3 రోజులు.. 6 బహిరంగ సభలు | Prime Minister Modis visit to the state has been finalized | Sakshi
Sakshi News home page

3 రోజులు.. 6 బహిరంగ సభలు

Published Fri, Nov 24 2023 3:48 AM | Last Updated on Fri, Nov 24 2023 3:48 AM

Prime Minister Modis visit to the state has been finalized - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన షె డ్యూల్‌ ఖరారైంది. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజులపాటు మోదీ పర్యటించనున్నారు. ఈ షెడ్యూల్‌ ప్రకారం... శనివారం మధ్యా హ్నం బెంగళూరు నుంచి కామారెడ్డికి చేరుకొని మధ్యాహ్నం 2:15 గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 4:15 గంటలకు రంగారెడ్డి జిల్లా పరిధిలో మరో బహిరంగ సభకు హాజరవుతారు. రాత్రికి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.

ఆదివారం ఉదయం 11:30 గంటలకు హైదరాబాద్‌ శివార్లలోని కన్హా శాంతివనాన్ని సందర్శిస్తారు. అక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2:15 గంటలకు దుబ్బాకలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3:45 గంటలకు నిర్మల్‌లో పార్టీ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రికి తిరుమలకు చేరుకొని అక్కడి శ్రీరచన రెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.

సోమవారం ఉదయం 8 గంటలకు శ్రీ వేంకటేశ్వర్వస్వామిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12:45 గంటలకు మహబూబాబాద్‌ చేరుకొని బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:45 గంటలకు కరీంనగర్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొన్నాక హైదరాబాద్‌ చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోచేపట్టి రాత్రి ఢిల్లీకి తిరిగివెళ్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement