పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అగంతకులు ఓ మహిళ మెడలోని బంగారు నల్లపూసల తాడును అపహరించుకుపోయారు. వేణుగోపాల స్వామి గుడివీధిలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అనంతబోయిన సూర్యమహాలక్ష్మి తమ బంధువుల ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి ఇంటికి వెళుతున్నారు.
ఇంతలో పల్సర్ బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకులు ఆమె మెడలోని నాలుగు కాసుల బంగారు నల్లపూసల తాడును తెంపుకుపోయారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.