Warangal tour
-
రాహుల్ వరంగల్ పర్యటన రద్దు
సాక్షి, వరంగల్: రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయ్యింది. ఛత్తీస్‌గఢ్ మావోయిస్టుల ఎన్కౌంటర్ నేపథ్యంలో భద్రతా పరమైన ఇబ్బందులు కారణంగా రాహుల్ పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.కాగా, షెడ్యూల్ ప్రకారం ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు రాహుల్ శంషాబాద్ చేరుకుని అక్కడ నుంచి చాపర్‌లో వరంగల్ చేరుకోవాల్సి ఉంది. వరంగల్ సుప్రభా హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకుని 7:30కి వరంగల్ నుంచి రైలులో చెన్నై వెళ్లాల్సి ఉంది.బీసీ కుల గణన అంశంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో.. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రజల స్పందనను రాహుల్ తెలుసుకోవడంతో పాటు, రైల్వే ప్రైవేటీకరణ అంశంపై రైలు ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సి ఉంది.. అయితే, భద్రతపరమైన ఇబ్బందులు కారణంగా చివరి క్షణంలో పర్యటన రద్దు అయ్యింది. -
కేసీఆర్‌ను బెదిరిస్తే సరిపోతుందా? ఆ ఫలితం నమ్మితే మోదీ భ్రమపడ్డట్టే!
దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో ఏమి సాధించినట్లు? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు , ప్రభుత్వంపై విమర్శలు చేయడం మినహాయించి ఆయన కొత్తగా ఏమి చెప్పారన్నది ప్రశ్న. గతంలో వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీని ప్రతిపాదించారు. అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యాగన్ యూనిట్‌ను మంజూరు చేసింది. దీంతో పాటు కొన్ని జాతీయ రహదారులకు శ్రీకారం చుట్టారు.ఇంతవరకు సంతోషమే. ఈ సందర్భంగా పార్టీపరంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ, ఎప్పటిమాదిరే కుటుంబ రాజకీయాలు, అవినీతిపై మాటల తూటాలు పేల్చారు. ఇవి వినడానికి బాగానే ఉన్నా, ఆచరణలో బీజేపీకి, ఇతర పార్టీలకు తేడా లేదని పలు అనుభవాలు తెలియచేస్తున్నాయి. అవి కుటుంబ పార్టీలు కాదా? తెలంగాణలో వచ్చే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఈ సభను ఏర్పాటు చేశారు. కేసీఆర్‌పై ,ఆయన కుటుంబంపై నేరుగానే విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఒకే గాటన కడుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీలు కుటుంబ పార్టీలని ఆయన అన్నారు. ఇదేమి మొదటిసారి కాదు ఇలా అనడం. వివిధ రాష్ట్రాలలో పర్యటనల సందర్భంగా కూడా ఇవే విషయాలు చెబుతున్నారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని రాష్ట్రాలలో ఇవే కుటుంబ పార్టీలతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నదో కూడా చెప్పాలి కదా! ఉదాహరణకు ఎపీలో 2018 వరకు పొత్తులో ఉన్న టీడీపీకాని, హర్యానాలో పొత్తులో ఉన్న చౌతాల మనుమడి పార్టీకాని, గత ఎన్నికల వరకు మిత్రుడుగా ఉన్న శివసేన కానీ కుటుంబ పార్టీలు కాదా? భారతీయ జనతా పార్టీ లో ఎందరు నేతలు తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకు రావడం లేదు . సోనియాగాంధీతో విబేధాల కారణంగా బయటకు వచ్చిన మేనకాగాంధీ, ఆమె కుమారుడు వరుణ్ గాంధీ కుటుంబ రాజకీయాల కిందకు వస్తారా? రారా? మేనక కేంద్ర మంత్రిగా, వరుణ్ ఎమ్.పీగా బీజేపీ పక్షానే ఉన్నారు. రాజస్తాన్ లో రాజకుటుంబం అయిన వసుందర రాజే బీజేపీముఖ్యమంత్రిగా పనిచేశారు కదా? మరోసారి ఎన్నికల గోదాలోకి ప్రవేశిస్తున్నారు కదా? ఇలా రాష్ట్రాలవారీగా చూస్తే బిజెపిలో సైతం కుటుంబ రాజకీయాలకు తక్కువేమీ కాదు. కాకపోతే ప్రధాని మోదీ వరకు తన కుటుంబీకులను ఎవరినీ రాజకీయాలలోకి తీసుకు రాలేదు. అదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు క్రికెట్ బోర్డులో ఎలా ప్రముఖ పాత్రకు రాగలిగారు? కనుక మోదీ చేస్తున్న కుటుంబ రాజకీయాలు అన్న విమర్శకు అంత హేతుబద్దత కనిపించదు. ఇదీ చదవండి: అవసరమైతే గాండీవం ఎత్తాలి.. బ్రాహ్మణులను హేళన చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు కవితను ఈడీ అరెస్టు చేయలేదెందుకు? ఇక అవినీతి గురించి కూడా ఘాటైన విమర్శలే చేస్తుంటారు. అటు కాంగ్రెస్ ను కానీ, ఇటు బీఆర్ఎస్ ను కాని ఈ విషయంలో దునుమాడుతుంటారు. కేసీఆర్ కుటుంబ అవినీతి రాష్ట్రాన్ని దాటి ఢిల్లీ వరకు పాకిందని ఆయన అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పాత్రపై ఈడీ చేసిన ఆరోపణలను పురస్కరించుకుని మోదీ ఈ వ్యాఖ్య చేశారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మి పార్టీ ప్రభుత్వంలోని మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తదితరులు ఈ స్కామ్ లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఈ రకంగా అవినీతి ఢిల్లీవరకు వచ్చిందని ఆయన అన్నారు. అది అంత సీరియస్ విషయం అయితే కేసీఆర్ కుమార్తెను ఎందుకు ఈడీ అరెస్టు చేయలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటుంది. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒకటేనని, అందుకు ఇదే నిదర్శనమని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరో సంగతి చెప్పాలి. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకుల రుణాలు ఎగవేసిన పెద్దలు కొందరు బీజేపీలో చేరి రక్షణ పొందుతున్నారన్న విమర్శలకు ప్రధాని సమాధానం చెప్పవలసి ఉంటుంది. అదెందుకు గత ఎన్నికలకు ముందు ఏపీకి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును ఎటీఎమ్ మాదిరి వాడుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని మోదీ ఆరోపించారు. కాని ఆ తర్వాత కేంద్రం ఆ ఊసే పట్టించుకోలేదు. అలాగే చంద్రబాబు పీఎస్ ఇంటిలో సోదాలు చేసి రెండువేల కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని సీబీటీడీ ప్రకటించింది. ఇది జరిగి నాలుగేళ్లు అయినా ఇంతవరకు అదేమైందో అదీగతీ లేదు. అలాగే ఆయా రాష్ట్రాలలో ఎన్నికల సమయంలో బిజెపియేతర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుంటారన్న విమర్శను బీజేపీఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలోనే ప్రధాని ఇలాంటి రాజకీయ ఉపన్యాసాలు చేయడం కాకుండా, ఆచరణలో కూడా అలాగే ఉంటున్నారన్న భావన కలిగించగలిగితే దేశానికి మంచిది. కానీ దురదృష్టవశాత్తు ఆ దిశగా మోదీ ఆలోచనలు ఉన్నట్లు కనిపించవు. తెలంగాణలో అవినీతి పైన,ప్రాజెక్టులలో అక్రమాలపై కూడా మోదీ తన అభిప్రాయాలు చెప్పినా, ఎక్కువ సందర్భాలలో అవన్నీ ఉత్తమాటలుగానే మిగులుతుంటాయి. నిజంగానే ఏదైనా రాష్ట్ర ప్రభుత్వంలో భారీగా అవినీతి జరుగుతోందని కేంద్రం లేదా ప్రధాని నమ్మితే దానిని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలి. అలాకాని పక్షంలో ఎన్నికల స్పీచ్ గానే మిగిలిపోతుంది.ఒకవేళ అవినీతి అధికంగా జరిగిందని మోదీ నమ్ముతుంటే బండి సంజయ్‌ను పార్టీ పదవి నుంచి ఎందుకు తొలగించారన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ కుటుంబంపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండే బండిని తొలగించడంలో మర్మమేమిటని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అది ఒకరకమైన బెదిరింపే.. తెలంగాణకు బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌లు ప్రమాదకరమని మోదీ అన్నారు. అది ఎలా ప్రమాదమో , బీజేపీ రావడం ఎలా ప్రమోదమో ఆయన చెప్పినట్లు అనిపించదు. కర్నాటకలో బీజేపీ ఓటమి పాలు కావడానికి అవినీతి ఆరోపణలు కూడా కారణమని అంటారు. కర్నాటక ఎన్నికలలో ఎంతసేపు మతపరమైన అంశాలపైనే బీజేపీమాట్లాడింది కానీ, బీజేపీ ప్రభుత్వ పాలన గురించి అవినీతి అబియోగాల గురించి సమాధానం ఇవ్వలేకపోయింది. దానివల్ల కూడా ఆ పార్టీ ఓటమి చెందింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నా, వాటిని చాలాకాలంగా జనం వింటూనే ఉన్నారు. కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు సంస్థలు గురి పెట్టాయని అనడం కూడా ఒకరకంగా బెదిరింపే అవుతుందేమో!మోదీ స్థాయి నేత మున్సిపల్ ఎన్నికలను ప్రాతిపదికగా తీసుకుని దానిని ట్రయల్అ నడం ఆశ్చర్యమే. ఒక్క మున్సిపాల్టీలో కూడా గెలవలేదు. కాకపోతే హైదరాబాద్ లో 45 డివిజన్లలో బీజేపీ విజయం సాధించింది. అంతవరకు బీజేపీకి క్రెడిట్టే. కాని దాని ఆధారంగానే రాష్ట్రంలో బీజేపీఅదికారంలోకి వస్తుందని మోదీ నమ్మితే అది భ్రమే అవుతుంది. ఇదీ చదవండి: JP Nadda: బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ ఒకటి కాబోవని చెప్పండి.. రాష్ట్ర బీజేపీ నేతలకు నడ్డా సీరియస్ క్లాస్ బలహీనపడిందా..? నిరుద్యోగ సమస్య, యూనివర్శిటీలలో నియామకాల గురించి మోదీ మాట్లాడినదానికి ఇతరత్రా విమర్శలకు మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లు గట్టి కౌంటరే ఇచ్చారు. ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో ఏమీ జరగలేదని ప్రధాని అనడం కూడా సరికాదు. ఇంకా ఫలానా అభివృద్ది చేయాలని అడిగితే తప్పులేదు. లేదా బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమి చేస్తారో సూచనప్రాయంగా అయినా చెప్పి ఉండాల్సింది. కర్నాటక ఎన్నికలలో బీజేపీఓడిపోయిన తర్వాత తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడం మోదీకి పెద్ద సవాలుగా మారింది.ఒక దశలో తెలంగాణలో బీజేపీబాగా పుంజుకుంటుందని ప్రజలలో నాటుకుంది. కాని ఆ తర్వాత పరిణామాలలో ఈ పార్టీ బాగా వీక్ అయినట్లుగా ఉంది. కాంగ్రెస్ పార్టీనే బిఆర్ఎస్ కు ప్రధాన ప్రత్యర్ధి అన్న భావన బలపడుతోంది. కేసీఆర్‌కు పోటీగా నిలబడే నేత ప్రస్తుతానికి తెలంగాణ బీజేపీలో లేరనే చెప్పాలి. అందువల్ల తన ఇమేజీపైనే మోదీ తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిజెపిని నడిపించవలసి ఉంది. లోక్ సభ ఎన్నికలలో ఆయన గ్లామర్ పనిచేస్తుందేమో కాని, అసెంబ్లీ ఎన్నికలలో ఎంతవరకు ఉపకరిస్తుందన్నది చెప్పలేం.ఈ నేపథంలో ప్రస్తుతం మోదీ ఎంత ఘాటు విమర్శలు చేసినా దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది సందేహమే. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ ఇదీ చదవండి: గులా'బీ టీమ్' గందరగోళం ఎట్లా? అధ్యక్షుడు జేపీ నడ్డాతో రాష్ట్ర నేతల మొర -
ప్రధాని మోదీ వరంగల్ టూర్.. సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ వరంగల్ టూర్‌ను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ క్రమంలో బీజేపీ, కేంద్రం తీరును ఎండగట్టాలని కేసీఆర్ సిద్ధమైనట్లు తెలిసింది. మోదీ పర్యటనకు తాము వెళ్లమంటూ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రధాని పర్యటనను బహిష్కరిస్తున్నామని, తెలంగాణపై విషం చిమ్ముతున్న వ్యక్తి ప్రధాని మోదీ అంటూ మండిపడ్డారు. గుజరాత్లో రూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించి తెలంగాణకి రూ.520 కోట్లతో ఏదో దిక్కుమాలిన ఫ్యాక్టరీ ఇస్తున్నాడని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తి కాబట్టే మోదీని ఒక్కమాట అనడు. రేవంత్‌రెడ్డివి పిచ్చిమాటలు. రాహుల్‌గాంధీ ఏ హోదాలో రూ.4వేల పెన్షన్ ప్రకటించారు. 50 ఏళ్లు తెలంగాణను పీక్కుతిన్నారు. ఇప్పుడు ఏదో చేస్తామంటే ఎవరు నమ్ముతారు’’ అంటూ మంత్రని కేటీఆర్ నిప్పులు చెరిగారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. విపక్షాల విమర్శలను ఉపేక్షించకూడదని, విరుచుకుపడే విధానాన్ని అవలంబించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమదూరం పాటిస్తూ.. ఇరు పార్టీల విధానాలను, అనుసరిస్తున్న పంథాను ఎండగట్టాలని అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. చదవండి: 'ఏ'కేద్దాం.. 'బీ' రెడీ! ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్ను అనవసరంగా విమర్శిస్తూ, తప్పుడు ఆరోపణలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని.. ఇలాంటి సమయంలో ఎదురుదాడి చేయకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతున్నారని వివరిస్తున్నాయి. -
ప్రధాని మోదీ వరంగల్ పర్యటన.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. శనివారం (8న) ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.35 కి వరంగల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు. -
ముందస్తు అరెస్ట్ ల పేరుతో పోలీసుల అత్యుత్సాహం
-
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో టీఆర్ఎస్ నేతలకు జరిమానాలు
-
కేటీఆర్ పర్యటన.. టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చిన వరంగల్ కార్పొరేషన్
సాక్షి, వరంగల్: మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కె. తారకరామారావు పర్యటన నేపథ్యంలో వరంగల్ మున్సిపల్‌కార్పొరేషన్ టీఆర్ఎస్ నేతలకు షాకిచ్చింది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారికి భారీ ఫైన్ విధించింది. వరంగల్ మేయర్ గుండు సుధారాణికి బల్దియా అధికారులు ఏకంగా రూ.2 లక్షలు జరిమానా విధించారు. టీఆర్ఎస్ నాయకులు కేశవరావుకు రూ.50 వేల జరిమానా విధించారు. కాగా, నేడు కేటీఆర్ వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేయనున్నారు. మంత్రి రాక నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. జెండాలు, తోరణాలు, బ్యానర్లతో మడికొండ నుంచి వరంగల్ వరకు రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి. -
కేసీఆర్‌కు కలిసి రాని ముహూర్తం.. విజయ గర్జన సభ మళ్లీ వాయిదా..
-
సీఎం కేసీఆర్ పర్యటనలో అపశ్రుతులు.. అడ్డగింతలు
సాక్షి నెట్వర్క్/ వరంగల్: సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులను ఆదివారమే ముం దస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నగరవ్యాప్తంగా బారికేడ్లు ఏర్పాటుచేసి, ట్రాఫిక్‌ను మళ్లించారు. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు సీఎం వస్తుండగా.. సుబేదారి ప్రాంతంలోని తెలంగాణ అమరుల కీర్తి స్తూపం వద్ద కాకతీయవర్శిటీ విద్యార్థి నాయకులు కాన్వాయ్కి అడ్డుపడ్డారు. ‘సీఎం కేసీఆర్ గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డు తప్పించి అరెస్టు చేశారు. తమ భూమికి పట్టా పాస్‌బుక్ ఇవ్వకుండా అధికారులు ఇబ్బందిపెడుతున్నారంటూ వరంగల్ కొత్తవాడకు చెందిన వృద్ధ దంపతులు గాదెం ఓదెమ్మ, కట్టయ్య సెంట్రల్ జైల్ పెట్రోల్ బంకు ముందు అత్మహత్య యత్నానికి సిద్ధపడ్డారు. రెవెన్యూ అధికారుల తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్ ఆత్మహత్య చేసుకునేందుకు వచ్చామన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డికి చేదు అనుభవం సీఎం కేసీఆర్ పర్యటనలో పాల్గొనేందుకు వస్తున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని పోలీసులు కాకతీయ వర్సిటీ క్రాస్‌రోడ్డు వద్ద అడ్డుకున్నారు. దాంతో ఆయన అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ సర్క్యూట్ హౌజ్ వరకు వచ్చారు. తర్వాత ఏకశిలా పార్కులో జయశంకర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించేందుకు కేసీఆర్ రాగా.. అక్కడికి కూడా సుదర్శన్‌రెడ్డిని పోలీసులు అనుమతించలేదు. మనస్తాపానికి గురైన ఆయన కలెక్టరేట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. కాగా.. సీఎం పర్యటన సందర్భంగా తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని.. ట్రాఫిక్ ఆంక్షలు, భద్రతా కారణాల దృష్ట్యా ఇబ్బంది కలగకూడదని నడిచి వెళ్లానని సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. -
‘కేసీఆర్ పేదింటి మేనమామగా నిలుస్తున్నరు’
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు టీఆర్ఎస్దేనని.. ప్రజలు తమ పార్టీ, ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. వరంగల్‌లో వివిధ అభివృద్ధి పథకాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. ఉగాది నుంచి వరంగల్ మహానగర ప్రజలకు రక్షిత మంచినీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన ఆయన.. ఒక్కరోజు ముందుగానే రూ.1,589 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రాంపూర్‌లో ప్రారంభించారు. ఆ తర్వాత పలుచోట్ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశా రు. ఖిలావరంగల్, న్యూశాయంపేటల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. ‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రూ.75 పింఛన్ ఇచ్చేవారు. వాడకట్టులో 50 మందికి వస్తే 500 మందికి రాకపోయేది. కొత్త వారికి కావాలంటే ఎవరో ఒకరు చనిపోతే మీ పేరు రాస్తమనేటోళ్లు. కాంగ్రెసోళ్లు వచ్చి రూ.75ను రూ.200 చేసి, భారత్‌లో ఎవరూ చేయనట్లు వారే చేశామని డైలాగులు కొట్టారు. తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పెన్షన్‌ను రూ.2016 చేసుకున్నం. గతంలో 29లక్షల మందికే పింఛన్ వచ్చేది. ఇప్పు డు 40 లక్షల మందికి ఇస్తున్నం. త్వరలోనే అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు ఇస్తం’అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటుంటారు.. కానీ సీఎం కేసీఆర్ ఆ ఇళ్లు నేనే కడతా, పెళ్లి నేనే చేస్తా అంటున్నరు. పేదల కష్టసుఖాలు తెలిసిన మన ముఖ్యమంత్రి ఆ రెండూ చేస్తున్నరు. పేదింటి మేనమామగా నిలుస్తున్నరు’అని కేటీఆర్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో అక్కడక్కడా ఆలస్యం జరిగినా.. ప్రతీ పేదవాడికి ఇల్లు, పేదింటి ఆడ బిడ్డ పెళ్లిని ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందన్నారు. పలు చోట్ల అడ్డగింత.. కేటీఆర్ పర్యటన సందర్భంగా బీజేపీ, ఇతర పార్టీలతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ఆదివారం రాత్రి నుంచే అదుపులోకి తీసుకున్నారు. అయినా.. ఏబీవీపీ, పీడీఎస్‌యూ నాయకులు వరంగల్ పోచమ్మమైదాన్, హన్మకొండలోని కేయూ కూడలి వద్ద కాన్వాయ్‌కు అడ్డొచ్చారు. అయితే, అప్రమత్తంగా ఉన్న పోలీసులు వారిని నిలువరించి పక్కకు తొలగించారు. కాంగ్రెస్‌ది మొండిచేయి.. బీజేపీది గుడ్డిచేయి.. ‘కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్లుగా బీజేపీ వాళ్లు ఎగిరెగిరిపడుతున్నరు. మోదీ ఆనాడు జన్ ధన్ ఖాతా ఖోలో.. పంద్రా లాక్ లేలో.. అన్నరు. రూ.15 లక్షలు ఎంతమందికి వచ్చాయో చెప్పండి’అని మంత్రి అడిగారు. ఎవరూ స్పందించకపోవడంతో ‘కాంగ్రెసోళ్లది మొండిచేయి, బీజేపీది గుడ్డిచేయి’అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు వరంగల్ మీద ప్రేమ ఉండటం వల్లే బడ్జెట్లో ఏటా రూ.300 కోట్లిస్తూ అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వరంగల్‌లో ఒకేరోజు రూ.2,500 కోట్ల విలువైన సంక్షేమ కార్యక్రమాల ప్రారంభం, శంకుస్థాపనలు చేసుకున్నామని వెల్లడించారు. వరంగల్‌కు నియో రైలు, మామునూరుకు ఎయిర్‌పోర్టు తెస్తామని, హైదరాబాద్ గ్లోబల్ సిటీ అయితే, వరంగల్‌ను ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్‌లోని ఆడబిడ్డల దాహార్తిని రూ.1,589 కోట్లతో తీరుస్తామని మాట ఇచ్చి ఉగాదికి ఒక రోజు ముందే చేసి చూపించిన ప్రభుత్వం తమదని తెలిపారు. వరంగల్ అభివృద్ధిపై వారం రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని, దానిపై దమ్ముంటే చర్చకు రావాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ విసిరారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, వొడితెల సతీశ్‌కుమార్, చల్లా ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతలకు ఇదే చివరి హెచ్చరిక.. ‘సీఎం కేసీఆర్ వయసు, హోదా కూడా చూడకుండా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నరు. ఇదే మీకు చివరి హెచ్చరిక. కేసీఆర్‌ను దూషిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదు’అని కేటీఆర్ హెచ్చరించారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఎన్ఐటీలో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్న కేసీఆర్ నీతిఆయోగ్ లాంటి సంస్థల ప్రశంసలు అందుకున్నారని, స్వయంగా కేంద్రమే అభినందిస్తుంటే కొందరు కొత్త బిచ్చగాళ్లు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని అన్నారు. మేం నరేంద్ర మోదీ, అమిత్‌షాపై మాట్లాడవలసి వస్తుందన్నారు. ‘నేను తమ్ముడు సునీల్‌నాయక్ వీడియోను చూశా. ఐఏఎస్ కావాల్సిన వాడిని ఆత్మహత్య చేసుకుంటున్నా.. అన్న అతని మాటలు నన్ను చాలా బాధించాయి. ఐఏఎస్ నోటిఫికేషన్ కేంద్రం, యూపీఎస్సీ ఇస్తుందన్న విషయం కూడా చెప్పకుండా కొందరు రెచ్చగొట్టారు. వరుస ఎన్నికల వల్ల నోటిఫికేషన్ ఇవ్వలేకపోయాం. త్వరలోనే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తం’అని కేటీఆర్ అన్నారు. -
వరంగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన
-
ఆవిషయంపై సీఎంతో మాట్లాడుతా: కేటీఆర్
సాక్షి, వరంగల్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు శనివారం ఉదయం వరంగల్‌లో పర్యటించారు. ఈసందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో డాక్టర్ రాజయ్య ఆసుపత్రి, మెగా వైద్య శిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించారు. బస్ షెల్టర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హన్మకొండ సమ్మయ్యనగర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్వచ్ఛ వరంగల్‌లో భాగంగా 200 స్వచ్ఛ ఆటోలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. తల్లీ బిడ్డల సంక్షేమం కోసమే కేసీఆర్ కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించామన్నారు. తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష కిట్లు పంపిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కాలుష్య రహిత లెదర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించారు. యువతకు ఉపాధి కల్పించడం కోసం హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడర్గా ప్రకటించామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. -
సీఎం సభలో దొంగల చేతివాటం
సంగెం: సీఎం సభలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. సీఎం సభ వేదికపై వచ్చిన సందర్భంలో కళాకారుల వేదికపైకి ఒక్కసారిగా మహిళలు, పురుషులు ఎక్కి సీఎం కేసీఆర్‌ను చూడడానికి ఎగబడ్డారు. ఇదే అదనుగా భావించిన దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఆత్మకూర్ మండలం రాఘవాపూరానికి చెందిన మడిపెల్లి అరుణ అనే మహిళ మెడలోని మూడు తులాల పుస్తెలతాడు తెంపుకునిపోయాడు. తన మెడలోంచి పుస్తెల తాడు తెంపుకున్నట్లు గ్రహించిన మహిళ లబోది బోమని రోదిస్తు అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీ సుల కాళ్లావేళ్లపడింది. అలాగే అక్కడ కొందరి పర్సులు, సెల్పోన్లు కొట్టేసినట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
సారొస్తారా..!
సీఎం పర్యటన ఆనవాయితీ కొనసాగేనా.. 2015, 2016 జనవరిలో వచ్చిన కేసీఆర్ మూడునాలుగు రోజులపాటు జిల్లాలోనే.. ఈ ఏడాది పర్యటనపై అందరిలో ఆసక్తి వరంగల్ : తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో నిలిచిన వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత అధికారికంగా ఎక్కువ రోజులు వరంగల్ జిల్లాలోనే ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ వరంగల్‌లో పర్యటించారు. టీఆర్ఎస్ అధినేతగా తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఎక్కువసార్లు వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాతే కూడా అదే పరంపరను కొనసాగించారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక ప్రతి ఏడాది జనవరిలో వరంగల్ జిల్లాలో మూడునాలుగు రోజులు బస చేశారు. 2015, 2016 జనవరి నెలల్లో ఇదే ఒరవడిని కొనసాగించారు. వరుసగా రెండేళ్లు వరంగల్ జిల్లా పర్యటనకు ప్రాధాన్యం ఇచ్చిన కేసీఆర్... 2017లోనూ ఇదే ఆనవాయితీని కొనసాగిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై జిల్లా ప్రజల్లో, టీఆర్ఎస్ నేతల్లో చర్చ జరుగుతోంది. మొదటిసారే నాలుగు రోజులు బస 2015 జనవరిలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఏ సీఎం చేయని విధంగా కేసీఆర్ వరంగల్ నగరంలో వరుసగా నాలుగు రోజులు పర్యటించి రికార్డు సృష్టించారు. జనవరి 8న సాయంత్రం ఆకస్మికంగా వరంగల్‌కు వచ్చిన సీఎం... వరుసగా నాలుగు రోజులు జిల్లాలోనే ఉన్నారు. వస్తూ వస్తూనే వరంగల్ తూర్పు నియోకవర్గంలోని లక్ష్మీపురం, గిరిప్రసాద్‌నగర్, శాకరాసికుంట బస్తీల్లో పర్యటించారు. పేదల సమస్యలను, ప్రభుత్వ పథకాల అమలుతీరును వారితోనే అడిగి తెలుసుకున్నారు. జనవరి 9న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని దీన్‌దయాళ్‌నగర్, ప్రగతినగర్, నాగేంద్రనగర్, జితేందర్‌నగర్ బస్తీలకు వెళ్లి అక్కడి పేదలతో నేరుగా మాట్లాడారు. బస్తీ వాసుల సమస్యలను, అవసరాలను తెలుసుకున్నారు. అదే రోజు హన్మకొండలో జరిగిన అర్చక సమాఖ్య బహిరంగసభలో పాల్గొన్నారు. అనంతరం గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీపీ) గెస్ట్‌హౌస్‌లో భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జనవరి 10న వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఎస్ఆర్ నగర్,పరకాల నియోజకవర్గంలోని గరీబ్‌నగర్ బస్తీలను సందర్శించారు. జనవరి 11న వరంగల్ నగరపాలక సంస్థలోని ఆరు బస్తీల్లో కొత్తగా నిర్మించనున్న మోడల్ కాలనీలకు శంకుస్థాపన చేశారు. రెండోసారి మూడు రోజులు 2016 జనవరిలో సీఎం కేసీఆర్ వరంగల్ జిల్లాలో వరుసగా మూడు రోజులు ఉన్నారు. జనవరి 4న వరంగల్ జిల్లా పర్యటకు వచ్చారు. హైదరాబాద్–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులు, వ రంగల్–ఖమ్మం జిల్లాల మధ్య గోదావరిపై వంతెనను కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ప్రారంభించారు. జనవరి 5న గణపురం మండలం చెల్పూరులో 600 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన కేటీపీపీ రెండో దశ ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. జనవరి 6న వరంగల్ జిల్లా, గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వరంగల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. -
వరంగల్‌లో మంత్రి ఈటల పర్యటన
వరంగల్ : ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం వరంగల్ జిల్లా కమలాపూర్ మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుంచి వరంగల్ రూరల్ జిల్లా పరకాల వరకు రూ.170 కోట్లతో నిర్మిస్తున్న నాలుగులైన్ల రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. మండలంలోని ఉప్పల్ రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కమలాపూర్ పెద్ద చెరువు వద్ద, శనిగారం నడికుడ వాగులపై అదనపు వంతెనల నిర్మాణ స్థలాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్అండ్బీ చీఫ్ ఇంజినీర్ రవీందర్రావు, పలువురు అధికారులు ఉన్నారు. -
నేడు వరంగల్ వెళ్లనున్న కేసీఆర్
హైదరాబాద్: సీఎం కేసీఆర్ గురువారం వరంగల్ లో పర్యటించనున్నారు. ఎంపీ సీతారాంనాయక్ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన హన్మకొండ వెళ్లనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హన్మకొండకు చేరుకుని, అక్కడ హంటర్ రోడ్డులోని ఓ కల్యాణమంటపంలో జరిగే పెళ్లి వేడుకలో పాల్గొంటారు. తిరిగి 2 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రుల హరీశ్‌రావు, చందూలాల్ కూడా వివాహానికి హాజరవుతారు. -
కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లా పర్యటన అనూహ్యంగా రద్దయింది. శుక్రవారం జిల్లాలో పర్యటించాలనుకున్న ఆయన నేరుగా మేడారం చేరుకొని కుటుంబసభ్యులతోపాటు సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవాల్సిఉంది. అయితే కేసీఆర్ స్వల్ప అస్వస్థతతకు గురయ్యారని, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నందునే పర్యటన రద్దయిందని, తిరిగి మేడారం ఎప్పుడు వెళతారనేది త్వరలో వెల్లడిస్తామని సీఎం కార్యాలయం శుక్రవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పర్యటన రద్దుతో మడికొండలో ఏర్పాటుచేసిన ఇన్క్యుబేషన్ టవర్‌ను ప్రారంభోత్సవం, బహిరంగ సభలు వాయిదాపడ్డాయి. -
సీఎం వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు
-
సీఎం వరంగల్ పర్యటన షెడ్యూల్ ఖరారు
వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరి వరంగల్ చేరుకుంటారు. 3:55 గంటలకు మడికొండకు చేరుకుని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి వరంగల్- యాదాద్రి జాతీయ రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రానికి టీఆర్ఎస్ సీనియర్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరుకుని అక్కడే బసచేస్తారు. మంగళవారం(5వ తేదీన) ఉదయం 10:30 గంటలకు హన్మకొండ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి.. చెల్పూరు చేరుకుంటారు. అక్కడ జెన్కో నిర్మించిన 600 మెగావాట్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంటును జాతికి అంకితం చేస్తారు. మధ్యాహ్నం 1:30కు తిరిగి వరంగల్ వచ్చి.. కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది. మంగళవారం రాత్రి కూడా లక్ష్మీకాంతరావు ఇంట్లోనే సీఎం కేసీఆర్ బసచేయనున్నారు. కాగా, ముఖ్యమంత్రితో కలిసి రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసే కేంద్ర మంత్రి గడ్కరీ.. అటు నుంచి హైదరాబాద్ చేరుకుని గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మల్కాజిగిరిలో నగర బీజేపీ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి గడ్కరీ ప్రసంగిస్తారు. -
వచ్చేనెల 21న వరంగల్ ఉప పోరు
- షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ - ఈ నెల 28న నోటిఫికేషన్.. - వచ్చేనెల 24న ఓట్ల లెక్కింపు - బుధవారం నుంచే ఎన్నికల కోడ్ - 23న సీఎం కేసీఆర్ ఓరుగల్లు పర్యటన రద్దు! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: వరంగల్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 28న నోటిఫికేషన్ జారీకానుంది. వెంటనే నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే నెల 21న పోలింగ్ జరగనుంది. 24న ఓట్ల లెక్కింపు ప్రారంభించి, పూర్తికాగానే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన కడియం శ్రీహరి.. 2015 జనవరిలో రాష్ట్ర మంత్రివర్గంలో చేరారు. జూన్‌లో ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో.. ఇక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వరంగల్‌తోపాటు మధ్యప్రదేశ్‌లోని రట్లాం లోక్‌సభ స్థానానికి, ఆరు రాష్ట్రాల్లోని ఆరు శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ జారీచేసింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానాన్ని ఈ షెడ్యూలులో చేర్చలేదు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి ఆగస్టు 25న మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలతో బుధవారం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో శుక్రవారం జరగాల్సిన కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటన రద్దుకానుంది. షెడ్యూల్ ఇదీ.. అక్టోబర్ 28 : ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 4 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ నవంబర్ 5న : నామినేషన్ల పరిశీలన 7వ తేదీ వరకు : నామినేషన్ల ఉపసంహణ గడువు నవంబర్ 21న : పోలింగ్ నవంబర్ 24న : ఓట్ల లెక్కింపు -
వరంగల్‌కు రాహుల్ గాంధీ
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరును మరింత ఉదృతం చేయాలని భావిస్తోన్న కాంగ్రెస్ పార్టీ తమ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణలో పలు సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. ఆదివారం అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన సీఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఒక నిర్ణయానికి వచ్చారు. సమావేశం అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు రెండో లేదా మూడో వారంలో వరంగల్, హైదరాబాద్ నగరాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తారని చెప్పారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ఓటుకు కోట్లు కేసు తదితర అంశాలను కూడా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ చర్చించింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరును మరింత ఉదృతం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
ఫాంహౌస్‌లోనే సీఎం
కొత్త బావికి భూమి పూజ సాయంత్రం తిరుగు ప్రయాణం జగదేవ్‌పూర్: ముఖ్యమంత్రి కేసీఆర్ తనకెంతో ప్రీతిపాత్రమైన ఫాంహౌస్‌లోనే సేద దీరారు. ఖమ్మం, వరంగల్ పర్యటనను ముగించుకొని ఆదివారం సాయంత్రం మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్‌కు వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 9 గంటలకు ములుగు మండలం టీఆర్ఎస్ అధ్యక్షులు, ఫాంహౌస్ సూపర్వైజర్, తన బాల్యమిత్రుడు జహంగీర్ కారులో ప్రయాణిస్తూ ఫాంహౌస్‌లోని పంటల పరిస్థితిపై జహంగీర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం 9:40కి ఫాంహౌస్ ఈశాన్యం దిశలో కొత్త బావికి భూమి పూజ నిర్వహించినట్లు తెలిసింది. కాగా, జాయింట్ కలెక్టర్ శరత్, గడా అధికారి హన్మంతరావు సీఎంను కలిశారు. గజ్వేల్‌లో పాదయాత్ర అనంతరం అభివృద్ధి పనులు ఎలా కొనసాగుతున్నాయి అనే అంశాలపై వారితో ఆరా తీసినట్లు సమాచారం. అలాగే, టీఆర్ఎస్ గజ్వేల్ ఇన్చార్జి మడుపు భూంరెడ్డితో కూడా పార్టీ సంగతులు తదితరాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఫాంహౌస్‌కు ఎప్పటికీ వస్తా: సీఎం ఫాంహౌస్ నుంచి సాయంత్రం 5:40కి తన కాన్వాయ్‌లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఫాంహౌస్ సూపర్వైజర్, ఫాంహౌస్‌కు వచ్చిన వారితో మాట్లాడుతూ ఇక్కడకు వస్తూ ఉంటా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం. సీఎం తిరుగుప్రయాణంలో ములుగు మండలం మార్కుక్, పాములపర్తిలో ఆగి అక్కడి ప్రజలతో మాట్లాడారు. -
నిరసన సెగ
-
వరంగల్ బయల్దేరిన చంద్రబాబు
వరంగల్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన భారీ కాన్వాయ్‌తో బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా చంద్రబాబు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఘట్కేసర్, ఆలేరు, జనగామ, ఘనపూర్, మడికొండ మీదగా రోడ్డు మార్గం ద్వారా సభ జరిగే హయగ్రీవాచారి మైదానానికి ఆయన చేరుకుంటారు. అక్కడ ప్రతినిధులతో జరిగే సమావేశంలో పార్టీ పటిష్టత కోసం కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పలు సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా జరిగే ముఖ్య కార్యకర్తలతో పార్టీ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. రాత్రికి జిల్లా కేంద్రంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. -
ఏడ్నెల్ల పసిగుడ్డు ప్రభుత్వంపై ఏడుపెందుకు?
దుర్మార్గంగా అవాకులు చెవాకులు పేల్చుతున్నారు పొన్నాల దశాబ్దాలుగా మంత్రిగా ఉండి ఏం చేశారు? నాలుగేళ్లలో తాగునీళ్లివ్వకపోతే ఓట్లడగనని చెప్పిన మొగోడు కేసీఆర్ వరంగల్ పర్యటనలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ హన్మకొండ : ఏడు నెలల పసిగుడ్డు ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని, దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఏం సాధించారని మాట్లాడుతున్నారని రాష్ట్ర గ్రామీణ, పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రశ్నించారు. శనివారం పార్లమెంటరీ కార్యదర్శి దాస్యం వినయభాస్కర్‌తో కలిసి కేటీఆర్ వరంగల్ పర్యటనకు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన కె.తారకరామారావుకు టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రజా కోర్టులో గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతమైన పాలన అందిస్తున్నారన్నారు. ప్రజా కోర్టులో ఇచ్చిన తీర్పును కాదని కేసీఆర్‌పై సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేస్తామని పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ చేసిన తప్పేంటని ప్రశ్నించారు. గతంలో మీరు చేసిన తప్పిదాలకు కేసుల్లో ఇరుక్కోకుండా చూసుకోండి, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి, గీతారెడ్డి ముందుగా మీపై ఉన్న కేసుల్లో నుంచి బయటపడండి.. అని ఎద్దేవా చేశారు. పదవులకై పెదవులు మూసుకొన్న నాయకులు, దశాబ్దాలుగా మంత్రిగా ఉండి ఏం సాధించారో చెప్పాలని తూర్పారబట్టారు. మీరు ఏం చేయకపోవడంతో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారన్నారు. దుర్మార్గంగా అవాకులు చెవాకులు పేల్చుతున్నారంటూ విరుచుకుపడ్డారు. ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా మెరుగైన అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న నష్టంపై గల్లీగల్లీ తిరిగి ప్రజలందరినీ కూడగట్టి అహంకారంతో ఉన్న కాంగ్రెస్‌ను నేలకు దించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. చరిత్రలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రోజులపాటు వరంగల్‌లోనే ఉండి నాలుగు నియోజకవర్గాల్లోని పేదల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకొని వారికి పక్కా ఇళ్లు కట్టించి, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించి ఏ ఆడబిడ్డ కూడా బిందెతో రోడ్డెక్కొద్దని చెప్పడం కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాలో ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతుంటే వారి కష్టాలు చూసి రక్షిత మంచినీటిని నల్లగొండ జిల్లాతోపాటు రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు నాలుగేళ్లలో ఇంటింటికీ తాగునీటిని అందిస్తానని, లేకపోతే ఓట్లడగనని చెప్పిన మొగోడు కేసీఆర్ అన్నారు. ఎస్సీ ఎస్టీ, మైనారిటీ పేదల ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.51 వేల ఆర్థిక సహాయం అందించే కల్యాణలక్ష్మి పథకం ప్రవేశపెట్టడం, దళితులకు మూడెకరాల సాగుభూమి, పింఛన్లు రూ.200 నుంచి రూ.వె య్యి, రూ.1500లకు పెంచడమే కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ఏ తప్పు చేశారని కేసులు పెడతామని మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకుల తీరుపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణకు ఏమిచ్చిందని ప్రశ్నించారు. సింగరేణి బొగ్గు గనులున్నా, పక్కనే గోదావరున్నా కరెంట్‌కై కష్టాలు పడుతున్నామన్నారు. సీఎం కేసీఆర్ విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి సారించి మూడేళ్లలో మిగులు విద్యుత్ సాధించాలనే కార్యాచరణతో ముందుకు పోతున్నారన్నారు. -
ఇదర్భీ ఏక్ నజర్
మా వాడలకూ సీఎం సార్ వస్తారా! - ఇక్కడి సమస్యలనూ పట్టించుకుంటారా - పేదల బాధలకు పరిష్కారం దొరుకుతుందా? - కేసీఆర్ రావాలంటున్న ఇందూరువాసులు ‘‘సీఎం వస్తే అగ్గి పుట్టాలే’’ కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా అన్న మాటలివి. వరంగల్‌లో నాలుగు రోజులు బస చేసిన ఆయన మురికివాడలను సందర్శించారు. వారి సమస్యలన్నింటినీ పరిశీలించారు. మురుగుకాలువలు, రోడ్లు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, పింఛన్లు తదితర సౌకర్యాలను గురించి ప్రజలను ఆరా తీశారు. దగ్గరుండి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు. నాయకులకు చెమటలు పట్టించారు. అన్ని జిల్లాలలోనూ ఇలాగే తిరిగి జనం బాధలను తీరుస్తానన్నారు. ఇది పేదలలో ఆశలు రేకెత్తిస్తోంది. ఇందూరు మురికివాడల ప్రజలు కూడా కేసీఆర్ తమ ప్రాంతాలను పర్యటించాలని కోరుకుంటున్నారు. -
మల్లయ్యకు ఇల్లు మంజూరు
* ఇద్దరు కూతుళ్లకు చెరో రూ.5 లక్షల సాయం * మల్లయ్యను పిలిపించి మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ * తెలంగాణపై 2008లో బాబును నిలదీసిన మల్లయ్య సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పాలని అమాయకంగా ప్రశ్నించి అందరి దృష్టిని ఆకర్షించిన ఫణికర మల్లయ్యకు సీఎం కేసీఆర్ ఇల్లు మంజూరు చేశారు. ఫణికర మల్లయ్య ఇద్దరు కూతుళ్లకు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ శనివారం తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా తాను బస చేసిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసానికి మల్లయ్యను పిలిపించుకున్నారు. మల్లయ్య తన వద్దకు రాగానే ‘బాగున్నావా మల్లయ్య..’ అని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించి పిల్లల చదువు, ఆర్థిక పరిస్థితిని ఆరా తీశారు. మల్లయ్యకు పక్కా ఇల్లు మంజూరు చేశారు. ఆయన ఇద్దరు కూతుళ్లకు చెరో రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. సంక్రాంతి తర్వాత మల్లయ్యను హైదరాబాద్‌కు తీసుకురావాలని అక్కడే ఉన్న టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, టీఆర్ఎస్ జిల్లా ఇంచార్జీ పెద్ది సుదర్శన్‌రెడ్డికి సూచించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మల్లయ్య సొంత ఊరు. 2008లో చంద్రబాబునాయుడు మీ కోసం యాత్ర సందర్భంగా వరి కల్లంలో కూలీ పని చేస్తున్న మల్లయ్య దగ్గరికి వెళ్లాడు. అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాలపై చంద్రబాబు మాట్లాడుతూ... ఇంకా ఏం కావాలని మల్లయ్యను అడిగితే తెలంగాణ కావాలని అన్నారు. దాంతో చంద్రబాబు నోట మాట రాక అక్కడి నుంచి మౌనంగా జారుకున్నారు. ఈ సంఘటనతో ఫణికర మల్లయ్య తెలంగాణ వ్యాప్తంగా తెలిసిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్... స్వయంగా తనతో మాట్లాడడం సంతోషంగా ఉందని మల్లయ్య చెప్పారు. తన రెండో కూతురు రేణుక డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోందని, మూడో కూతురు పదో తరగతి చదువుతోందని చెప్పారు. రెండో కూతురుకు ఉద్యోగం ఇప్పించాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు మల్లయ్య చెప్పారు.