opened fire
-
హైదరాబాద్‌లో మళ్లీ కాల్పుల కలకలం.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పుల ఘటన మరువకముందే నగరంలో మరో చోట కాల్పులు కలకలం రేగింది. గత కొన్ని రోజులుగా వరుసగా దొంగతనాలు చేస్తూ చెలరేగిపోతున్న చైన్స్నాచర్లపై సైదాబాద్ పోలీసులు కాల్పులు జరిపారు. సైదాబాద్‌లో అమీర్ గ్యాంగ్ చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పట్టుకునేందుకు వెంబడించగా.. గ్యాంగ్ పోలీసులపై ఎదురుదాడికి దిగారు. దీంతో పోలీసులు తమ వద్ద ఉన్న తుపాకులతో ఫైరింగ్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా భయపడిన అమీర్ పోలీసులకు లొంగిపోయాడు.కాగా, సికింద్రాబాద్‌లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్‌ను కాల్చాలని ప్రయత్నించగా.. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయింది. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉదంతంలో తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. -
దారుణం: కొడుకులపై తండ్రి కాల్పులు.. ఒకరి మృతి
ముంబై: ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి తన ఇద్దరు కొడుకులపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ కొడుకు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. పాటిల్ ఐరోలి సెక్టార్ 2 ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలిపారు. అయితే తండ్రితో గొడవల కారణంగా కొడుకులు విజయ్, సుజయ్ వేరుగా నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సోమవారం సాయంత్రం పాటిల్ తన కుమారులను ఓ విషయంపై మాట్లాడటానికి తన ఇంటికి పిలిచినట్లు తెలిపారు. అయితే తండ్రీ, కొడుకుల మధ్య కారు భీమాపై పెద్ద గొడవ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో పాటిల్ తన పిస్టల్ తీసుకొని తన ఇద్దరు కొడుకులపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక చికిత్స కోసం ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు పేర్క్నన్నారు. అయితే విజయ్‌కి తీవ్రగాయాలు కావడంతో మరణించినట్లు తెలిపారు. కాగా అతని సోదరుడు జయ్‌కు స్వల్ప గాయాల కావడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఈ రూ. 2 నాణెం ఉంటే లక్షాధికారి అయిపోవచ్చా? -
మిచిగాన్ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరు మృతి
మిచిగాన్(యూఎస్ఏ): సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీలోని కాంప్‌బెట్ హాల్ వద్ద శుక్రవారం గుర్తు తెలియని నల్లజాతి యువకుడు(19) జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మృతులు విద్యార్థులు కాదనీ, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం విద్యార్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక్కడి మౌంట్ ప్లెజెంట్ క్యాంపస్‌లో 20వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత రెండు వారాల క్రితం ఫ్లోరిడాలోని స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్లో ఓ మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే. -
హెడ్ కానిస్టేబుల్ కాల్పులు: ముగ్గురు మృతి
పూనె: ఇండియా రిజర్వ్ మెటాలియన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఇతడికి స్టేట్ రిజర్వు పోలీసు ఫోర్సు క్యాంప్‌లో పోస్టింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడికి 80 కి.మీ. దూరంలోని డౌన్ టౌన్లో ఈ హెడ్ కానిస్టేబుల్ మంగళవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన అనంతరం అతను ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి లోపల తాళం వేసుకున్నాడని, అతడిని బయటకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పోలీసు అధికారి చెప్పారు. మృతులలో ఒకరు ఈ హెడ్ కానిస్టేబుల్‌కు బంధువని తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉందన్నారు. -
పాక్ కాల్పులు...ఐదుగురికి గాయాలు
జమ్మూ: పాకిస్తాన్ దళాలు ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు పౌరులు గాయపడ్డారు. వారిలో ఒక మహిళ, ఇద్దరు బాలురు ఉన్నారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. భారత దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని ఓ అధికారి వెల్లడించారు. ఆగస్టు 24న ఇరు దేశాల అధికారులు శాంతి స్థాపనపై నియంత్రణ రేఖ వద్ద చర్చించిన అనంతరం జరిగిన తొలి కాల్పుల సంఘటన ఇదే. ముగ్గురు పాకిస్తాన్ రేంజర్లను పరŠాగ్వల్ ప్రాంతంలో హతమార్చామని బీఎస్ఎఫ్ చెప్పిన మరుసటి రోజే పాక్ దళాలు కాల్పులకు తెగబడటం గమనార్హం. -
ఆగని పాక్ కాల్పులు
జమ్మూ: జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ బలగాల దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్మూ జిల్లా ఆర్ఎస్ పురా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న గ్రామాలు, ఆర్మీ స్థావరాలపై పాక్ రేంజర్లు శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు భారీగా కాల్పులు, మోర్టారు బాంబు దాడులకు పాల్పడ్డారు. వీటిని భారత బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. శుక్రవారం భారత జవాన్ల ఎదురు కాల్పుల్లో ఏడుగురు పాక్ రేంజర్లు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోటానా ఖుర్ద్, అబ్దులియాన్‌లలో పొరుగు దేశ బలగాలు కాల్పులకు తెగబడ్డాయని, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ డీకే ఉపాధ్యాయ చెప్పారు. ఈ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు భారత జ వాన్ ఒకరు కాపలా టవర్ నుంచి కిందికి దూకాడని, అతని కాలికి గాయాలయ్యాయని తెలిపారు. పాక్ కాల్పుల వల్ల హిరానగర్ సెక్టార్‌లోని వెయ్యిమంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారని చెప్పారు. బాబియా గ్రామం నుంచి 400 మందిని ఆర్మీకి చెందిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
మీ నాన్న లేడమ్మా...
దేశ సరిహద్దులో పాక్ దళాల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను మృతి స్వగ్రామం తూపల్లిలో విషాద చాయలు కన్నీరు మున్నీరైన భార్య అపర్ణ రెండేళ్ల కూతురును పట్టుకుని గుండెలవిసేలా రోదన కదిరి: ‘మా నాన్న వస్తాడు.. నాకు కొత్త బట్టలు తెస్తాడు.. టపాకాయలు తెస్తాడు.. ఊరందరికీ పంచుతానని చెప్పావే.. ఇంకెక్కడ మీ నాయన తల్లీ.. మీ నాన్న చచ్చిపోయాడంట.. ఇంగ మనకు దిక్కెవరు? నీకు నేను.. నాకు నువ్వు.. మనిద్దరమే మిగిలిపోతిమి.. మా నాన్న తుపాకీ పట్టుకుని దొంగోళ్లను తరిమేస్తాడని ముద్దు ముద్దుగా చెప్పితివి కదే.. ఇపుడు ఆ పాకిస్తాన్ దొంగేళ్లే దొంగచాటున కాల్చేశారే.. ఓరి దేవుడా.. మాకు ఇంత అన్యాయం చేశావేమిరా..’ అంటూ భారత్-పాక్ సరిహద్దుల్లో పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన అనిల్‌కుమార్‌రెడ్డి(31) భార్య అపర్ణ తన రెండేళ్ల చిన్నారి త్రిపురను పట్టుకొని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ దృశ్యాన్ని చూసిన గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. తలుపుల మండలం తూపల్లికి చెందిన ఇంద్రావతమ్మ, నాగేంద్రరెడ్డి దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కొడుకు ధనుంజయ్‌రెడ్డి, రెండో కొడుకు సుదర్శన్‌రెడ్డి వీరిద్దరూ స్వగ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. మూడో కొడుకు అనిల్‌కుమార్‌రెడ్డి చిన్నప్పటి నుండి తాను సైన్యంలో చేరి దేశం కోసం పోరాటం చేయాలంటుండేవాడు. తాను అనుకున్నట్లు గానే 2003లో బీఎస్ఎఫ్ జవానుగా చేరారు. విధి నిర్వహణలో అందరికంటే ముందుండే వాడని సహచరులు చెప్పారు. గురువారం అర్ధరాత్రి పూంచ్ సెక్టార్లో ఉన్నట్లుండి పాకిస్తాన్ వైపు నుంచి కాల్పులు ప్రారంభం కావడం.. అనిల్ దేహంలో బుల్లెట్లు చొచ్చుకు పోవడం ఊహించని రీతిలో జరిగిపోయిందని తోటి జవాన్ల ద్వారా కుటుంబ సభ్యులకు తెలిసింది. ‘జై భారత్.. జైజై భారత్’ అని బిగ్గరగా అరుస్తూ ప్రాణాలు వదిలాడని వారు చెప్పారు. ఇతను నాలుగేళ్ల క్రితం ధర్మవరం మండలం కనంపల్లికి చెందిన అపర్ణను వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర సంవత్సరాల త్రిపుర అనే కుమార్తె ఉంది. ‘దీపావళి పండుగకు సెలవు దొరికింది. నేను ఊరికి వస్తాను. నిన్ను, నా కూతురును, మా అమ్మా, నాన్నను చూడాలని ఉంది’ అని రెండు రోజుల క్రితమే అతను భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. ఇంతలోనే ఇలా జరగడంతో వారి బాధ వర్ణణాతీతం. మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తీసుకురానున్నారు. మృతదేహం చేరుకునే సమయాన్ని బట్టి శనివారం లేదా ఆదివారం అంత్యక్రియలు ని ర్వహిస్తారని బంధువులు తెలిపారు. అనిల్ మృతిపై కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు డా.సిద్దారెడ్డి, తలుపుల సింగిల్ విండో అధ్యక్షుడు పూల శ్రీనివాసరెడ్డి, పలువురు స్థానిక ప్రముఖులు సంతాపం తెలిపారు. -
యూఎస్‌లో వ్యక్తి కాల్పులు: ఇద్దరు మృతి
అమెరికాలోని పెన్సిల్వేనియా పట్టణంలో రాస్ టౌన్షిప్లో జరుగుతున్న సమావేశంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా మంగళవారం వెల్లడించింది. ఆ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. వారిలో ఇద్దరు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని ప్రత్యేక విమానంలో లీహై వ్యాలీలోని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుందని చెప్పింది. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని మీడియా తెలిపింది.