చైన్‌స్నాచర్ల అవతారమెత్తిన ఇంజినీరింగ్ విద్యార్ధులు | Engineering students turn to chain snatchers | Sakshi
Sakshi News home page

చైన్‌స్నాచర్ల అవతారమెత్తిన ఇంజినీరింగ్ విద్యార్ధులు

Published Wed, Dec 25 2013 6:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

చైన్‌స్నాచర్ల అవతారమెత్తిన ఇంజినీరింగ్ విద్యార్ధులు

చైన్‌స్నాచర్ల అవతారమెత్తిన ఇంజినీరింగ్ విద్యార్ధులు

హైదరాబాద్ : నగరంలో చైన్‌స్నాచర్ల ముఠా ఆగాడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ద్విచక్రవాహనంపై తిరుగుతూ రోడ్డుపై వెళ్తున్న మహిళల నుంచి ఆభరణాలు చోరీ చేస్తున్నారు. ఒంటిరిగా మహిళలు కనిపిస్తే పాపం.. వారిపై దాడి చేసి అభరణాలను అపహరిస్తున్నారు. ఈ చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే వారిలో విద్యార్ధులే అధికంగా ఉండటం గమనార్హం. విలాసాలకు అలవాటుపడిన ఇంజినీరింగ్ విద్యార్ధులు చైన్‌స్నాచర్లగా అవతారమెత్తున్నారు. విలాసాల కోసం డబ్బులు సంపాదించేందుకు ఈ దొంగదారిని ఎంచుకుంటున్నారు.

తాజాగా నగరంలోని కేపీహెచ్బీలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టైన విద్యార్థులపై గతంలో 50కి పైగా కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ముఠాపై నిఘా పట్టి  చైన్ స్నాచర్లను పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. వీరిని స్టేషన్ కు తరలించి విచారించి చోరీల వివరాలు రాబడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement