Chain Snatching In KPHB Colony At Kukatpally, CCTV Video Goes Viral - Sakshi
Sakshi News home page

Kukatpally Chain Snatching: కూకట్‌పల్లిలో రెచ్చిపోయిన చైన్‌ స్నాచర్.. మహిళను ఫాలో అవుతూ.. అపార్ట్‌మెంట్‌కు వచ్చి మరీ..

Published Wed, Jan 5 2022 5:48 PM | Last Updated on Wed, Jan 5 2022 7:33 PM

Chain Snatching In KPHB Colony at Kukatpally - Sakshi

సాక్షి, హైదరాబాద్: నగరంలోని కెపీహెచ్‌బీ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ చైన్‌ స్నాచర్ రెచ్చిపోయాడు. ఓ మహిళ మెడలో 4 తులాల బంగారు గొలుసును దొంగిలించాడు. కెపిహెచ్‌బి కాలనీకు చెందిన పద్మజారెడ్డి గతరాత్రి కిరాణా షాపుకు వెళ్లి వస్తుండగా ఓ అగంతకుడు ఆమెను ద్విచక్ర వాహనంపై వెంబడించాడు. అనంతరం ఆమె నివసించే సాయి పవన్ ప్రైడ్ అపార్ట్‌మెంట్‌ వరకు వచ్చిన అతడిని పద్మజారెడ్డి, నీకు ఎవరు కావాలని నిలదీసింది. తాను సత్యనారాయణ అనే వ్యక్తి కోసం వచ్చినట్లు తెలిపాడు. ఆ పేరుతో ఎవరూ లేరని పద్మజారెడ్డి తెలిపింది.

ఇంతలో ఫోన్ కలవటం లేదని మాట్లాడుతూ లిఫ్ట్ వద్ద నిలబడిన ఆమె మెడలో నుంచి 4 తులాల బంగారు గొలుసు లాకెళ్లాడు. దుండగుడిని నిలువరించే ప్రయత్నంలో తాను కిందపడిపోయానని, తాను లేచి వెళ్లి చూసే సరికి ద్విచక్ర వాహనం పై దొంగ పారిపోయాడని బాధితురాలు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: మహిళలతో వివాహేతర సంబంధం.. గ్యాస్‌లీక్‌ చేసి చంపాలని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement