
ఇదర్‌భీ ఏక్ నజర్
మా వాడలకూ సీఎం సార్ వస్తారా!
- ఇక్కడి సమస్యలనూ పట్టించుకుంటారా
- పేదల బాధలకు పరిష్కారం దొరుకుతుందా?
- కేసీఆర్ రావాలంటున్న ఇందూరువాసులు
‘‘సీఎం వస్తే అగ్గి పుట్టాలే’’ కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా అన్న మాటలివి. వరంగల్‌లో నాలుగు రోజులు బస చేసిన ఆయన మురికివాడలను సందర్శించారు. వారి సమస్యలన్నింటినీ పరిశీలించారు. మురుగుకాలువలు, రోడ్లు ఇళ్ల స్థలాలు, ఇళ్లు, పింఛన్లు తదితర సౌకర్యాలను గురించి ప్రజలను ఆరా తీశారు.
దగ్గరుండి వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించారు. నాయకులకు చెమటలు పట్టించారు. అన్ని జిల్లాలలోనూ ఇలాగే తిరిగి జనం బాధలను తీరుస్తానన్నారు. ఇది పేదలలో ఆశలు రేకెత్తిస్తోంది. ఇందూరు మురికివాడల ప్రజలు కూడా కేసీఆర్ తమ ప్రాంతాలను పర్యటించాలని కోరుకుంటున్నారు.