
కేసీఆర్ వరంగల్ పర్యటన రద్దు
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వరంగల్ జిల్లా పర్యటన అనూహ్యంగా రద్దయింది. శుక్రవారం జిల్లాలో పర్యటించాలనుకున్న ఆయన నేరుగా మేడారం చేరుకొని కుటుంబసభ్యులతోపాటు సమ్మక్క, సారలమ్మను దర్శించుకోవాల్సిఉంది.
అయితే కేసీఆర్ స్వల్ప అస్వస్థతతకు గురయ్యారని, జ్వరం, దగ్గుతో బాధపడుతున్నందునే పర్యటన రద్దయిందని, తిరిగి మేడారం ఎప్పుడు వెళతారనేది త్వరలో వెల్లడిస్తామని సీఎం కార్యాలయం శుక్రవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం పర్యటన రద్దుతో మడికొండలో ఏర్పాటుచేసిన ఇన్‌క్యుబేషన్ టవర్‌ను ప్రారంభోత్సవం, బహిరంగ సభలు వాయిదాపడ్డాయి.