తంగా ఉండాలని నగర ఇన్చార్జి పోలీస్ కమిషనర్ దాడి నాగేంద్రకుమార గురువారం ఒక ప్రకటనలో సూచించారు. ద్విచక్ర వాహనంపై నీలం రంగు, నలుపు రంగు షర్టులు, జీన్ ఫ్యాంట్లు వేసుకుని, తలకు హెల్మెట్లు ధరించిన ఇద్దరు వ్యక్తులు వివిధ ప్రాంతాల్లో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. అనుమానితులు కనిపిస్తే డయల్ 100, 1090 నంబర్‌కు, 9490624787, 0891–2565454, 0891 2704465 నంబర్లకు సమాచారమివ్వాలని కోరారు. వివరాలు తెలిపిన వారికి తగిన పారితోషకం ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సమయం గురువారం ఉదయం 7:45 గంటలు ఎన్ఏడీ కూడలి బుచ్చిరాజుపాలెం సుసర్ల కాలనీ 80 అడుగుల రహదారి ప్రశాంతంగా ఉంది. అదే రహదారిలోని మైత్రి అపార్టుమెంట్లో నివాసముంటున్న మంగయ్యమ్మ(60) పాల ప్యాకెట్ల కోసం రోడ్డుపైకి వచ్చింది. సమీపంలోని దుకాణంలో ప్యాకెట్లు తీసుకుని తిరిగి ఇంటిముఖం పట్టిన ఆమెను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు అనుసరించారు. ఆమె వారిని చూసేలోపే ఒక్కసారిగా మెడలోని పుస్తెల తాడు తెంపుకుని ఉడాయించారు. వెంటనే తేరుకున్న బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. చోరీకి గురైన తాడు విలువ రెండు తులాలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది సమయం గురువారం ఉదయం 8:10 గంటలు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్‌లో నివాసముంటున్న నిర్మలా కుమారి నారాయణ పాఠశాలలో తెలుగు టీచర్‌గా పని చేస్తోంది. ఎప్పటిలాగే పాఠశాలకు గురువారం ఉదయం ఆమె బయలుదేరింది. మరికొద్ది సేపటిలో స్కూల్‌కు చేరుకుంటుందనగా... ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలోని రెండు తులాల తాడు తెంపుకుని పారిపోయారు. ఆ సమయంలో దొంగా... దొంగా... అని అరిచినా ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇద్దరు యువకులు బైక్ ఉన్నారని తెలిపింది. జరిగిన ఘటనపై నిర్మలా కుమారి పోలీసులను ఆశ్రయించింది. సమయం గురువారం ఉదయం 8:15 గంటలు మర్రపాలెం ఉడా లే అవుట్లో నివాసముంటున్న హేమలత తన పిల్లలను స్కూల్లో దించేందుకు స్కూటీపై బయలుదేరింది. ఇంటి నుంచి ఉడా లే అవుట్ పార్క్ సమీపానికి వచ్చేసరికి... వెనుక నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని పుస్తెలతాడు, నల్లపూసలు దండ, చైన్ తెంచకుని పారిపోయారు. ఈ హఠాత్ పరిణామంతో హేమ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. రోడ్డుపైకి రాగానే ఇద్దరు వ్యక్తులు తనను కొంతదూరం అనుసరించారని, ఇలా చైన్‌స్నాచింగ్‌కు పాల్పడతారని తాను ఊహించలేదని ఆమె వాపోయింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమయం గురువారం ఉదయం 8:30 గంటలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలయ్య శాస్త్రి లే అవుట్‌లోని రాధాకృష్ణ లే అవుట్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వై.వెంకటలక్ష్మి(58) గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి పాలు కోసం దుకాణానికి బయలుదేరింది. ఆమె రోడ్డుపైకి వచ్చిన కొద్ది సేపటికే ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి మెడలోని పుస్తెలతాడుతోపాటు మరో చైన్ తెంపుకుపోయారు. దీంతో లబోదిబోమంటూ వెంకటలక్ష్మి నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు క్రైం ఎస్ఐ వెంకటరావు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చైన్ స్నాచర్లున్నారు జాగ్రత్త
స్వప్న వారం కిందటే ఖరీదైన నెక్లెస్ కొనుక్కుంది. దానిని ధరించి ముస్తాబై స్నేహితురాలికి చూపిద్దామని స్కూటీపై బయల్దేరింది. కొంతదూరం వెళ్లగానే ఇద్దరు యువకులు బైక్‌పై వేగంగా వచ్చి గొలుసును లాక్కెళ్లారు. ఈ సంఘటనతో స్వప్న తీవ్ర షాక్‌కు గురైంది. పగలూ రాత్రి అదే చేదు ఘటన గుర్తుకొచ్చేది. తేరుకోవడానికి నెలరోజులు పైగా పట్టింది. నగరంలో పోలీసులు ఎంత గస్తీ తిరుగుతున్నా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బనశంకరి: సిలికాన్ సిటీలో రోజురోజుకు చైన్‌స్నాచర్లు పెట్రేగిపోతున్నారు. పోలీసులు ఇరానీగ్యాంగ్లను కష్టపడి అరెస్ట్ చేస్తున్నప్పటికీ గొలుసు చోరీలు ఆగడం లేదు. కొత్త కొత్త గ్యాంగ్‌లు రంగంలోకి దిగుతుండడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. సోమ, మంగళవారాల్లో రెండురోజుల్లో నగరంలో ఏడుచోట్ల దుండగులు చైన్‌స్నాచింగ్‌లకు తెగబడ్డారు. జ్ఞానభారతి, జ్ఞానజ్యోతి నగర, హనుమంతనగర, కొడిగేహళ్లి, తిలక్‌నగర, జేపీ.నగర, జీవన బీమానగర, న్యూ తిప్పసంద్రలో మహిళల గొలుసులు దొంగల పాలయ్యాయి. జీవనబీమానగర నివాసి 48 గ్రాముల బంగారుచైన్, కాడుగోడిలో 30 గ్రాముల చైన్ లాక్కెళ్లారు. బ్లాక్ బైక్‌పై హల్చల్ బ్లాక్ హెల్మెట్, బ్లాక్ లెదర్ జాకెట్ దరించిన దుండగులు నలుపురంగు పల్సర్ బైకులో సంచరిస్తూ నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. అడ్రస్ అడిగే నెపంతో మహిళలతో మాటలు కలిపి మెడల్లో బంగారుచైన్ లాక్కెళుతున్నారు. అంతేగాక వాకింగ్ ముగించుకుని ఇంటికి వెనుతిరుగుతున్న మహిళల మెడల్లో మాంగల్యం చైన్, బంగారుగొలుసులు అఫహరిస్తున్నారు. వెంటనే ఫిర్యాదు చేయండి బెంగళూరునగరంలో జనవరి నుంచి జూన్ వరకు 138 చైన్ స్నాచింగ్ కేసులు నమోదుకాగా రాష్ట్రవ్యాప్తంగా 347 జరిగాయి. చైన్‌స్నాచింగ్‌కు ఎవరైనా పాల్పడిన వెంటనే ఏ వాహనంలో పారిపోయారు, వీలైతే నంబర్‌ను జ్ఞాపకం ఉంచుకోవాలి. ఘటనపై వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ 100 ఫోన్ చేస్తే దొంగలు త్వరగా దొరికే అవకాశం ఉంది. ఇక చోరీ జరిగితే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. ఎప్పుడైనా దొంగసొత్తు స్వాధీనమైతే తిరిగి దక్కే చాన్సుంది. కనీస జాగ్రత్తలు పాటించడం మేలు ♦ మహిళలు బయటకు వచ్చినప్పడు జాగ్రత్తగా ఉండాలి. చుట్టుపక్కల ఎవరున్నారు అనేది గమనిస్తుండాలి. అపరిచితులు కనిపిస్తే అప్రమత్తం కావాలి. ♦ ఆభరణాలు ధరించినట్లయితే బయటకు కనిపించకుండా చీర కొంగు, స్కార్ఫ్‌తో కప్పుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ♦ నిర్జన ప్రదేశాల వైపు వెళ్లకుండా జనసమ్మర్ధం ఉండే ప్రాంతాల్లోనేసంచరించడం ఉత్తమం. ♦ వాకింగ్‌కు వెళ్లే మహిళలు రోడ్లపైకి వెళ్లకుండా ఉద్యానవనాల్లోనే వాకింగ్ చేయాలి. ♦ యువకులు, పురుషులు అడ్రస్ అడిగే నెపంతో మాట్లాడాలని ప్రయత్నిస్తే దూరంగా ఉండి మాట్లాడడం, లేదా తెలియదని చెప్పేయాలి. -
మియాపూర్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
ఇద్దరు చైన్ స్నాచర్లకు దేహశుద్ధి..!
ఇద్దరు చైన్ స్నాచర్లు ఒకేరోజు ఇద్దరు మహిళల మెడల్లోంచి రెండు బంగారు గొలుసులను చోరీ చేశారు. వర్ని మండలం మోస్రాలో ఒకటి, నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోని బంగారు గొలుసులను చోరీ చేశారు. చివరకు ఎడపల్లి మండలం ఠాణాకలాన్ వద్ద గ్రామస్తులు వారిని పట్టుకుని దేహశుద్ధి చేశాక పోలీసులకు అప్పగించారు. ఎడపల్లి(బోధన్): మండలంలోని ఠాణాకలాన్‌వాసులు మంగళవారం ఇద్దరు చైన్స్నాచర్లను పట్టుకొని దేహశుద్ధి చేశారు. వర్ని మండలం మెస్రాలో రోడ్డుపై వెళుతున్న మహిళతోపాటు నిజామాబాద్ రూరల్ మండలం లింగితండా వద్ద మరో మహిళ మెడలోంచి రెండు చైన్లను తెంపుకుని కుర్నాపల్లి మీదుగా ఠాణాకలాన్ వైపు బైక్‌పై పారిపోతున్న వారిని గ్రామస్తులు పట్టుకున్నారు. మోస్రా, కుర్నాపల్లి గ్రామస్తులు ఫోన్లో పారిపోతున్న చైన్‌స్నాచర్ల వివరాలను ఠాణాకలాన్వాసులకు తెలిపారు. దీంతో గ్రామస్తులు చైన్స్నాచర్లను సాహసించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితులతో ఎస్ఐ టాటాబాబు మాట్లాడి వర్ని పోలీసులకు చైన్స్నాచర్లను అప్పగించారు. సాహసంతో పట్టుకున్న ఠాణాకలాన్వాసులను పోలీసులు అభినందించారు. వర్ని(బాన్సువాడ): మండలంలోని మోస్రాలో బస్టాండ్ వద్ద నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును మంగళవారం దుండగులు ఎత్తుకెళ్లినట్టు స్థానికులు తెలిపారు. నిర్మల్ జిల్లాకు చెందిన మహిళ మోస్రాలోని బంధువుల ఇంటికి వచ్చి తిరుగు ప్రయాణంలో బస్టాండ్ వద్దకు రాగానే ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి మెడలోని గొలుసు తెంపుకుని పరారయ్యారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు వారిని వెంబడించారు. విషయం తెల్సుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
కేపీహెచ్బీలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
-
సీఎం సభలో దొంగల చేతివాటం
సంగెం: సీఎం సభలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సీఎం సభ వేదికపై వచ్చిన సందర్భంలో కళాకారుల వేదికపైకి ఒక్కసారిగా మహిళలు, పురుషులు ఎక్కి సీఎం కేసీఆర్‌ను చూడడానికి ఎగబడ్డారు. ఇదే అదనుగా భావించిన దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఆత్మకూర్ మండలం రాఘవాపూరానికి చెందిన మడిపెల్లి అరుణ అనే మహిళ మెడలోని మూడు తులాల పుస్తెలతాడు తెంపుకునిపోయాడు. తన మెడలోంచి పుస్తెల తాడు తెంపుకున్నట్లు గ్రహించిన మహిళ లబోది బోమని రోదిస్తు అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీ సుల కాళ్లావేళ్లపడింది. అలాగే అక్కడ కొందరి పర్సులు, సెల్పోన్లు కొట్టేసినట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇద్దరు చైన్స్నాచర్లకు జైలు
ఇరగవరం: చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరికి 10 నెలలు జైలు శిక్ష విధించినట్టు ఇరగవరం ఎస్సై జి.శ్రీనివాస్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని ఏలేటిపాడులో రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును తూర్పుగోదావరి జిల్లా చిన కాపవరానికి చెందిన వానపల్లి అ య్యప్ప, జిల్లాలోని కడియద్దకు చెందిన పొట్లకర్ల స్వామి లా క్కుపోయారు. ఈ కేసులో నిందితులిద్దరికీ న్యాయమూర్తి జి. వీణ 10 నెలల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
చైన్ స్నాచర్ల హల్చల్, అరెస్టు
నూజివీడు: కృష్ణా జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నూజివీడు పట్టణంలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు సమాచారం. -
మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు..
-
మళ్లీ రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు.
-
మళ్లీ రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
హైదరాబాద్ : నగరంలో చైన్‌స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. బీఎన్‌రెడ్డి నగర్లో బుధవారం శాంతమ్మ అనే మహిళ మెడలోని గొలుసును తెంపుకుని వ్యక్తి.. సమీపంలో బైక్‌పై ఆగి ఉన్న వ్యక్తితో కలసి పరారైయ్యాడు. దీంతో తెరుకున్న శాంతమ్మ బిగ్గరగా కేకలు వేసింది. దాంతో స్థానికులు వారిని వెంబడించిన... ఫలితం లేకపోయింది. బాధితురాలు వెంటనే వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. -
ఐదుగురు చెయిన్ స్నాచర్ల అరెస్టు
రూ.4 లక్షల విలువైన బంగారం స్వాధీనం మంగళగిరి: వివిధ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఐదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు రూ.4 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ జి.రామాంజనేయులు తెలిపారు. పట్టణంలోని నార్త్ సబ్ డివిజన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను ప్రవేశపెట్టారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన మచ్చా రవీంద్రరెడ్డి, మంగళగిరి పాత కరెంట్ ఆఫీసు సెంటర్లో నివాసముంటున్న తోట సాయి, కోనేరు వీధికి చెందిన ఒంటిపులి సుధాకర్, పిడుగురాళ్ళ కుమ్మరిపాలెంకు చెందిన సులగా వెంకటేశ్వర్లు, నవులూరుకి చెందిన మైనేని సాయి.. చెడు వ్యసనాలకు బానిసలై చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. విజయవాడ ఆటోనగర్ ఏరియాలో రెండు, పెదకాకానిలో ఒకటి, తాడికొండ లాం వద్ద ఒకటి, మంగళగిరిలో మూడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు నిందితులు అంగీకరించారు. ద్విచక్రవాహనాలపై తిరుగుతూ ఒంటరి మహిళలు, వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకునిబంగారు గొలుసులు లాక్కుని పరారవుతుంటారు. పట్టణంలోని జాతీయ రహదారి వద్ద బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు అందిన సమాచారంతో పట్టణ సీఐ బొప్పన బ్రహ్మయ్య, తన సిబ్బందితో కలిసి ఐదుగురు నిందితులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.4 లక్షలు విలువచేసే 17 సవర్ల బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు అందజేస్తామని డీఎస్పీ రామాంజనేయులు తెలిపారు. -
జల్సాలకు పోయి.. కటకటాల పాలై...
మల్యాలలో గొలుసుదొంగల ముఠా అరెస్టు ముగ్గురి రిమాండ్.. నాలుగున్నర తులాల గొలుసులు స్వాధీనం సిద్దిపేట జోన్: జల్సాలకు అలవాటుపడ్డ కొందరు.. దొంగతనాలకు పాల్పడి కటకటాల పాలయ్యారు. ఈ ముఠాలో ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి నాలుగున్నర తులాల గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జి డీఎస్పీ షేక్‌లాల్ అహ్మద్ వెల్లడించిన వివరాలు ఇలా... సిరిసిల్ల మండలం తంగళ్లపల్లి శివారులోని టెక్స్టైల్ పార్కు (ఇందిరా కాలనీ)కు చెందిన వేముల శాంతారాం (25) మామిడాల గణేశ్(23), కొంచెం అశోక్ (22)తోపాటు కస్తూరి ప్రశాంత్ (17)లు ముఠాగా ఏర్పడ్డారు. జల్సాలు చేసేందుకు డబ్బుల కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. సెప్టెంబర్ 7న బెజ్జంకి మండలం దాచారం చౌరస్తాలో ఓ మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు గొలుసును చోరీ చేశారు. ఆగస్టు 30న సిరిసిల్ల మండలం జిల్లెల్ల శివారులో మరో మహిళ మెడలో నుంచి 2 తులాల బంగారాన్ని ఈ మూఠా దొంగిలించింది. మరోవైపు చిన్నకోడూరు మండలం గుర్రాలగొంది శివారులో జూన్ 22న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును తస్కరించారు. ఈనెల 18న జక్కాపూర్ శివారులో ఒంటరిగా ఉన్న మహిళ మెడలో నుంచి గొలుసు దొంగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం చిన్నకోడూరు ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో పోలీస్‌లు మల్యాల చౌరస్తా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో రెండు ద్విచక్ర వాహనాలపై శాంతారాం, గణేశ్, అశోక్, ప్రశాంత్‌లు పోలీసులకు అనుమానాస్పదంగా కన్పిపించారు. వారిని అదుపులోకి తీసుకోని విచారించగా గొలుసు దొంగతనాలకు పాల్పడిన వివరాలను వెల్లడించారు. వారి వద్ద నుంచి నాలుగున్నర తులాల బంగారం, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకొని శాంతారాం, గణేశ్, అశోక్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే సంఘటనలో మైనర్ బాలుడు ప్రశాంత్‌ను సంగారెడ్డిలోని జువైనల్ హోంకు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ సైదులు, ఎస్ఐ అశోక్ పాల్గొన్నారు. -
ముగ్గురు చైన్ స్నాచర్లు అరెస్ట్
మెదక్: చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 5 తులాల బంగారు ఆభరణాలతో పాటు రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. సిరిసిల్ల టెక్స్టైల్స్ పార్క్‌కు చెందిన శాంతారాం, అశోక్, గణేష్ ముగ్గురు జల్సాలకు అలవాటుపడి... వారు చోరీల బాట పట్టారు. ఆ క్రమంలో బెజ్జంకి, చిన్నకొండూరు, సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. అందులోభాగంగా బుధవారం వారిని సిద్దిపేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సిద్దిపేట డీఎస్పీ విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
జల్సాలకు మరిగి..
కడప అర్బన్: ఇద్దరు చైన్‌స్నాచర్స్‌ను, వారికి సహకరించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 5.60 లక్షల విలువైన 175 గ్రాముల బరువున్న 8 బంగారు చైన్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడప డీఎస్పీ ఈజీ అశోక్ కుమార్ శుక్రవారం తమ కార్యాయలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన తెలిపిన మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడపలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన ఇద్దరు నిందితులను కడప అర్బన్ సీఐ యు.సదాశివయ్య, తాలూకా ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వరరెడ్డి తమ సిబ్బందితో కలిసి మరియాపురం చర్చి సర్కిల్లో ఈ నెల 15న వాహనాల తనిఖీల సమయంలో అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో కడప బ్రాహ్మణ వీధిలోని డివి రావు వీధిలో నివసిస్తున్న సత్య సుబ్రమణ్యం కుమారుడు కుప్పంరెడ్డి శేఖర్ (19) ఓ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మరో నిందితుడు రెండవ గాంధీ బొమ్మ దగ్గర మఠం వీధిలో నివసిస్తున్న ఖాదర్ బాషా కుమారుడు గగ్గుటూరు వాహిద్ (19) కడప నగర శివార్లలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వీరు కడపలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిల్లో 8 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి స్నేహితులుగా తిరుగుతూ మద్యం సేవించడం, జూదం లాంటి చెడు వ్యసనాలకు బానిసయ్యారు. రెడ్డిశేఖర్ తన మోటార్ సైకిల్ (ఏపి04 బిఎ 3641)పై కడపలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. వారు మైదుకూరు వైపు నుంచి వస్తూ పోలీసులను గమనించి మోటార్ సైకిల్‌పై పరారవుతుండగా అరెస్ట్ చేశారు. 8 బంగారు చైన్లను చోరీ చేశామని వారు ఒప్పుకోవడంతో రికవరీ చేశారు. వాహిద్ తల్లి చాందిని తన కుమారుడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతూ ఉంటే వారించడం బోయి, ప్రోత్సహించింది. వారు దొంగలించిన బంగారు చైన్లను ఆమె ద్వారానే విక్రయించడం, వచ్చిన డబ్బులను పంచుకోవడం జరుగుతుండేదని విచారణలో తేలింది. దీంతో ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసును ఛేదించడానికి కృషి చేసిన అర్బన్ సీఐ సదాశివయ్య, తాలూకా ఎస్ఐ రాజ రాజేశ్వర్ రెడ్డితోపాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
చైన్ స్నాచింగ్ తప్పించుకుందని.. తుపాకితో కాల్చారు
చైన్ స్నాచర్లు వెంట పడినప్పుడు ఏం చేయాలి.. వీలైతే తప్పించుకోవాలి, లేకపోతే వాళ్లకు మన ఆభరణాలు సమర్పించుకోవాలి. అంతేతప్ప ఎదిరిస్తే ప్రాణాలకే ప్రమాదం. దేశ రాజధానిలో తల్లీకొడుకులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఢిల్లీలోని ఖజూరీ ఖాస్ ప్రాంతంలో ఓ బస్టాపు వద్ద ఈ ఘటన జరిగింది. ఓ మహిల తన ఆరేళ్ల కొడుకును స్కూలు నుంచి ఇంటికి తీసుకెళ్తూ బస్టాపు వద్ద వేచి ఉన్నారు. అంతలో ఇద్దరు యువకులు బైకు మీద వచ్చి, ఆమెను ఏదో అడ్రస్ అడిగారు. ఆమె వాళ్లకు ఆ అడ్రస్ చెప్పేలోగా వాళ్లలో ఒకడు ఆమె మెడలోని బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె ఆ యువకుడి చొక్కా పట్టుకుంది. అతడు వెంటనే జేబులోంచి పిస్టల్ తీసి.. ఆమెవైపు కాల్చాడు. అదృష్టవశాత్తు ఆమె బుల్లెట్ తగలకుండా తప్పించుకుంది. అంతలోనే తుపాకి పేలిన శబ్దం విని అక్కడకు చుట్టుపక్కలవాళ్లు వచ్చి ఏం జరిగిందని గట్టిగా అడగడంతో.. ఆ యువకులు ఇద్దరూ గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో తీవ్రంగా షాకైన సదరు మహిళను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజిని పరిశీలిస్తున్నామని, వాళ్లు ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగు సభ్యులు అయి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. వాళ్లపై దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదుచేశారు. -
గొలుసు దొంగల హల్చల్
నెల్లూరు (క్రైమ్) : నగరంలో గొలుసు దొంగలు హల్చల్ చేశారు. వేర్వేరు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. కొండాయపాళెం గంగ్రోతినగర్లో మురళీకృష్ణ బుధవారం రాత్రి తన కుమార్తె నాగశ్రీవిద్యతో కలిసి నగరానికి వెళ్లాడు. తిరిగి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా మినీబైపాస్‌రోడ్డులో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వారిని వెంబడించారు. నాగశ్రీవిద్య మెడలోని నాలుగు సవర్ల బంగారు దండను లాకెళ్లారు. దీంతో ఆమె కిందపడి గాయాలపాలైంది. చోరీ ఘటనపై బాధిత తండ్రి ఐదోనగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మోడరన్ స్కూల్ సమీపంలో.. కుమార్తెకు భోజనం పెట్టి ఇంటికి వస్తుండగా ఓ మహిళ మెడలోని బంగారు సరుడును దుండగులు లాక్కెళ్లారు. ఈసంఘటన సరస్వతీనగర్‌లోని మోడరన్ స్కూల్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. ఎన్టీఆర్నగర్ సరస్వతీనగర్‌లో టి. రమణారెడ్డి, దొరసానమ్మ దంపతులు నివసిస్తున్నారు. వారి కుమార్తె మోడరన్ స్కూల్లో చదువుతోంది. గురువారం మధ్యాహ్నం దొరసానమ్మ ఆమె కుమార్తెకు భోజనం పెట్టి ఇంటికి నడుచుకుంటూ బయలుదేరింది. ఈ క్రమంలో గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఆమెను బైక్‌పై వెంబడించి మెడలోని మూడు సవర్ల బంగారు సరుడును లాక్కెళ్లారు. బాధితురాలు బాలాజీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'దొంగ'భక్తులు వస్తున్నారు..
పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల హడావుడి అంతా ఇంతా కాదు. భక్తులు, వ్యాపారులు, పూజారులు, అధికారులు ఇలా అన్ని వర్గాల వారూ పుష్కరాల్లో ఊపిరిసలపనంత బిజీ అవుతారు. వీరే కాదు.. ఇంకో బ్యాచ్ కూడా చాలా బిజీగా ఉంటుంది పుష్కరాల సీజన్లో. అదే దొంగల బ్యాచ్. వీరికి కూడా పుష్కరాల్లో చేతి నిండా పనే. వీరి కళ్లన్నీ జనం జేబుల్లోని పర్సులు, నగదు, మహిళల మెడపై ఉండే బంగారు ఆభరణాల చుట్టూనే తిరుగుతుంటాయి. సందట్లో సడేమియా అన్నట్టు దొరికినంత దోచుకునేందుకు వీరు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గుంటూరు : విజయవాడ, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగల బ్యాచ్ స్థావరాలకు పెట్టింది పేరు. దీన్ని ఆసరాగా చేసుకుని అంతర్రాష్ట్ర దొంగలు 12 రోజులపాటు జరిగే పుష్కరాల పని కోసం స్థావరాలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో తమతో సత్సంబంధాలు ఉండేవారి ద్వారా తమకు ఆశ్రయం కల్పించే వారి తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తమకు షెల్టర్ ఇచ్చినవారికి అద్దె రూపంలో డబ్బు చెల్లించేలా కాదండోయ్.. వారు కాజేసిన సొమ్ములో కొంత వాటా ఇచ్చేలా అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. మొత్తానికి ఈ విషయం ఆనోటా, ఈనోటా పోలీసు బాస్‌ల చెవికి చేరింది. వీరిని ఎలా అరికట్టాలనే దానిపై వారు ప్రణాళికలు రచించే పనిలో పడ్డారు. షెల్టర్లు సిద్ధం! ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు మొదలు కానున్న విషయం తెలిసిందే. దీని కోసం వ్యాపారులు, పూజారులు, అధికారులు ఏవిధంగా అయితే ఏర్పాట్లు చేసుకుంటున్నారో దొంగలు సైతం ఈ 12 రోజుల్లో తమ చేతివాటం చూపేందుకు కావాల్సిన ఏర్పాట్లన్ని ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు సమాచారం. గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం సీతానగరం, మహానాడు, సుందరయ్యనగర్, కేఎల్‌రావు కాలనీతో పాటు, విజయవాడలోని కేదారేశ్వరపేట, రాజారాజేశ్వరిపేట, కొండపల్లి, నందిగామలతో పాటు, మరికొన్ని ప్రాంతాల్లో ఉండే దొంగల బ్యాచ్ ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చే దొంగల ముఠాకు షెల్టర్ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా కొప్పరాల తిప్ప, నెల్లూరు జిల్లా పిట్రగుంట, తమిళనాడులోని కాంచీపురం, చిత్తూరు జిల్లాలోని ఓ గ్రామంతో పాటు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన అనేక గ్రామాల నుంచి దొంగల ముఠాలు పుష్కరాల్లో తమ ‘పనితనం’ చూపించేం దుకు సిద్ధమైనట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా ప్రాంతాల్లోని తమ పాతమిత్రుల ద్వారా స్థానిక దొంగలను ఆశ్రయించి స్థావరాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. 12 రోజుల పాటు ఇక్కడే ఉండేందుకు వసతి సౌకర్యంతో పాటు, భోజన సదుపాయాలు సైతం అందించేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అందుకు ప్రతిగా వారు దోచుకున్న సొత్తులో కొంత వాటాను వీరికి పంచేలా, వీరి మధ్య సయోధ్య కుదిరినట్లు చెబుతున్నారు. ఇప్పటికే తాడేపల్లి మండలం పట్టాభిరామయ్య కాలనీలోని ఓ హిజ్రా ఇంట్లో బయటి నుంచి వచ్చే దొంగలకు షెల్టర్ కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు సమాచారం. పుష్కరాల ప్రాంతంలో నిరంతర నిఘా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో నిరంతర నిఘా ఉంచాం. గత పుష్కరాల సంఘటనలను దృష్టిలో ఉంచుకుని అప్రమత్తతతో వ్యవహరించేలా పోలీసు సిబ్బందికి సూచనలు చేశాం. కృష్ణా పుష్కరాల్లో ఎటువంటి సంఘటనలూ జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. - సర్వశ్రేష్ఠ త్రిపాఠి, గుంటూరు అర్బన్ ఎస్పీ అసలే ముదుర్లు.. వీరికి ఇతరులూ తోడు.. గత కృష్ణా పుష్కరాల్లో సైతం ఈ ప్రాంతంలో దొంగలు తమ చేతికి పనిచెప్పి పుష్కరాలకు వచ్చే భక్తుల సొమ్మును భారీ ఎత్తున దోచుకున్నట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. దీనికి తోడు తాడేపల్లి మండలంలోని అనేక ప్రాంతాలకు చెందిన దొంగలు రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాలతో పాటు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో సైతం దొంగతనాలు చేసిన సంఘటనలు అందరికీ తెలిసిందే. గత ఏడాది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఓ యోగ సెంటర్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు చెందిన డబ్బు, నగలు, సెల్ఫోన్లను తాడేపల్లి దొంగలు ఎత్తుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అంతా అత్యున్నత స్థాయి అధికారులు కావడంతో దొంగలను పట్టి సొత్తు రికవరీ చేసిన పోలీసులు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వదిలేసిన సంగతి తెలిసిందే. ఈ స్థాయిలో దొంగతనాలకు పాల్పడే దొంగలకు, బయట నుంచి వచ్చే ముఠాలు తోడైతే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో ఊహించటం కష్టమే. పుష్కర ఏర్పాట్లు, ట్రాఫిక్‌పై దృష్టి పెడుతున్న పోలీసులు వీరిపై ఇప్పటినుంచే పూర్తిస్థాయి నిఘా ఉంచకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందనేది అందరూ ఒప్పుకోవాల్సిందే. -
విజయవాడలో రెచ్చిపోయిన స్నాచర్లు
-
చైన్‌స్నాచర్లు దొరికారు
అందరూ బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన వారే పథకం ప్రకారం రోజూ దొంగతనం విచారిస్తున్న పోలీసులు కొంత కాలంగా పోలీసులకు సవాల్‌గా మారిన చైన్‌స్నాచర్లు దొరికిపోయారు. ముఠా నాయకుడైన ఆ యువకుడికి నిండా22 ఏళ్లు. రెండు పదులు కూడా దాటని యువకులను కలుపుకున్నాడు. సవక చెట్ల నడుమ మద్యం తాగుతూ పథకం రచించాడు. రోజుకో చోట దొంగతనాలు చేశాడు. మూడో కంటికి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు. చివరకు ఓ మహిళ చెప్పిన ఆధారాలతో పోలీసులు వీరి గుట్టును రట్టు చేశారు. బుచ్చిరెడ్డిపాళెం : ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేసి వారి మెడల్లో చైన్లు అపహరించారు. పోలీసులకు దొరకకుండా సవాల్‌గా మారారు. ఓ మహిళ ఇచ్చిన ఆచూకీతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. విశ్వసనీయంగా సేకరించిన సమాచారం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం పెద్దూరుకు ప్రశాంత్ (22) ఆటో నడుపుకుని జీవనం సాగించేవాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డాడు. 35 ఏళ్లతో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ 30 ఏళ్ల యువతిని వివాహం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆటో నడపడంతో తనకు జరుగుబాటు కాలేదు. దీంతో చిల్లర దొంగతనాలకు అలవాటు పడ్డాడు. నాలుగేళ్ల క్రితం బుచ్చిరెడ్డిపాళెం చెన్నూరు రోడ్డులో ఓ మహిళ చైన్ లాగిన విషయంలో మహిళ అక్కడే చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఏడు నెలలుగా.. చైన్‌స్నాచింగ్‌లకు అలవాటు పడిన ప్రశాంత్ తన ప్రవృత్తిని తన స్వగ్రామంలోనే కొనసాగించాడు. తనతో పాటు అన్నను, మంగళకట్ట, పెద్దూరుకు చెందిన బద్రీ, జయప్రకాష్తో పాటు మరికొందరిని కలుపుకున్నారు. మొత్తం ఏడుగురితో బ్యాచ్‌ను తయారు చేశాడు. బద్రీ బేల్దారి పనికి వెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచేవాడు. జయప్రకాష్ డీఎల్ఎన్ఆర్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఖాళీ సమయంలో వీరు ఆటో నడిపేవాళ్లు. వీరిని కలుపుకుని ప్రశాంత్ ఏడు నెలలుగా చైన్‌స్నాచింగ్‌లు చేయడం ప్రారంభించాడు. అంతా పథకం ప్రకారమే.. ప్రశాంత్ తన బృందాన్ని తీసుకుని జొన్నవాడ శివారు ప్రాంతాల్లోకి వెళ్లి కూర్చుని దొంగతనాల వ్యూహాలను రచించేవాడు. అక్కడే మద్యం తాగుతూ, బిరియానిలు తింటూ పన్నాగం పన్నేవారు. దాని ప్రకారమే దొంగతనాలు చేసేవారు. ప్రశాంత్ తనతో ఉంటే బృందాన్ని బ్యాచ్‌లుగా విభజించాడు. ఇద్దరు చొప్పున రెండు దొంగతనాలు వేర్వేరు చోట్ల చేసేలా వారికి చెప్పేవాడు. వారు దాని ప్రకారం దొంగతనం చేసి సదరు బంగారాన్ని ప్రశాంత్‌కు ఇచ్చేవాడు. కుటుంబ సభ్యుల ఖాతాల్లో నగదు ప్రశాంత్ బంగారం అమ్మిన నగదును తన బృందంలోని సభ్యుల కుటుంబ సభ్యుల ఖాతాల్లో వేసేవాడు. జయప్రకాష్ తల్లి ఖాతాలో ఒకటిన్నర లక్ష ఉన్నట్లు సమాచారం. మిగతా ఖాతాల్లోను నగదు ఉంచాడు. ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేవాడు. ఆటోను వదిలి... ఇన్నోవా.. ప్రశాంత్ చైన్‌స్నాచింగ్‌లు బుచ్చిరెడ్డిపాళెంలో చేసే ముందు తన ఆటోను అమ్మేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా జొన్నవాడకు చెందిన ఓ ఆటోను బాడుగకు తీసుకుని నడుపుకుంటున్నాడు. తన ఆటో ఉంటే ఆ నంబర్ల ఆధారంగా తనను పట్టుకుంటారేమోనని జాగ్రత్త పడ్డాడు. బాడుగకు తీసుకున్న ఆటోతో తన సభ్యులను ఉంచి దొంగతనాలు చేశాడు. అయితే దొంగతనాలతో వచ్చిన డబ్బులతో ఏకంగా ఇన్నోవాను కొనేందుకు ప్రశాంత్ సిద్ధమయ్యాడు. తన స్నేహితులతోనే ఇన్నోవాను కొంటున్నానని తెలిపాడు. బయటపడిందిలా... దగదర్తి మండలం యలమంచిపాడుకు చెందిన పాపమ్మ అనే మహిళ ఒంటరిగా రావడాన్ని ప్రశాంత్, బద్రీ, జయప్రకాష్ గమనించారు. తెలివిగా వారిలో ఒకరు వెళ్లి రాజ్‌కిషోర్ థియేటర్ సమీపంలో నడిచి వస్తున్న ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. ఒకరు వాహనం నడుపుతుండగా మరో ఇద్దరు ఆమె పక్కన కూర్చున్నారు. శ్రీహరికోట సమీపంలో రాగానే ఆటోలో కూర్చున్న వ్యక్తులు చైన్ లాగేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయగా ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌గా ఉన్న ప్రశాంత్ బృంద సభ్యుడిని పోలీసులు విచారించగా మొత్తం వివరాలు బయటపడుతున్నాయి. పోలీసులు ఇంకా దర్యాప్తు జరుపుతున్నారు. -
కరీంనగర్లో చైన్‌స్నాచింగ్
కరీంనగర్: ఆటోలో వెళ్తున్న మహిళ పుస్తెలతాడును ఆగంతకులు తెంపుకుని పోయారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ఎల్లారెడ్డిపేట చెందిన సులోచన కుటుంబ సభ్యులతో కలసి ఆటోలో కొండగట్టు పుణ్యక్షేత్రానికి వెళుతోంది. గ్రామం సమీపంలోకి ఆటో రాగానే... వెనుక నుంచి బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు సులోచన మెడలోని మూడున్నర తులాల పుస్తెల తాడును తెంపుకుని పోయారు. సదరు వ్యక్తులను ఆటోలో వెంబడించిన వారు అప్పటికే పరారైయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. -
నకిలీ బంగారపు గొలుసు చోరీ
హైదరాబాద్ : నార్త్‌జోన్ పరిధిలో చైన్‌స్నాచర్లు గురువారం మరోసారి రెచ్చిపోయారు. ఒంటరి మహిళలను టార్గెట్‌గా చేసుకుని చైన్‌స్నాచర్లు తమ చేతి వాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బుధవారం జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటన మరవకముందే గురువారం ఉదయం తుకారాం పోలీస్‌స్టేషన్ పరిధిలో మరో చైన్‌స్నాచింగ్ ఘటన చోటు చేసుకుంది. అడ్డగుట్టలోని కిరాణా షాపులో సరుకులు ఇస్తున్న లక్ష్మి అనే మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు తెంచుకుని వెళ్లారు. బాధితురాలు తుకారాం గేట్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సదరు మహిళ మెడలో ఉన్నది నకిలీ బంగారం గొలుసు అని లక్ష్మి పోలీసులకు వెల్లడించింది. -
నేలకొండపల్లిలో చైన్‌స్నాచింగ్...
ఖమ్మం: చైన్ స్నాచర్ల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. రోడ్లపై ఒంటిరిగా మహిళలు కనిపిస్తే పాపం.. మెడలోంచి బంగారు గొలుసులు అపహరిస్తున్నారు. ప్రతిఘటిస్తే ప్రాణాలను కూడా తీయ్యడానికి వెనుకాడటలేదు. ఇలాంటి ఘటనలు ప్రతినిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో ఓ మహిళ నుంచి బంగారు గొలుసును లాక్కెళ్లారు. మహిళను కొంతదూరం అనుసరించిన గొలుసు దొంగలు బైక్‌పై వెనకనుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసును అపహరించారు. బాధితురాలు దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు...
హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో మంగళవారం సాయంత్రం చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. 15 నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు తెంపుకెళ్లిన దొంగలు...మరో మహిళ మెడలోని ఆభరణాలను లాగబోయి ఆమె నిలువరించడంతో బైక్‌పై దూసుకెళ్లపోబోయారు. అప్పటికే సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు మాటువేసి ఇద్దరు చైన్స్నాచర్లను పట్టుకున్నట్టు తెలుస్తోంది. విప్రోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఆశ్విని మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని విప్రో జంక్షన్ రోడ్డుపైకి కాలినడకన బయలుదేరింది. అప్పటికే మాటువేసిన చైన్‌స్నాచర్లు పల్సర్ బైక్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఆ వెంటనే ఆమె గట్టిగా కేకలు వేయడంతో గుమికూడిన ఇతర ఐటీ ఉద్యోగులు డయల్ 100కి కాల్ చేశారు. ఈ సమాచారం అందుకున్న గచ్చిబౌలిలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ) సిబ్బంది విప్రో జంక్షన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఇద్దరు వ్యక్తులు కూర్చొని వెళుతున్న పల్సర్ బైక్‌ను గుర్తించారు. ఆ వెంటనే గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. ఆలోపే ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా కార్వీ ఆఫీసు ముందు రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న కల్పనాలత మెడలో నుంచి చైన్ లాగారు. మళ్లీ గచ్చిబౌలి ఐఐటీ వైపు తిరిగి వస్తుండగా హిల్రిడ్జ్ విల్లాస్ ముందు నడుచుకుంటూ వెళుతున్న ఓ పనిమనిషి మెడలో బంగారు గొలుసు లాగేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె గట్టిగా నిలువరించడంతో ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికే అప్రమత్తమైన గచ్చిబౌలి పోలీసులు ఐఐటీ జంక్షన్ సమీపంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
ఇద్దరు చైన్‌స్నాచర్ల అరెస్ట్
హైదరాబాద్: ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న పాత నేరస్తులను హయత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హయత్‌నగర్ మండలం కోహెడ గ్రామంలో సీసీ కెమెరాల విజువల్ ఆధారంగా వీరస్వామి, సురేందర్ అనే పాత నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువైన 3.5 తులాల బంగారు ఆభరణాలను, మరో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
ముగ్గురు చైన్స్నాచర్లపై పీడీ యాక్టు
హైదరాబాద్: నేరం చేసి అరెస్టు కావడం...బెయిల్ పొంది బయటకు రావడం...మళ్లీ అదే పంథా కొనసాగిస్తూ ప్రజలను భయభాంత్రులకు గురి చేస్తున్న ముగ్గురు కరుడుగట్టిన చైన్స్నాచర్లపై సైబరాబాద్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేసి నిర్భంధంలోకి తీసుకున్నారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు, దొంగతనాలు చేస్తున్న బీదర్‌కు చెందిన టకీ ఆలీ, సల్మాన్ ఆలీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన గోవింద్‌లపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు పీడీ యాక్ట్ నమోదు చేశారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లకు సంబంధించి 66 కేసుల్లో ప్రమేయమున్న టకీఆలీ, 113 కేసుల్లో ప్రమేయమున్న సల్మాన్ అలీ కొంతమంది చైన్స్నాచర్లకు సారథ్యం వహిస్తున్నారు. రాజేంద్రనగర్ శాస్త్రిపురంలో నివాసముంటున్న గోవింద్ జంట పోలీసు కమిషనరేట్లలో 27 చైన్ స్నాచింగ్‌లు చేసి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాడని సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్ తెలిపారు. -
పోలీసుల బైకుపై చైన్ స్నాచర్లు పరార్
హైదరాబాద్: ఎల్బీ నగర్ పోలీసు స్టేషన్ లో పరిధిలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసుల వాహనంపైనే ఉడాయించారు. చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండుగులు బైకుపై పారిపోతుండగా పోలీసులు వెంబడించారు. కొంతదూరం వెళ్లిన తర్వాత చైన్ స్నాచర్ల బైకు అకస్మాత్తుగా ఆగిపోయింది. బండిలో పెట్రోల్ అయిపోవడంతో మొరాయించింది. వారిని వెంబడిస్తూ పోలీసులు అక్కడి చేరుకున్నారు. దుండగులు మారణాయుధాలతో బెదిరించి పోలీసుల బైక్ లాక్కున్నారు. అదే వాహనంపై అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు విస్తృత గాలింపు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. పోలీసులనే బెదిరించి చైన్ స్నాచర్లు పరారవడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
నగరంలో ఇద్దరు చైన్ స్నాచర్లు అరెస్ట్
హైదరాబాద్ : డబీర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు చైన్ స్నాచర్లు ఒమర్, తల్హాలను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 3 తులాల బంగారంతోపాటు బైక్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
వరంగల్‌లో చెలరేగిన చైన్ స్నాచర్లు
దేశాయిపేట: వరంగల్ నగరంలోని దేశాయిపేట, శివనగర్ ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం దేశాయిపేట ప్రాంతంలో ఓ స్కూల్లో పిల్లలకు భోజనం క్యారేజీ ఇచ్చి ఇంటికి తిరిగి వెళుతున్న బాగం హేమలత మెడలోని నాలుగు తులాల బంగారం గొలుసును ఆగంతకులు బైక్‌పై వచ్చి తెంపుకు పోయారు. అలాగే, శివనగర్ ప్రాంతంలో కవిత అనే మహిళ మెడలోనూ రెండున్నర తులాల బంగారం గొలుసును తెంపుకుపోయారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
నలుగురు చైన్‌స్నాచర్లు అరెస్ట్
కడప: జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించగా.. అసలు విషయం బయటపడింది. వీరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికి నాలుగు చోట్ల చోరీలకు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వీరి వద్ద నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. -
రూటు మార్చిన గొలుసు దొంగలు
-
మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
నగరంలో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో బుధవారం నడిచి వెళ్తున్న మహిళపై దాడి చేసి... మెడలోని ఆరు తులాల బంగారం గొలుసు తెంచుకుని... అక్కడి నుంచి పరారైయ్యారు. అలాగే లంగర్‌హౌస్‌లో ఓ మహిళ మెడలోంచి చైన్ స్నాచర్లు మూడు తులాల బంగారాన్ని అపహరించి.. పారిపోయారు. సదరు బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫూటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్ల హల్చల్
-
చైన్ స్నాచర్లు అరెస్ట్ : బంగారం స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఐదున్నర తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. అనకాపల్లి పట్టణంలో ఇటీవల చైన్ స్నాచింగ్‌లు కేసుల భారీగా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు. -
'గొలుసు దొంగలు ఏం చేస్తున్నా.. చూస్తూ ఉండాలా?'
సాక్షి, హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ నగరంలో గొలుసు దొంగలపై పోలీసులు జరిపిన కాల్పులు జరిపిన వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. దొంగలపై సానుభూతి చూపేలా వ్యాజ్యం ఉందని, దీనినిబట్టి గొలుసు దొంగలు ఏం చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉండాలా? అంటూ పిటిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. దీంతో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకునేందుకు అనుమతి కోరారు. ఇందుకు అంగీకరిస్తూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీసులు కాల్పులు జరిపారని, ఈ విధంగా కాల్పులకు పాల్పడకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ అబ్దుల్ సమద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వ్యాజ్యాన్ని పరిశీలించిన ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ వ్యాజ్యం ఏవిధంగా విచారణార్హమైనదో చెప్పాలని ప్రశ్నించింది. 'ఈ వ్యాజ్యం గొలుసు దొంగలపై సానుభూతి చూపేలా ఉంది. పోలీసులకు కాల్పులు ఎలా జరపాలో తెలుసు. భద్రతా చర్యల గురించి వారికి మనం చెప్పాల్సిన అవసరం లేదు. గొలుసు దొంగలు ఏం చేస్తున్నా పట్టించుకోవద్దా? వారి అరాచకాలు పెరిగిపోతున్నా చూస్తూ ఉండాలా? మేం ఈ వ్యాజ్యాన్ని కొట్టివేస్తాం' అని ధర్మాసనం పేర్కొంది. దీనికి పిటిషనర్ స్పందిస్తూ, ఈ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకుంటామని, అనుమతినివ్వాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది. -
దొంగతో దోస్తీ
ఇద్దరు స్నాచర్లలతో జతకట్టిన కానిస్టేబుల్ ముగ్గురినీ అరెస్టు చేసిన పోలీసులు మరో కేసులో ఇరానీ ముఠా సభ్యుడి పట్టివేత చందానగర్‌లో మరో చైన్ స్నాచర్ అరెస్టు మొత్తం 1.14 కేజీల బంగారు నగలు స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: దుండిగల్ బహుదూర్‌పల్లికి చెందిన కొండూర్ మోహన్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లోని నారాయణగూడ ఠాణాలో కానిస్టేబుల్.. ప్రస్తుతంగచ్చిబౌలిలోని మణికొండలో ఉంటున్నాడు. 2005 బ్యాచ్‌కు చెందిన ఇతను చైన్‌స్నాచర్లు బోరబండకు చెందిన మహమ్మద్ అహ్మద్ (బోరబండ), మహమ్మద్ ఫరూఖ్ (మాదన్నపేట)లను చేరదీశాడు. పోలీసులు పట్టుకుని ఠాణాకు తీసుకొచ్చే బైక్‌లను వారికి సమకూర్చి గొలుసు చోరీలు చేయించేవాడు. వచ్చిన డబ్బులో సగానికిపైగా తీసుకునేవాడు. అహ్మద్, ఫరూఖ్‌లను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేసి విచారించగా 2015 జూన్ నుంచి సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఐదు చైన్ స్నాచింగ్‌లు చేశారని, వీరికి నారాయణగూడ ఠాణా పోలీసు కానిస్టేబుల్ కె.మోహన్ సహకరించాడని వెలుగులోకి వచ్చింది. గురువారం సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, జాయింట్ సీపీ శశిధర్ రెడ్డి, క్రైమ్స్ ఓఎస్డీ నవీన్ కుమార్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి తెలిపిన వివరాల ప్రకారం... కస్టడీలోనే కలిశారు... గతేడాది జూన్‌లో ఓ ఇంటి చోరీ కేసులో సంతోష్ నాయక్ ముఠాను నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఫరూఖ్ కూడా ఉన్నాడు. అప్పుడు కస్టడీలో ఉన్న ఫరూఖ్‌కు కానిస్టేబుల్ మోహన్ సన్నిహితుడయ్యాడు. జైల్లో ఉన్న ఫరూఖ్‌ను ములాఖత్ పేరుతో కలిశాడు. సొంత ఖర్చులతో బెయిల్ కూడా ఇప్పించాడు. ఆ తర్వాత బెయిల్ కోసం తాను చేసిన ఖర్చు తిరిగి ఇచ్చేందుకోసం చోరీలు చేయాలని మోహన్ ఫరూఖ్‌ను ప్రేరేపించాడు. అయితే జైల్లో ఉన్న తన స్నేహితుడు అహ్మద్‌ను కూడా బెయిల్‌పై బయటకు తీసుకొస్తే తాను చోరీలు చేయగలని ఫరూఖ్ స్పష్టం చేశాడు. దీంతో మోహన్ అహ్మద్‌ను ములాఖత్‌లో కలిసి అతడిని కూడా బెయిల్‌పై బయటకు తీసుకొచ్చాడు. బైక్.. నోకియా ఫోన్ ఇచ్చాడు... నారాయణగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో ఉన్న ఓ సీబీజెడ్ బైక్‌తో పాటు సిమ్ కార్డు వేసి నోకియా ఫోన్‌ను ఫరూఖ్, అహ్మద్‌లకు ఇచ్చాడు. ఆ బైక్‌పై తిరుగుతూ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు ఇద్దరూ మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలో మూడు స్నాచింగ్‌లు, నాచారం, మేడిపల్లి ఠాణా పరిధిల్లో రెండు స్నాచింగ్‌లు చేశారు. దొంగిలించిన సొత్తును మోహన్‌తో కలిసి పంచుకునేవారు. పట్టించిన బైక్... మల్కాజిగిరి ఠాణా పరిధిలోని ఆనంద్‌బాగ్ ప్రాంతంలో ఫరూఖ్, అహ్మద్‌లు బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా గొలుసు చోరీలు చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ బైక్ ఎక్కడిది అని ఆరా తీయగా నారాయణగూడ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ మోహన్ సమకూర్చాడని వెల్లడించారు. దీంతో నగర సీపీ మహేందర్‌రెడ్డికి సమాచారమిచ్చి మోహన్‌ను మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి పది తులాల బంగారంతో పాటు సీబీజెడ్ బైక్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బియ్యం వ్యాపారి గొలుసు దొంగే... బియ్యం వ్యాపారం చేస్తున్న చందనగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన దొమ్మట రాంప్రసాద్‌ను సీసీఎస్ కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. జంట పోలీసు కమిషనరేట్లతో పాటు మెదక్‌లో 19 చైన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న రాంప్రసాద్ నుంచి 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇరానీ ముఠా సభ్యుడి అరెస్టు... మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ శ్రీరాంపూర్ పట్టణానికి చెందిన వాషీమ్ ఉస్మాన్ సయ్యద్‌ను సీసీఎస్ మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారించగా తన సహచరుడు హైదర్ గరీబ్షా ఇరానీతో కలిసి 22 చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డానని ఒప్పుకున్నాడు. పుణే, షిర్డీ, అహ్మద్‌నగర్, నాసిక్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ గొలుసు చోరీలు చేశామని అంగీకరించాడు. ఇతడి నుంచి 43.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. ఐదంచెల ప్రణాళికతో చైన్ స్నాచింగ్‌కు చెక్.... ఐదుగురు చైన్స్నాచర్లను పట్టుకోవడంతో 46 కేసులు పరిష్కారమయ్యాయి. 1.14 కేజీల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నాం. చైన్ స్నాచింగ్‌లను అరికట్టేందుకు ఐదంచెల ప్రణాళికను అమలు చేస్తున్నాం. గతేడాదితో పోల్చుకుంటే గొలుసు చోరీలు సగం తగ్గినా...తీవ్రత పెరగడంతో ప్రజల్లో,. మీడియాలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంటర్ స్టేట్ గ్యాంగ్‌లను పట్టుకునేందుకు ఏడు బృందాలు బయటనే పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు మూడు టీమ్‌లు సత్ఫలితాలనిచ్చాయి. ఇంటర్‌స్టేట్ గ్యాంగ్‌ల డాటా బేస్ రెడీ చేస్తున్నాం. లోకల్ నేరగాళ్ల వివరాల కోసం సర్వే ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ సేకరించాక నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిందితుల వివరాలతో కలిపి డాటాబేస్ రెడీ చేస్తాం. చైన్ స్నాచర్లపై 392 దోపిడీ కేసు పెడుతున్నాం. ఇప్పటివరకు 49 మందిపై పీడీ యాక్ట్ పెట్టాం. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్ చక్కగా పనిచేస్తున్నాయి. - సీవీ ఆనంద్ , సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
అవనిగడ్డలో చైన్ స్నాచర్లు అరెస్ట్
విజయవాడ : కృష్ణాజిల్లా అవనిగడ్డలో పోలీసులు శుక్రవారం ముగ్గురు చైన్ స్నాచర్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 105 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. చైన్ స్నాచర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా విచారణ నిమిత్తం పోలీసులు చైన్ స్నాచర్లను తమదైన శైలిలో విచారిస్తున్నారు. అవనిగడ్డలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. దీంతో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. అందులోభాగంగా శుక్రవారం పోలీసులు తనిఖీల్లో సదరు చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు. -
చైన్ స్నాచర్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ
-
మహిళపై దాడి చేసిన చైన్ స్నాచర్లు
-
మహిళపై చైన్ స్నాచర్ల దాడి
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కంచన్‌బాగ్ పరిధిలో మంగళవారం చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. నడిచి వెళ్తున్న మహిళపై దాడి చేసి... ఆమె మెడలో బంగారం గొలుసును తెంచుకుని... బైక్‌పై పరారైయ్యారు. ఈ ఘటనలో సదరు మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి... బాధితురాలని సమీపంలోని ఆసుపత్రికి తరలించి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రెడీ... స్టడీ.... ఫైర్!
స్నాచర్ల భరతం పట్టేందుకు యాంటీ స్నాచర్స్ టీమ్ మరింత పదును తేలుతోంది. చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు కఠోర శిక్షణ, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతో ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్‌లు రంగంలోకి దిగుతున్నాయి. ఈ మేరకు బుధవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో ఈ టీమ్స్‌కు సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ దిశానిర్దేశం చేశారు. వారి ప్రతిభా పాఠవాలను పరిశీలించారు. హైదరాబాద్ : చైన్ స్నాచర్లు కనిపిస్తే చాలు పట్టుకొని తీరుతామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. వనస్థలిపురం ఆటోనగర్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు చైన్‌స్నాచర్లు చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న నేపథ్యంలో ‘ఛేజింగ్ అండ్ క్యాచింగ్ టీమ్స్’కు గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ఆయన బుధవారం దిశా నిర్దేశం చేశారు. చైన్‌స్నాచర్ల కనిపించినప్పుడు వారిని పట్టుకునే విధానంలో మెళకువలతో పాటు పరిస్థితులకు తగ్గట్టుగా వేగంగా స్పందిచడంపై పాఠాలు చెప్పారు. ఫీల్డ్‌లో వారికి ఉన్న సందేహాలనూ నివృత్తి చేశారు. ఆ తర్వాత పోలీసు పరేడ్ గ్రౌండ్లో సీసీటీమ్స్ చేసిన బైక్ విన్యాసాలు, రివాల్వర్ వాడే తీరు కళ్లకు కట్టింది. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడారు. ‘‘గతంతో పోల్చుకుంటే చైన్ స్నాచింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అయితే హింస తీవ్రత పెరిగింది. ఓయూలో సుమిత్ర అనే మహిళ మరణించింది. చాలా మంది మహిళలు గాయపడ్డారు. అందుకే శ్రుతిమించుతున్న చైన్స్నాచర్లను నిలువరించాలంటే వారి తరహాలోనే పోలీసు టీమ్స్ ఉండాలని భావించాం. ఫీల్డ్‌లోనే గుర్తిస్తే చైన్ స్నాచింగ్‌లను తగ్గించవచ్చనే ఆలోచనల నుంచి యాంటీ చైన్ స్నాచింగ్ స్ట్రాటజీ కార్యరూపం దాల్చింది’’ అని ఆనందర్ అన్నారు. ఐదంచెల ప్రణాళికతో చెక్... ‘‘చైన్ స్నాచింగ్ జరిగిన తర్వాత అరగంట, గంటకు బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే, అప్పటికే మూడు నాలుగు ప్రాంతాల్లో గొలుసు చోరీలు జరిగిపోతున్నాయి. ఎక్కడెక్కడ చైన్ స్నాచింగ్‌లు జరుగుతున్నాయో గుర్తించి అందుకు అనుగుణంగా 110 మందితో 55 సీసీటీమ్స్ రెడీ చేశాం. చైన్ స్నాచర్లను పట్టుకునే మెళకువలతో పాటు బైక్‌ను వేగంగా నడపడం, నియంత్రించడంపై శిక్షణ ఇప్పించాం. ఒకవేళ స్నాచర్లు ఆయుధాలతో దాడికి యత్నిస్తే ఆత్మరక్షణ కోసం కాల్పులు ఎలా జరపాలో కూడా ప్రత్యేక తర్ఫీదునిచ్చాం’’ అని కమిషనర్ చెప్పారు. అంతరాష్ట్ర చైన్‌స్నాచర్ల ముఠాలను పట్టుకునేందుకు ఇప్పటికే ఏడు ప్రత్యేక బృందాలు రెడీ చేశాం. స్నాచర్లను పట్టుకునేందుకు ఆ బృందాలు వారణాసి, మహారాష్ట్రలకు వెళ్లాయి. ఇతర రాష్ట్రాల్లోని చైన్ స్నాచర్ల వివరాలు తెలుసుకునేందుకు కూడా ప్రత్యేక విభాగం పనిచేస్తోంది. స్థానిక స్నాచింగ్ ముఠాలపై నిఘా వేసేందుకు కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఇప్పటికే గొలుసు దొంగల పూర్తి సమాచారం సేకరించాం. ఆఫీసు రికార్డుల్లో పూర్తిగా అప్డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యాం. సీసీటీమ్స్, లోకల్ పోలీసు అధికారుల ఫోన్లో చైన్‌స్నాచర్ల ఫొటోలతో పాటు వివరాలు ఉండేలా యాప్ రెడీ చేస్తున్నాం. గతంలో మాదిరిగా రోటీన్ చెకప్ కాకండా స్థానిక పోలీసులు ఎక్కడపడితే అక్కడ వాహనాల తనిఖీలు చేసేలా చూస్తున్నాం. డైనమిక్ బీట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలోని పార్కింగ్ ప్రాంతాల్లో తనిఖీ చేస్తున్నాం. స్నాచింగ్స్‌పె ప్రజల్లో అవగాహన కలిగించేందుకు తయారుచేసిన కరపత్రాలను పంపిణీ చేస్తున్నాం. ఇతర నేరాలు కూడా జరిగే విధానాన్ని వివరిస్తూ రెడీ చేసిన పోస్టర్లను అన్ని ప్రాంతాల్లో అతికించేలా చొరవ తీసుకుంటున్నామని కమిషనర్ ఆనంద్ చెప్పారు. అది దుష్ర్పచారం వనస్థలిపురం ఆటోనగర్‌లో చైన్స్నాచర్లను పట్టుకునే క్రమంలో సీసీటీమ్ సభ్యులు త్వరితగతిన స్పందించలేదు. అయితే వారు చూపిన తెగువ భేష్. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. అయితే ఆటోనగర్ ఘటన డెకాయిట్ ఆపరేషన్ అని వస్తున్నదంతా దుష్ర్పచారమే, ఏది ఏమైనా చైన్ స్నాచర్లకు పోలీసు పవరేంటో చూపెడతాం. వారికి ఫీల్డ్‌లోనే బుద్ధి చెప్తాం. రాష్ట్రంలో నక్సలైట్ల కార్యకలాపాలను అడ్డుకున్నట్టే చెన్స్నాచర్లకు ముకుతాడు వేస్తాం. త్వరలోనే మంచి ఫలితాలు కనబడతాయి. - ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
చైన్స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయం?
-
చైన్స్నాచర్లలో ఒకరికి బుల్లెట్ గాయం?
వనస్థలిపురం ఆటోనగర్ ప్రాంతంలో సోమవారం జరిగిన కాల్పుల్లో తప్పించుకున్న చైన్ స్నాచర్ల కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. సైబరాబాద్ పోలీసులు ఈ నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు నిందితులలో ఒకరికి బుల్లెట్ గాయం అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆటోనగర్ నుంచి చింతల్‌కుంట, సాగర్ రింగ్ రోడ్డు, కర్మన్‌ఘాట్ మీదుగా కంచన్‌బాగ్ వైపు వాళ్లు పరారైనట్లు సమాచారం సేకరించారు. దీంతో ఆ మార్గంలో ఉన్న అన్ని ఆస్పత్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఎక్కడైనా ఆస్పత్రులలో వాళ్లు చికిత్స పొందుతూ ఉండొచ్చన్న అనుమానంతో అన్నిచోట్లా గాలిస్తున్నారు. -
చైన్స్నాచర్లను పట్టుకునేందుకు శిక్షణ
-
మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
స్నాచర్ల కట్టడికి చట్టాల్లో సవరణ: నాయిని
సాక్షి, హైదరాబాద్: జంట కమిషనరేట్ల పరిధిలో వరుసగా రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లను కట్టడి చేయడానికి పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుంటోందని హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారమిక్కడి నాగోలు కో-ఆపరేటివ్ బ్యాంకు కాలనీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కాలనీ వెబ్‌సైట్‌ను ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొలుసు దొంగలపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు వారికి తేలిగ్గా బెయిల్ దొరక్కుండా చేసేందుకు కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను సవరించాలని నిర్ణయించామని హోం మంత్రి చెప్పారు. -
మళ్లీ రెచ్చి పోయారు...
-
మళ్లీ రెచ్చి పోయారు...
హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు మరోసారి తమ ప్రతాపం చూపించారు. ఇప్పటికే హడలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు శనివారం మరోసారి రెచ్చిపోయారు. హైదరాబాద్ మీర్పేట్లో పది నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు మహిళల నుంచి గొలుసులు తెంపుకుపోయారు. ఇద్దరు మెడల్లోంచి దాదాపు 7 తులాల బంగారు గొలుసులు లాక్కుని పరారయ్యారు. మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్రోడ్లో సరళమ్మ అనే మహిళ మెడలోని గొలుసును లాక్కుపోయారు. ఇంటి ముందు వాకిలి ఊడ్చుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సాయివిహార్ కాలనీకి చెందిన వెంకటలక్ష్మి అనే మరో మహిళ మెడలోనుంచి 3 తులాల గొలుసును లాక్కుపోయారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వనస్థలిపురం హైకోర్టు కాలనీలో ఈ ఉదయం ఇద్దరు చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఇంటి ముందు పూలు కోసుకుంటున్న జయమ్మ అనే మహిళ మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసు తెంపుకుపోయారు. చడీచప్పుడు లేకుండా బైక్‌పై వచ్చిన దుండగులు మెడలోని గొలుసు లాక్కుపోయారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులను సైతం నెట్టేస్తూ పారిపోయారని బాధితురాలు లబోదిబోమంది. ఇక హైదరాబాద్ నాగోల్‌లో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. బండ్లగూడ కృషినగర్‌లో బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు...ఆరు బయట కూర్చున్న సుశీలమ్మ అనే వృద్ధురాలిని అడ్రస్ అడినట్లు నటించి.... మెడలోంచి 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. స్నాచర్లు గట్టిగా గొలుసు లాగడంతో... సుశీలమ్మ కింద పడి తీవ్ర గాయాలపాలైంది. కుటుంబ సభ్యులు వచ్చేలోపే దొంగలు పరారయ్యారు. ఈ ఘటనలో వృద్ధురాలి కాలు,చేయి విరిగిపోయాయి. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఓవైపు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని, గొలుసు దొంగలను పట్టుకుంటామని చెబుతున్నా చైన్ స్నాచర్స్ మాత్రం పోలీసులకు గట్టి సవాలే విసురుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామంటుంటే...దొంగలు మాత్రం మహిళల మెడల్లో ఉన్న బంగారు గొలుసులు తెంచుకు పోతున్నారు. -
హైకోర్టు కాలనీలో చైన్‌స్నాచింగ్
-
బెంగళూరునూ బెంబేలెతిస్తున్నారు...
బెంగళూరు: భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులోనూ చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. గురువారం ఒక్కరోజే ఆరు చోట్ల గొలుసు దొంగతనాలు జరిగాయి. ఇవన్నీ ఉదయం 6 గంటల ప్రాంతంలో జరగడం గమనార్హం. వరుస చైన్ స్నాచింగ్ లతో బయటకు రావడానికి మహిళలు భయపడుతున్నారు. బుధవారం 8 చోట్ల దుండగులు చైన్ స్నాచింగ్ లకు తెగబడ్డారు. జేపీ నగర, జయనగర, బీజీఎం లేఅవుట్, యలహంక మారుతీనగర, బీహెచ్ఇఎల్ లేఅవుట్, పీణ్యా సిద్దార్ధ లేఅవుట్, అమృతహళ్లి ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడ్డారు. బాధితులు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. -
బరితెగిస్తున్న చైన్ స్నాచర్లు
పోలీసులమంటూ నమ్మబలికి గొలుసు లాక్కునే యత్నం మహిళ, స్థానికులు ప్రతిఘటించడంతో పరారైన యువకులు బద్వేలు అర్బన్ : బద్వేలులో చైన్ స్నాచర్లు బరితెగిస్తున్నారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్ ఎదుటే పోలీసులమని చెప్పి ఓ మహిళ మెడలో గొలుసులాక్కునేందుకు ప్రయత్నించారు. మహిళతో పాటు చుట్టుపక్కలవారు ప్రతిఘటించడంతో బైక్‌పై యువకులు పరారయ్యారు. మంగళవారం చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలలోకెళితే.. స్థానిక గాండ్లవీధిలో నివసిస్తున్న ఓ మహిళ పోరుమామిళ్ల రోడ్డులోని తమ వస్త్రదుకాణానికి వెళ్లి ఇంటికి వెళ్తున్న సమయంలో అర్బన్ స్టేషన్ ఎదుట ఇద్దరు యువకులు మహిళను ఆపి తాము పోలీసులమని, చెన్నైనుంచి బద్వేలుకు దొంగలు వచ్చారని మీ వద్ద ఉన్న బంగారు నగలు దాచుకోవాలని చెప్పారు. అలాగే నగలతో బయట తిరిగితే రూ.1000లు జరిమానా చెల్లించాలని హెచ్చరించారు. ఇదంతా నమ్మే రీతిలో లేకపోవడంతో సదరు మహిళ యువకులను ప్రశ్నించడంతో గుర్తింపుకార్డు కూడా చూపించినట్లు తెలిసింది. దీంతో మహిళ చేసేది లేక చేతికి ఉన్న గాజులను కర్చీప్‌లో కట్టుకునేందుకు బయటకు తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న మరో యువకుడు మహిళ మెడలోని తాళిబొట్టు సరుడును లాక్కునేందుకు ప్రయత్నించాడు. మహిళ పూర్తిస్థాయిలో ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ యువకులు బంగారు గొలుసును వదిలేసి అక్కడినుంచి ద్విచక్రవాహనంలో ఉడాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పట్టణంలో గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. -
మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
-
మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు మంగళవారం రెచ్చిపోయారు. కేపీహెచ్‌బీ, ఎస్ఆర్ నగర్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాల్లోని మహిళలే లక్ష్యంగా చేసుకుని... తమ ప్రతాపాన్ని చూపించారు. కేపీహెచ్‌బీ వివేకానందనగర్‌లోని మహిళ నుంచి మూడు తులాల బంగారం గొలుసును దుండగులు లాక్కెళ్లారు. అలాగే ఎస్ఆర్ నగర్‌లోని మహిళ నుంచి చైన్ లాక్కెళ్లారు. ఫిలింనగర్లో మహిళ నుంచి చైన్ లాక్కెళ్లారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు చోటు చేసుకుంటున్నా... అటు పోలీసులు... ఇటు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ప్రజలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
వనస్థలిపురంలో చైన్ స్నాచర్స్
-
చెలరేగుతున్న చైన్‌స్నాచర్స్
నెల్లూరు (క్రైమ్) : పోలీసుల నిఘా వైఫల్యం.. మహిళల ఏమరపాటుతో జిల్లాలో చైన్‌స్నాచర్లు చెలరేగిపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళలను.. మరి కొన్ని చోట్ల పలానా వారి అడ్రసు కావాలంటూ అడుగుతూ మహిళల మెడల్లో బంగారు చైన్లను తెంచుకెళ్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగిన రోజు వాహనాల తనిఖీలతో పోలీసులు సరిపెడుతుండటంతో చైన్‌స్నాచర్స్ పేట్రేగిపోతున్నారు. నిఘా నిస్తేజం.. రికవరీలు లేవు.. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చైన్‌స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. ప్రధానంగా నగరంలో ప్రతి రోజు ఏదో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో మహిళల మెడల్లోని బంగారు గొలుసులు, తాళిబొట్లు తెంపుకెళుతున్నారు. కొందరు పాతనేరస్తులతో పాటు, జల్సాలకు అలవాటు పడిన యువకులు ముఠాలుగా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన గ్యాంగ్ జిల్లాలో తిష్టవేసి దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసు నిఘా వర్గాలు సైతం హెచ్చరించాయి. అయినా జిల్లా పోలీస్ యంత్రాంగం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో 150కు పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగినట్లు పోలీసు రికార్డుల్లో కేసులు నమోదు అయ్యాయి. రికార్డులకెక్కని ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 86కు పైగా చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. నేరాలను నియంత్రించాల్సిన నిఘా విభాగం నిస్తేజంగా మారింది. దీంతో దోపిడీలు, దొంగతనాలు అధికమవుతున్నాయి. వీటిని నియంత్రించడంలో నగర పోలీసులు విఫలమైయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి పోలీసుస్టేషన్లో క్రైం సిబ్బంది, బ్లూకోట్స్, రక్షక్ పోలీసులు, సీసీఎస్ బృందాలున్నా ప్రయోజనం శూన్యంగా మారింది. నిఘా ముమ్మరం చేశాం : నగర డీఎస్పీ ఎస్ మగ్బుల్ చైన్‌స్నాచర్ల కోసం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. ఈ తరహా నేరాలకు పాల్పడేవారంతా యువకులు, కొత్త నేరస్తులే. వారిలో జల్సాలకు అలవాటుపడిన విద్యార్థులు, యువకులు ఉన్నారు. హైస్పీడ్ బైక్‌ల్లో శివారు ప్రాంతాలు, కళాశాలలు, జనసంచారం తక్కువగా ఉండే కాలనీల్లో తిరుగుతూ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు. ఎవరికైనా అనుమానమొచ్చినా, నంబరు ప్లేటు లేని మోటారుసైకిళ్లపై అనుమానాస్పదంగా తిరుగుతుంటే వెంటనే డయల్ 100కు, స్థానిక పోలీసుస్టేషన్‌కు సమాచారం అందించాలి. మచ్చుకు కొన్ని.. ► సంగం మండలానికి చెందిన ఓ యువకుడు తన స్నేహితురాలిని బైక్‌పై ఎక్కించుకుని వస్తుండగా పొట్టేపాళెం సమీపంలో దుండుగులు ఆ యువతిని బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లారు. ►నెల్లూరు నగరంలోని జెడ్పీ కాలనీలో ఆగస్టు 24న రాధ అనే వృద్ధురాలిని బెదిరించి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును దోపిడీ చేశారు. ► నాయుడుపేటలో ఆగస్టు 26న ఓజిలి మండలం చిలమానుచేనుకు చెందిన మంజుల అనే అంగన్వాడీ మెడలోని నాలుగుసవర్ల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. అంగన్వాడీ కార్యకర్తలు పలువురు వెళ్తుండగా ఈ సంఘటన జరగడం విశేషం. ► ఈ నెల 3న నెల్లూరులోని యనమాలవారిదిన్నెకు చెందిన వసంత అనే మహిళ పాలబూత్‌లో పాలు పోసి వెళ్తుండగా బంగ్లాతోట సమీపంలో రెండున్నర సవర్ల చైన్ లాక్కెళ్లారు. ► తాజాగా శుక్రవారం నెల్లూరు నగరంలోని భక్తవత్సలనగర్‌లో ఓ చిరునామా అడుగుతూ వచ్చిన ఇద్దరు దుండగులు జషింతమ్మ అనే మహిళ మెడలోని ఎనిమిది సవర్ల బంగారు చైన్లు లాక్కెళ్లారు. -
స్నాచర్లను కొట్టి చంపినా కేసులుండవు !
విజయవాడ : గొలుసు దొంగలను కొట్టి చంపినా.. తీవ్రంగా గాయపరిచినా పోలీసు కేసులు ఉండవా? అవుననే అంటున్నాయి కమిషనరేట్‌కు చెందిన ఉన్నత స్థాయి వర్గాలు. అదును చూసి చెలరేగుతున్న గొలుసు దొంగల ఆగడాలకు ముకుతాడు వేసేందుకు కమిషనరేట్ పెద్దలు నిర్ణయించారు. గొలుసు దొంగల విషయంలో ప్రజలు తిరగబడితే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నారు. శనివారం సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న స్నాచింగ్ కేసులో కొందరు యువకులు నిందితులను వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో కిందపడిన దొంగలు మెరుపు వేగంతో పైకి లేచి పరారయ్యారు. వీరిపై కర్రలు, రాళ్లు విసిరి పట్టుకోవాలని భావించినా పోలీసుల కేసు భయంతో మిన్నుకుండిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై సమీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రజలు తిరగబడిన సమయంలో జరగరానిది జరిగితే కేసులు నమోదు చేయబోమంటూ బాధితులు, స్థానికులకు భరోసా ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరోసారి సవాల్ జూలైలో గురు పౌర్ణమి రోజు గొలుసు దొంగలు ఐదు ప్రాంతాల్లో నేరాలు చేశారు. గంటన్నర వ్యవధిలో అర కిలో బంగారంతో వీరు ఉడాయించారు. ఈ నెల మొదటి వారంలో మాచవరం, సూర్యారావు పేట పోలీసు స్టేషన్ల పరిధిలో మరో రెండు నేరాలు చేశారు. ఈ రెండు నేరాల్లోను చోరీ చేసిన మోటారు సైకిళ్లను వినియోగించారు. ముఖ్యమంత్రి బందోబస్తు, ఇతర విధుల్లో పోలీసులు నిమగ్నం కావడాన్ని ఆసరాగా చేసుకొని శనివారం మరోసారి నగరంలో ప్రతాపం ప్రదర్శించారు. తొలుత ఉదయం 11.30 గంటల సమయంలో మోటారు సైకిల్‌పై హెల్మెట్లు పెట్టుకొని వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ మహిళ మెడలో గొలుసు తెంచేందుకు విఫలయత్నం చేశారు. అక్కడ స్థానికులు అప్రమత్తం కావడంతో చాకచక్యంగా తప్పించుకొని గాంధీనగర్‌లో గొలుసు చోరీ చేశారు. ఎన్ఆర్పీ రోడ్డులోని ముదునూరి వారి వీధికి చెందిన ఓ మహిళ నడిచి వెళుతుండగా వేగంగా మోటారు సైకిల్‌పై ముందుకు వెళ్లి వెనక్కి తిరిగిన ఆగంతకులు మెడలోని ఐదు కాసుల బంగారు గొలుసు తెంచుకొని ఉడాయించారు. ఇది గమనించిన స్థానికులు వెంటపడి తరిమారు. ఈ క్రమంలో మోటారు సైకిల్ నుంచి కొద్ది దూరంలో ఆగంతకులు జారిపడ్డారు. తొలుత రాళ్లు, ఇతర ఆయుధాలు విసిరి వీరిని నిలువరించేందుకు ఆలోచించిన స్థానికులు కేసుల భయంతో మిన్నకుండిపోయారు. దీంతో మెరుపు వేగంతో పైకిలేచి ఆగంతకులు పరారయ్యారు. అప్రమత్తమైనప్పటికీ... శ్రావణ శుక్రవారం నాడు విశాఖలో గొలుసు దొంగలు ఏడు నేరాలు చేశారు. ఆ సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలు, సమయాల్లోనే స్నాచర్లు గొలుసు దాడులు చేస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన సీసీఎస్ పోలీసులు రానున్న పర్వ, ప్రత్యేక దినాలపై దృష్టిసారించారు. ఈలోగానే నగరానికి వచ్చి నేరం చేయడంపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. గొలుసు చోరీలకు తెగబడుతున్న ఉత్తరాది ముఠాలకు స్థానికుల సహకారంతోనే చెక్ పెట్టేందుకు పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కొట్టి గాయపరిచినా, అంతకు మించి మరేదైనా చేసినా కేసులు పెట్టబోమంటూ భరోసా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. పూర్ణనందపేటలో.. సత్యనారాయణపురం : ఓ మహిళ మెడలో గొలుసులను బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తుల తెంచుకు వెళ్లిన సంఘటన పూర్ణనందపేట కలగా లాడ్జి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. లక్ష్మణరావు వీధిలో నివసించే లక్ష్మీప్రసన్న పక్కనే ఉన్న కిరాణాషాపుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా ఆమె మెడలోని 8 కాసుల బంగారు గొలుసులు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంపుకొని పరారయ్యారు. ఆమె జరిగిన సంఘటనపై సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొలుసు చోరీపై కేసు నమోదు సత్యనారాయణపురం : ఆవుకు ఆహారం పెట్టేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చిన గాంధీనగర్ సుందరయ్య వీధికి చెందిన ఎర్రబోతు విజయలక్ష్మిని వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆమె దాటుకుని ముందుకు వెళ్లారు. తిరిగి ఆమెకు ఎదురు వచ్చి మెడలోని నాంతాడు నల్లపూసుల గోలుసు తెంచుకొని పారిపోతుండగా ఆమె తేరుకుని గట్టిగా కేకలు వేసింది. యువకులు స్నాచర్స్‌ను బైక్‌ను వెంబడించిన ఫలితం లేకుండా పోయింది. బాధితురాలు జరిగిన సంఘటనపై సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. సుమారు ఐదు కాసుల బంగారు ఆభరణాలు పోయాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెరిగిపోతున్న చైన్ స్నాచింగ్ నేరాలు
-
చైన్ స్నాచర్ల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు
-
ముగ్గురు చైన్ స్నాచర్ల అరెస్ట్
అనంతపురం : అనంతపురం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,86,000లు విలువ చేసే 92 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిందూపురం సీఐ మధుభూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ముదిరెడ్డిపల్లికి చెందిన ఆర్.రాఘవేంద్ర(21), టి.మంజునాథ్(21), పి.వెంకటేష్(21) అనే ముగ్గురు యువకులు జల్సాల కోసం దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. -
చైన్ స్నాచర్లను పట్టుకున్న స్థానికులు
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను స్థానికులు పట్టుకుని అక్కడికక్కడే దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన శుక్రవారం హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో ఉన్న కేంద్రీయ విద్యాలయం సమీపంలో జరిగింది. హైదరాబాద్ నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన మహమ్మద్ అమీర్, మహమ్మద్ వాజీద్ చైన్ స్నాచింగ్‌కు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలో నుంచి గొలుసు లాక్కొని వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిద్దరూ బైక్‌పై నుంచి జారి కిందపడ్డారు. ఇది గమనించిన స్థానికులు ఇద్దరు యువకులను పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
నల్లపూసల తాడును తెంపుకు పోయిన అగంతకులు
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అగంతకులు ఓ మహిళ మెడలోని బంగారు నల్లపూసల తాడును అపహరించుకుపోయారు. వేణుగోపాల స్వామి గుడివీధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అనంతబోయిన సూర్యమహాలక్ష్మి తమ బంధువుల ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళుతున్నారు. ఇంతలో పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు ఆమె మెడలోని నాలుగు కాసుల బంగారు నల్లపూసల తాడును తెంపుకుపోయారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.