జమ్మూకశ్మీర్‌లో 60 శాతం పాక్‌ టెర్రరిస్ట్‌లు హతం | 75 Terrorists Eliminated in Jammu and Kashmir This Year, Majority Linked to Pakistan | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌లో 60 శాతం పాక్‌ టెర్రరిస్ట్‌లు హతం

Published Sun, Dec 29 2024 3:27 PM | Last Updated on Sun, Dec 29 2024 4:16 PM

75 Terrorists Eliminated in Jammu and Kashmir This Year, Majority Linked to Pakistan

ఢిల్లీ : భారత ఆర్మీ జవాన్లు ప్రాణాలకు తెగించి ఇప్పటి వరకు జమ్మూకశ్మీర్‌లో సుమారు 60 శాతం పాకిస్తాన్‌ తీవ్ర వాదుల్ని హత మార్చినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటి ప్రతి ఐదురోజులకు ఒక టెర్రరిస్ట్‌ను, మొత్తంగా 75 మంది టెర్రరిస్ట్‌లను మట్టుబెట్టామని తెలిపారు. వారిలో అధిక శాతం(60) పాక్‌ ముష్కరులు ఉన్నట్లు నిర్ధారించారు.

ఆర్మీ అధికారుల నివేదిక ప్రకారం.. జమ్మూ ప్రాంతంలోని ఐదు జిల్లాలు-జమ్మూ, ఉధంపూర్, కథువా, దోడా, రాజౌరిలో మరణించిన 42 మందిలో స్థానికేతర ఉగ్రవాదులు ఎక్కువ మంది ఉన్నారని డేటా వెలుగులోకి వచ్చింది. స్థానికేతర కశ్మీర్ లోయలోని బారాముల్లా, బందిపొరా, కుప్వారా, కుల్గాం జిల్లాల్లో విదేశీ ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

జమ్మూ కశ్మీర్‌లోని తొమ్మిది జిల్లాలలో బారాముల్లాలో అత్యధికంగా తొమ్మిది ఎన్‌కౌంటర్లలో 14 మంది స్థానికేతర ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లాలో అత్యధికంగా ఉరీ సెక్టార్‌లోని సబురా నాలా ప్రాంతం, మెయిన్ ఉరి సెక్టార్, కమల్‌కోట్ ఉరి నియంత్రణ రేఖ వెంబడి, చక్ తప్పర్ క్రిరి, నౌపోరా, హడిపొర, సాగిపోరా, వాటర్‌గామ్, రాజ్‌పూర్‌లోని లోతట్టు ప్రాంతాలలో ఆర్మీ జవాన్లు హతమార్చారు.  
నియంత్రణ రేఖ (Line of Control (LoC),ఇంటర్నేషనల్‌ బోర్డర్‌ (ఐబీ)17 మంది, జమ్మూకశ్మీర్‌ అంతర్గత ప్రాంతాల్లో 26 మందిని భారత ఆర్మీ అదుపులోకి తీసుకుంది. అదే సమయంలో తీవ్రవాద కార్యకలాపాలు పెరగకుండా భద్రత బలగాలు ప్రముఖ పాత్ర పోషించాయి. 

జమ్మూ కశ్మీర్‌లో పనిచేస్తున్న స్థానిక ఉగ్రవాదుల ఉనికి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని, ప్రధానంగా పాకిస్తానీ ఉగ్రవాదులు ఈ ప్రాంతంలో చురుకుగా ఉన్నారని సంఖ్యలు సూచిస్తున్నాయి. స్థానిక ఉగ్రవాద సంస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఓ అధికారి తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్‌లో 60 ఉగ్రదాడి ఘటనల్లో 32 మంది పౌరులు, 26 మంది భద్రతా దళాల సిబ్బందితో సహా మొత్తం 122 మంది చనిపోయారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement