
సంగెం: సీఎం సభలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సీఎం సభ వేదికపై వచ్చిన సందర్భంలో కళాకారుల వేదికపైకి ఒక్కసారిగా మహిళలు, పురుషులు ఎక్కి సీఎం కేసీఆర్‌ను చూడడానికి ఎగబడ్డారు. ఇదే అదనుగా భావించిన దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఆత్మకూర్ మండలం రాఘవాపూరానికి చెందిన మడిపెల్లి అరుణ అనే మహిళ మెడలోని మూడు తులాల పుస్తెలతాడు తెంపుకునిపోయాడు. తన మెడలోంచి పుస్తెల తాడు తెంపుకున్నట్లు గ్రహించిన మహిళ లబోది బోమని రోదిస్తు అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీ సుల కాళ్లావేళ్లపడింది. అలాగే అక్కడ కొందరి పర్సులు, సెల్‌పోన్లు కొట్టేసినట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment