
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 8న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. శనివారం (8న) ప్రత్యేక విమానంలో ప్ర ధాని ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయంలో దిగుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10.35 కి వరంగల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్‌లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11.30 గంటలకు హనుమ కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15కి వరంగల్ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 1.10 గంటలకి తిరిగి హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరు కుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment