
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల ఘటన మరువకముందే నగరంలో మరో చోట కాల్పులు కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్‌స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్‌లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా.. గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు.
కాగా, సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్‌ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉదంతంలో తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment