హెడ్‌ కానిస్టేబుల్‌ కాల్పులు: ముగ్గురు మృతి | three killed in fire opened by Head constable | Sakshi
Sakshi News home page

హెడ్‌ కానిస్టేబుల్‌ కాల్పులు: ముగ్గురు మృతి

Published Tue, Jan 16 2018 4:56 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

three killed in fire opened by Head constable

పూనె: ఇండియా రిజర్వ్‌ మెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఇతడికి స్టేట్‌ రిజర్వు పోలీసు ఫోర్సు క్యాంప్‌లో పోస్టింగ్‌ ఇచ్చారు. అయితే ఇక్కడికి 80 కి.మీ. దూరంలోని డౌన్‌ టౌన్‌లో ఈ హెడ్‌ కానిస్టేబుల్‌ మంగళవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన అనంతరం అతను ఓ ఫ్లాట్‌లోకి వెళ్లి లోపల తాళం వేసుకున్నాడని, అతడిని బయటకు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పోలీసు అధికారి చెప్పారు. మృతులలో ఒకరు ఈ హెడ్‌ కానిస్టేబుల్‌కు బంధువని తెలిపారు. వివరాలు తెలియాల్సి ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement