నల్లజాతి యువకుడిపై పోలీసుల పిడిగుద్దులు | Police man repeatedly punches an unarmed black teenager in Maryland | Sakshi
Sakshi News home page

నల్లజాతి యువకుడిపై పోలీసుల పిడిగుద్దులు

Published Thu, Dec 24 2015 4:10 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

నల్లజాతి యువకుడిపై పోలీసుల పిడిగుద్దులు - Sakshi

నల్లజాతి యువకుడిపై పోలీసుల పిడిగుద్దులు

న్యూయార్క్: అమెరికాలో ఇంకా నల్ల జాతీయులపట్ల వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పేందుకు ఈ ఘటన ఓ తాజా ఉదాహరణ. వారిపై దాడులు చేసేందుకు ప్రత్యేక కారణమంటూ ఉండదని అర్థం చేసుకునేందుకు  పోలీసులు చేసిన ఈ దాడి ఓ సజీవ సాక్ష్యం. మేరిలాండ్ లో కెమెరాకు పోలీసులు చేసిన ఓ దుశ్చర్య చిక్కింది. దాని ప్రకారం టోసన్ పట్ణణంలో ఓ నల్లజాతి యువకుడిపై పోలీసులు ఏ కారణం లేకుండానే దాడి చేశారు.

అతడి చేతిలో ఎలాంటి ఆయుధం లేకున్నా ఉన్నట్లుగా అనుమానించి ఒక పోలీసు అధికారి అతడి చొక్కాపట్టుకునిలాగి కిందపడేయగా మరో పోలీసు అధికారి అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఈ వీడియో తాజాగా బయటపడటంతో ప్రస్తుతం ఆ పోలీసు అధికారి ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ సంబంధిత ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement