మిచిగాన్‌ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరు మృతి | 2 killed at Central Michigan University, gunman 'armed and dangerous | Sakshi
Sakshi News home page

మిచిగాన్‌ వర్సిటీలో కాల్పులు.. ఇద్దరు మృతి

Published Sat, Mar 3 2018 2:29 AM | Last Updated on Sat, Aug 25 2018 5:41 PM

2 killed at Central Michigan University, gunman 'armed and dangerous - Sakshi

మిచిగాన్‌(యూఎస్‌ఏ): సెంట్రల్‌ మిచిగాన్‌ యూనివర్సిటీలోని కాంప్‌బెట్‌ హాల్‌ వద్ద శుక్రవారం గుర్తు తెలియని నల్లజాతి యువకుడు(19) జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మృతులు విద్యార్థులు కాదనీ, వ్యక్తిగత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న ఆగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన అనంతరం విద్యార్థులను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక్కడి మౌంట్‌ ప్లెజెంట్‌ క్యాంపస్‌లో 20వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గత రెండు వారాల క్రితం ఫ్లోరిడాలోని స్టోన్‌మన్‌ డగ్లస్‌ హైస్కూల్‌లో ఓ మాజీ విద్యార్థి జరిపిన కాల్పుల్లో 17 మంది చనిపోయిన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement