సాక్షి, వరంగల్ : రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారకరామారావు శనివారం ఉదయం వరంగల్‌లో పర్యటించారు. ఈసందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌లో డాక్టర్ రాజయ్య ఆసుపత్రి, మెగా వైద్య శిబిరాన్ని కేటీఆర్ ప్రారంభించారు. బస్ షెల్టర్‌ను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హన్మకొండ సమ్మయ్యనగర్‌లో డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. స్వచ్ఛ వరంగల్‌లో భాగంగా 200 స్వచ్ఛ ఆటోలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
తెలంగాణలో వైద్యారోగ్య శాఖ మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. తల్లీ బిడ్డల సంక్షేమం కోసమే కేసీఆర్ కిట్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించామన్నారు. తర్వాత ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష కిట్లు పంపిణీ చేశామని మంత్రి గుర్తు చేశారు. స్టేషన్ ఘన్‌పూర్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కాలుష్య రహిత లెదర్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామని ప్రకటించారు.
యువతకు ఉపాధి కల్పించడం కోసం హైదరాబాద్, వరంగల్ పారిశ్రామిక కారిడర్‌గా ప్రకటించామని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment