saidabad police
-
హైదరాబాద్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల ఘటన మరువకముందే నగరంలో మరో చోట కాల్పులు కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్‌లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా.. గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు.కాగా, సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్‌ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉదంతంలో తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. -
ఇన్‌స్ట్రాగాంలో పరిచయం.. మాయమాటలు చెప్పి.. ఆటోలో తీసుకెళ్లి..
సైదాబాద్(హైదరాబాద్): మాయమాటలు చెప్పి ఓ బాలికను పెళ్లి చేసుకున్న ఆటో డ్రైవర్‌ను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖాజాబాగ్కు చెందిన బాలిక(13) ఆరోతరగతి చదువుతుంది. గురువారం ఉదయం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలిస్తుండగా ఆటోలో వెళ్లినట్లు చూశామని స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు చెప్పారు. చదవండి: యువకుడి పాడుపని.. వివాహిత ఇంటికెళ్లి.. చేయి పట్టుకుని.. దీంతో వారు సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు ఆటో గౌరెల్లికి చెందిన శ్రీకాంత్‌కు చెందినదిగా గుర్తించారు. ఇన్‌స్ట్రాగాంలో బాలికతో పరిచయం కావడంతో శ్రీకాంత్ తరచూ ఆమె నివసించే ప్రాంతానికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో బాధితురాలికి మాయమాటలు చెప్పి గురువారం ఆటోలో తీసుకువెళ్లి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ పరిచయం.. ఐదేళ్ల ప్రేమ.. రెండుసార్లు అబార్షన్ చేయించి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పిన యువకుడు ఆమెను లోబరుచుకున్నాడు. ప్రేమ పేరుతో అయిదు సంవత్సరాలు శారీరకంగా వాడుకున్నాడు. ఈక్రమంలో రెండు సార్లు ఆమెకు అబార్షన్ కూడా చేయించాడు. అయితే తీరా పెళ్లి చేసుకోమని పట్టుబడితే ముఖం చాటేయడం మొదలుపెట్టాడు. చదవండి: ప్రాణం తీసిన పట్టింపులు.. నిశ్చితార్థం రద్దయిందని.. ఎందుకు ఇలా చేస్తున్నావని అడిగితే కులం ఒకటి కానందుకు మావాళ్ళు ఒప్పుకోవట్లేదని చేతులెత్తేశాడు. గత్యంతరం లేక బాధిత దళిత యువతి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా యువకుడు మోసం చేసినా, తనకు అతనితోనే వివాహం చేయించమని బాధితురాలు పోలీసులకు వేడుకుంది. చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి.. ఇంటి వెనకాలకు తీసుకెళ్లి.. -
తిరుమల శ్రీవారిపై వ్యాఖ్యలు.. కనిమొళిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ఎంపీ కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఎంపీ కనిమొళి ఇటీవల ఓ సమావేశంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని కించపరిచేలా ప్రసంగించారు. దానిపై హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని న్యాయవాది కషింశెట్టి కరుణాసాగర్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ 295–ఎ, 298, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని కోరారు. గురువారం ఈ పిటిషన్‌ను కోర్టు విచారించింది. కోర్టు ఆదేశాల మేరకు కనిమొళిపై సైదాబాదు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇటీవల తిరుమల శ్రీవారి ఆలయం గురించి కనిమొళి మాట్లాడుతూ.. 'దేవుడి ముందు అందరూ సమానమే అని చెబుతారు. అదంతా పచ్చి అబద్ధం. ఎక్కువ డబ్బు చెల్లించి టికెట్లు కొంటే భగవంతుడు త్వరగా ప్రత్యేక దర్శనం ఇస్తాడు. లేనిపక్షంలో 10 గంటలు, 20 గంటలు లేక రోజుల తరబడి శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చోవాలి. ఆ దేవుడు అంటే అంతే. శ్రీవారి హుండీ వద్ద సెక్యూరిటీ కాపలా ఎందుకు కాస్తున్నారు. నిజంగా అక్కడ దేవుడు ఉంటే ఆ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఏముందని' తిరుమల శ్రీవారిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డీఎంకే ఎంపీపై చెన్నైలోనూ పలువురు భక్తులు ఫిర్యాదు చేశారు. -
కల్లు తాగించి నగలు దోచుకుంటున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ : ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారికి పీకల దాకా కల్లు తాగించి నగలను దోసుకెళుతున్న ముగ్గురు మోసగాళ్లను సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 తులాల బంగారం, 40 తులాల వెండి, ఒక ఆటో , సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ శశిధర్ రాజు విలేఖరులకు వివరాలు వెల్లడించారు. హయత్ నగర్లో నివాసం ఉంటున్న తిరుపతి అనే వ్యక్తి పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తీరు మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. ఇతను ఒంటరిగా ఉన్న మహిళలను ఆటోలో ఎక్కించుకొని కల్లు కాంపౌండుకు తీసుకెళ్లి మత్తు ఎక్కేలా మందు తాగించేవాడు. స్పృహ కోల్పోయాక వచ్చిన ఆటోలోనే ఎక్కించుకొని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి వారి వద్ద ఉన్న బంగారు నగలను దోచుకొని పారిపోయేవాడు. సీసీఫుటేజీ సహాయంతో ఇతనికి సహకరిస్తున్న ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ దోపిడీలు తాము చేశామని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. -
హైదరాబాద్‌లో భారీగా కరెన్సీ నోట్లు స్వాధీనం
-
హైదరాబాద్‌లో భారీగా కరెన్సీ నోట్లు స్వాధీనం
హైదరాబాద్: బ్యాంకులకు వరుసగా సెలవులు రావడం, ఏటీఎంలలో డబ్బు లేక సామాన్యులు కష్టాలు పడుతుంటే.. మరోవైపు అక్రమ పద్ధతుల్లో నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తున్న వారి నుంచి లక్షలాది రూపాయల నగదు పట్టుబడుతోంది. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. సైదాబాద్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 29,76,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురు 15 శాతం కమీషన్ తీసుకుని కొత్త కరెన్సీ ఇచ్చి పాత నోట్ల మార్పిడికి ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను బింగి వాసు గౌడ్, బండారు వెంకటేష్, మోదుగుల మోహన్‌లుగా గుర్తించారు. పోలీసులు మరో సంఘటనలో షాద్‌నగర్ సమీపంలో భారీగా కరెన్సీ పట్టుకున్నారు. 82 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 71 లక్షల రూపాయల కొత్త కరెన్సీ ఉంది. పోలీసులు ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. h -
మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్ట్
సైదాబాద్: మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని సైదాబాద్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సైదాబాద్ డివిజన్ సెంట్రల్ బస్తీకి చెందిన మద్దిబోయిన అశోక్ బ్యాంకు ఉద్యోగిగా పని చేసి పదవీవిరమణ పొందారు. ఇంటి పక్కనే ఉన్న మహిళ పట్ల ఇతను గత కొంత కాలంగా అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో ఆమె భర్త సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అశోక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
జీహెచ్ఎంసీ డీఈ అదృశ్యం
-
జీహెచ్ఎంసీ డీఈ అదృశ్యం
హైదరాబాద్: జీహెచ్ఎంసీ సర్కిల్ -4 కార్యాలయంలో డీఈగా పనిచేస్తున్న డి.బి. సత్యనారాయణరావు ( 53) అదృశ్యమైన సంఘటన సైదాబాద్ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. సైదాబాద్ కాలనీలో నివసిస్తున్న ఆయన గత నెల 30న విధులకు వెళ్తున్నానని చెప్పి తిరిగి రాలేదు. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు సైదాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్యనారాయణ వెంట సెల్ ఫోను, ఐడీ కార్డు కూడా ఉందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఫోన్ చేస్తే స్విచాఫ్ వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.