వరంగల్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం వరంగల్ జిల్లా పర్యటనకు బయల్దేరారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన భారీ కాన్వాయ్తో బయల్దేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తొలిసారిగా చంద్రబాబు వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఘట్కేసర్, ఆలేరు, జనగామ, ఘనపూర్, మడికొండ మీదగా రోడ్డు మార్గం ద్వారా సభ జరిగే హయగ్రీవాచారి మైదానానికి ఆయన చేరుకుంటారు.
అక్కడ ప్రతినిధులతో జరిగే సమావేశంలో పార్టీ పటిష్టత కోసం కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకు పలు సూచనలు చేయనున్నారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా జరిగే ముఖ్య కార్యకర్తలతో పార్టీ కార్యక్రమాలపై సమీక్షిస్తారు. రాత్రికి జిల్లా కేంద్రంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన హెలికాప్టర్లో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
వరంగల్ బయల్దేరిన చంద్రబాబు
Published Thu, Feb 12 2015 9:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement