పాక్‌ కాల్పులు...ఐదుగురికి గాయాలు | BSF jawan injured in Pakistan firing on International Borders | Sakshi
Sakshi News home page

పాక్‌ కాల్పులు...ఐదుగురికి గాయాలు

Published Mon, Aug 28 2017 1:20 AM | Last Updated on Tue, Sep 12 2017 1:07 AM

BSF jawan injured in Pakistan firing on International Borders

జమ్మూ: పాకిస్తాన్‌ దళాలు ఆదివారం జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఐదుగురు పౌరులు గాయపడ్డారు. వారిలో ఒక మహిళ, ఇద్దరు బాలురు ఉన్నారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. భారత దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయని ఓ అధికారి వెల్లడించారు.

ఆగస్టు 24న ఇరు దేశాల అధికారులు శాంతి స్థాపనపై నియంత్రణ రేఖ వద్ద చర్చించిన అనంతరం జరిగిన తొలి కాల్పుల సంఘటన ఇదే. ముగ్గురు పాకిస్తాన్‌ రేంజర్లను పరŠాగ్వల్‌ ప్రాంతంలో హతమార్చామని బీఎస్‌ఎఫ్‌ చెప్పిన మరుసటి రోజే పాక్‌ దళాలు కాల్పులకు తెగబడటం గమనార్హం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement