KPHB chain snatching
-
హైదరాబాద్ లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్..
-
కూకట్‌పల్లిలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్.. మహిళను ఫాలో అవుతూ..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కెపీహెచ్బీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. ఓ మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసును దొంగిలించాడు. కెపిహెచ్బి కాలనీకు చెందిన పద్మజారెడ్డి గతరాత్రి కిరాణా షాపుకు వెళ్లి వస్తుండగా ఓ అగంతకుడు ఆమెను ద్విచక్ర వాహనంపై వెంబడించాడు. అనంతరం ఆమె నివసించే సాయి పవన్ ప్రైడ్ అపార్ట్మెంట్ వరకు వచ్చిన అతడిని పద్మజారెడ్డి, నీకు ఎవరు కావాలని నిలదీసింది. తాను సత్యనారాయణ అనే వ్యక్తి కోసం వచ్చినట్లు తెలిపాడు. ఆ పేరుతో ఎవరూ లేరని పద్మజారెడ్డి తెలిపింది. ఇంతలో ఫోన్ కలవటం లేదని మాట్లాడుతూ లిఫ్ట్ వద్ద నిలబడిన ఆమె మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు లాకెళ్లాడు. దుండగుడిని నిలువరించే ప్రయత్నంలో తాను కిందపడిపోయానని, తాను లేచి వెళ్లి చూసే సరికి ద్విచక్ర వాహనం పై దొంగ పారిపోయాడని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: మహిళలతో వివాహేతర సంబంధం.. గ్యాస్‌లీక్ చేసి చంపాలని.. -
చైన్‌స్నాచర్ల అవతారమెత్తిన ఇంజినీరింగ్ విద్యార్ధులు
హైదరాబాద్ : నగరంలో చైన్‌స్నాచర్ల ముఠా ఆగాడాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ద్విచక్రవాహనంపై తిరుగుతూ రోడ్డుపై వెళ్తున్న మహిళల నుంచి ఆభరణాలు చోరీ చేస్తున్నారు. ఒంటిరిగా మహిళలు కనిపిస్తే పాపం.. వారిపై దాడి చేసి అభరణాలను అపహరిస్తున్నారు. ఈ చైన్ స్నాచింగ్ ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడే వారిలో విద్యార్ధులే అధికంగా ఉండటం గమనార్హం. విలాసాలకు అలవాటుపడిన ఇంజినీరింగ్ విద్యార్ధులు చైన్స్నాచర్లగా అవతారమెత్తున్నారు. విలాసాల కోసం డబ్బులు సంపాదించేందుకు ఈ దొంగదారిని ఎంచుకుంటున్నారు. తాజాగా నగరంలోని కేపీహెచ్బీలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులలో ఆరుగురు ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీ బంగారం స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టైన విద్యార్థులపై గతంలో 50కి పైగా కేసులు ఉన్నట్టు పోలీసులు చెప్పారు. ఈ ముఠాపై నిఘా పట్టి చైన్ స్నాచర్లను పట్టుకుని అరెస్ట్ చేశామన్నారు. వీరిని స్టేషన్ కు తరలించి విచారించి చోరీల వివరాలు రాబడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.