బెంగళూరులో పెద్దసంఖ్యలో నిర్బంధం
గుట్టుగా మారుపేర్లతో మకాం
లోతుగా పోలీసుల దర్యాప్తు
పాకిస్తాన్ అంటే భారత్‌కు ఎంత శతృదేశమో తెలియనిది కాదు. జమ్ము కశ్మీర్‌లో ఎడతెగని ఉగ్రవాదాన్ని నడిపిస్తోంది. దీంతో పచ్చని లోయ నెత్తుటి మడుగులా మారింది. దేశంలో పేలుళ్లకు తరచూ కుట్రలు చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో బెంగళూరులోను, రాష్ట్రంలోను పాకిస్తానీలు పట్టుబడడం చర్చనీయాంశమైంది.
బనశంకరి: గత కొద్దిరోజులుగా బెంగళూరులోని జిగిణిలో అక్రమంగా మకాం వేసిన ఏడుమంది పాకిస్తాన్ పౌరులను పోలీసులు కనుగొని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో బెంగళూరు, దావణగెరె ప్రాంతాల్లో మరికొందరు పాకిస్తానీలను నిర్బంధించారు. తాజాగా దాడులు నిర్వహించి బుధవారం మరో 14 మంది పాకిస్తాన్ పౌరులను జిగిణి పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుతో సహా ఉత్తర కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో వీరు పట్టుబడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి దొరికిన పాకిస్తానీల సంఖ్య 22కు పెరిగింది.
మత ప్రచారం పేరుతో
భారత్‌లో, అందులోనూ కన్నడనాట పాకిస్తాన్ పౌరులు పెద్దసంఖ్యలో తలదాచుకున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు వారిని లోతుగా విచారించి సమాచారం రాబడుతున్నారు. వీరందరూ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో మకాం పెట్టారు. ఈ కేసు కింగ్‌పిన్, మెహదీ ఫౌండేషన్ ముఖ్యుడు పర్వేజ్ ఢిల్లీలో అరెస్ట్ కాగా, అతని నుంచి పోలీసులు పాకిస్తాన్ పౌరుల గురించి ఆరా తీస్తున్నారు. జిగిణిలో పాకిస్తాన్ పౌరులు అరైస్టెన వెంటనే మరింత దర్యాప్తు కోసం 4 బృందాలను ఏర్పాటుచేసి వివిధ రాష్ట్రాలకు పంపించారు. చైన్నె, ఢిల్లీ, హైదరాబాద్ కు తరలిన పోలీసులు బృందం మెహదీ ఫౌండేషన్‌తో టచ్‌లో ఉన్న 22 మందిని అరెస్ట్ చేశారు. అరైస్టెన పాకిస్తాన్ పౌరులందరూ మత ప్రచారం కోసం భారత్ కు దొంగచాటుగా వచ్చి వివిధ రాష్ట్రాల్లో మకాంపెట్టినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. వీరు స్థానికుల పేర్లతో ఆధార్, రేషన్ తదితరాలను తీసుకోవడం వెనుక పెద్ద కుట్రే ఉందనే అనుమానాలున్నాయి.
బయటకు రాకుండా ఇంట్లోనే
పీణ్యాలో నివాసం ఉండే పాకిస్తాన్ దంపతులను పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఈ దంపతులు మూడేళ్ల నుంచి పీణ్యా ఆంధ్రహళ్లి మెయిన్‌రోడ్డులోని ఇంట్లో రహస్యంగా మకాం వేసినట్లు తెలిసింది. బయటికి రాకుండా ఇంట్లోనే గడిపేవారు. పేర్లు కూడా మార్చుకున్నారు. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఎందుకు ఉంటున్నారు? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. 2019లో బెంగళూరు నగరానికి చేరుకున్న పాకిస్తానీ సయ్యద్, అతని కుటుంబం మతప్రచారం చేస్తున్నారు. అంతకు ఐదేళ్ల కిందటే భారత్‌లోకి చొరబడ్డారు. యూట్యూబ్‌లో మత ప్రచార కార్యక్రమాలు పోస్టు చేసేవారు. నకిలీ పేర్లతో అందరూ ఆధార్‌కార్డు తయారు చేసుకున్నట్లు తేలింది. ఈ వ్యవహారంపై హోం మంత్రి పరమేశ్వర్ మాట్లాడుతూ పాకిస్తాన్ పౌరులు కుటుంబం బెంగళూరులో నివాసం ఉన్నట్లు తెలిసి పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. మిగిలిన పాకిస్తానీల ఆచూకీ కనిపెడతామని, ఈ విషయంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment