
సాక్షి, హైదరాబాద్: నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఉప్పల్, నాచారం, ఓయూ, నాచారం పరిధిలో ఆరు ఘటనలు జరిగాయి. దీంతో చైన్ స్నాచర్ల పట్టుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. పది బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. వరుస ఘటనల నేపథ్యంలో.. కాస్త అప్రమత్తంగా ఉండాలని మహిళలకు పోలీసులు సూచిస్తున్నారు.
మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వృద్ధులనే లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడ్డారు. మాస్క్‌లేసుకుని బైకులపై వచ్చి గొలుసులు, తాళి బొట్లు లాక్కెల్లారు. ఉప్పల్ నుంచి ఈ పర్వం మొదలైంది. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇది ముఠా పనా? లేదంటే వేర్వేరు వ్యక్తుల ప్రమేయమా? అనేది తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు.
స్నాచింగ్‌లు ఇలా..
ఉదయం టైంలో.. ఉప్పల్ 6.20 గంటలకు, 6.40కి ఉప్పల్‌లోనే మరోచోట..
నాచారంలో 7.10కి
ఓయూలో 7.40కి
చిలకడగూడలో 8 గంటలకు
రామ్ గోపాల్‌పేట పరిధలో 8.20
ఇప్పటికే ఆయా ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల గస్తీ నిర్వహిస్తూ.. అనుమానాదస్పదంగా కనిపిస్తున్న వాళ్లను ప్రశ్నిస్తున్నారు. జంట నగరాల్లో వరుస ఘటనలు చోటు చేసుకోవడంపై రాచకొండ, హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment